మహీంద్రా థార్ AX AO కొత్త బేస్ వేరియంట్‌.. ఫీచర్స్, ధర వివరాలు.

మహీంద్రా: కొత్త ఫీచర్లు మహీంద్రా SUVలకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో ఆఫ్ రోడ్ లో కూడా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వగలవు. అందుకే వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా మోడల్ ను ఆ సంస్థ ప్రవేశ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా బుకింగ్స్ రావడం సాధారణమే. మహీంద్రా & మహీంద్రా నుంచి విడుదలైన మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా థార్  AX AO  ఫీచర్స్ భారతీయ మార్కెట్లో […]

Share:

మహీంద్రా: కొత్త ఫీచర్లు

మహీంద్రా SUVలకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో ఆఫ్ రోడ్ లో కూడా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వగలవు. అందుకే వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా మోడల్ ను ఆ సంస్థ ప్రవేశ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా బుకింగ్స్ రావడం సాధారణమే. మహీంద్రా & మహీంద్రా నుంచి విడుదలైన మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మహీంద్రా థార్  AX AO  ఫీచర్స్

భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ ఆఫ్-రోడర్ SUVగా దీనికి పేరుంది. భారతీయ మార్కెట్లో ప్రస్తుత వెర్షన్ మహీంద్రా థార్ మోడల్ కు అధిక డిమాండ్‌తో రికార్డు స్థాయిలో అమ్ముడు పోతున్నాయి. ఈ డిమాండ్ పెరుగుదల కారణంగా.. మహీంద్రా థార్ కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా రోజురోజుకు మరింత పెరుగుతోంది.

మహీంద్రా త్వరలో తన SUV లైనప్ కోసం BS6 ఫేజ్ 2 కొత్త వేరియంట్‌ ను విడుదల చేస్తుంది. BS6 2 థార్ ఆటోమేకర్ త్వరలో థార్ లైనప్‌లో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయనుంది. మహీంద్రా థార్ కొత్త వేరియంట్‌ త్వరలో రివిజన్‌ను పొందుతుందని వెల్లడించింది. ప్రస్తుత AX (O) , LX వేరియంట్‌లతో పాటు, ఆఫ్-రోడర్ కొత్త AX (AC) వేరియంట్‌లో కూడా అందించబడుతుంది. కొత్త ట్రిమ్ AX (O) వేరియంట్ కంటే తక్కువగా ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

మహీంద్రా థార్

AX (AC) వేరియంట్ యొక్క ఖచ్చితమైన ఫీచర్ జాబితా ఇంకా తెలియదు. కాకపోతే అదే లైనప్ లో ఉన్న జంప్ సీట్లతో అందుబాటులో ఉన్న AX (O) వెర్షన్‌లా కాకుండా.. కొత్తది ముందువైపు రెండవ వరుస సీట్లను పొందవచ్చని భావిస్తున్నారు.

థార్ BS6 2 ఇంజన్..

మహీంద్రా థార్ ఇంజిన్ షాట్

ఇటీవల లీక్ అయిన పత్రం ప్రకారం.. థార్‌లో డీజిల్, పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లు త్వరలో BS6 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయనున్నారు. ప్రస్తుతం.. థార్‌లో రెండు డీజిల్ ఇంజన్‌లు (1.5-లీటర్ , 2.2-లీటర్), ఒక పెట్రోల్ ఇంజన్ (2.0-లీటర్) ఉన్నాయి. రెండు మిల్లులు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఉంటాయి.

ధర సుమారు రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) 

SUV అమ్మకాల్లో ఇప్పటికీ టాప్..

కొత్త తరం మహీంద్రా థార్ 2020లో ప్రారంభించినప్పటి నుంచి భారీ విజయాన్ని సాధించింది. ఈ థార్ SUV ప్రత్యేక కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆటోమేకర్ కంపెనీ థార్ SUVలో అనేక అప్‌డేట్‌లు, వేరియంట్‌ను అందించడానికి సన్నద్ధమవుతోంది. ఇటీవల ప్రారంభించిన వెనుక చక్రాల డ్రైవ్ (RWD) వేరియంట్‌లు ఈ థార్ కి మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. థార్ త్వరలో కొత్త ఎంట్రీ-లెవల్ 4×4 వేరియంట్‌ను విడుదల చేయనుంది. మహీంద్రా థార్ ఆఫ్-రోడర్ 4×4 వేరియంట్ గురించి అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. బేస్ AX AC ట్రిమ్ తో కొన్ని మోడిఫికేషన్స్ తో రానుంది. ఈ ధార్ AX AC 4×4 ట్రిమ్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. కానీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే ఈ SUV రానుంది.

మారుతీ జిమ్నీతో పోటీ..

మారుతీ జిమ్నీ నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్​ పై మహీంద్రా అండ్​ మహీంద్రా భారీ ఆశలు పెట్టుకుంది. సేల్స్​ తగ్గకుండా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటుంది. మారుతీ జిమ్నీకి సంబంధించిన ధరల వివరాలు ఇంకా వెలువడలేదు. కాగా.. ఇది రూ. 9.5లక్షలు- రూ. 13లక్షలు.  ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న మహీంద్రా థార్​ 4X4 మోడల్స్​ ధరల కన్నా ఇది చాలా తక్కువ. ఎం అండ్​ ఎం.. వెంటనే రంగంలోకి దిగి, థార్​కు కొత్త వేరియంట్​ను తీసుకొస్తోంది.