తక్కువ ధరకే కొత్త ఐఫోన్లను అందిస్తున్న దేశాలివే

కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఆసక్తి ఉంటే ఇప్పుడే తెప్పించుకోండి. ఆపిల్ ఐఫోన్ 15 అధికారికంగా గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది. ఎప్పటిలాగే, ఐఫోన్ ధరలపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. ఆన్‌లైన్‌లో సైతం ఆపిల్ ఐఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీరు అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ డీల్‌ల కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. అతి తక్కువ ఖర్చుతో […]

Share:

కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఆసక్తి ఉంటే ఇప్పుడే తెప్పించుకోండి.

ఆపిల్ ఐఫోన్ 15 అధికారికంగా గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది. ఎప్పటిలాగే, ఐఫోన్ ధరలపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. ఆన్‌లైన్‌లో సైతం ఆపిల్ ఐఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీరు అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ డీల్‌ల కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. అతి తక్కువ ఖర్చుతో కొత్త ఐఫోన్ 15 సిరీస్ సొంతం చేసుకోవచ్చు. అయితే, ఆయా దేశాల్లో మీకు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉంటే వెంటనే ఐఫోన్ 15 సిరీస్ తక్కువ ధరకే తెప్పించుకోవచ్చు.

ప్రత్యేకించి, ఇతర దేశాలతో పోలిస్తే.. చారిత్రక ధరల వ్యత్యాసాల కారణంగా భారతీయ మార్కెట్ ఐఫోన్ల ధరను నిశితంగా పరిశీలిస్తోంది. అదృష్టవశాత్తూ, ఆపిల్ బేస్ ఐఫోన్ 15 ధరలను తక్కువ ధరకు పొందవచ్చు. అయితే, ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఇప్పుడు అమెరికాలో 100 డాలర్లకు పైగా ఖరీదైనది ఉంది. అదే, భారత మార్కెట్‌తో పోలిస్తే.. రూ. 20వేలు ఖరీదైనదిగా ఉంది. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఏయే దేశాల్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ అత్యంత సరసమైన ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివిధ దేశాలలో అత్యల్ప ఐఫోన్ 15 ధరలివే :

* అమెరికాలో ఐఫోన్ 15 ధర 999 డాలర్లు.. (భారత్‌లో రూ.66,208)

* చైనాలో ఐఫోన్ 15 ధర RMB 5,999, (భారత కరెన్సీలో ధర రూ. 69,124)

* థాయిలాండ్‌లో ఐఫోన్ 15 ధర THB 32,900 (భారత్ ధర రూ. 76,472)

ఐఫోన్ 15 ధరలు ఒక దేశం నుంచి మరొక దేశానికి గణనీయంగా మారుతూ ఉంటాయి. దీనికి అనేక కారణాలుగా చెప్పవచ్చు. భారత్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, దుబాయ్ (UAE), చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో సహా అనేక కీలక మార్కెట్‌లలో ఐఫోన్ 15 ధరల్లో అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ ధరలు భారతీయ రూపాయికి ప్రత్యక్ష మార్పిడులపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లు రెండింటికీ పోలిక ఉంటుంది.

భారత్‌లో బేస్ మోడల్.. విదేశాల్లో ప్రో మోడల్స్:

ఆశ్చర్యకరంగా, ఐఫోన్ స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలను అందిస్తుంది. అమెరికా, భారత్ మధ్య ధరలో వ్యత్యాసం సుమారు రూ. 14వేలు ఉంటుంది. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం కూడా. అయితే, అమెరికాలో కొనుగోలు చేసిన ఐఫోన్లు కేవలం ఈ-సిమ్ సపోర్టుపై ఆధారపడి ఫిజికల్ సిమ్ స్లాట్‌లను కలిగి ఉండవు.

కొన్ని ఇతర మార్కెట్‌లతో పోల్చితే.. ఐఫోన్ల ధరలో తేడా పెద్దగా ఉండదు. భారత మార్కెట్లో కూడా ఐఫోన్లను కొనుగోలు చేయొచ్చు. కానీ, ప్రో మోడల్‌లను కొనేవారు కాస్తా ఆలోచించాల్సిందే.. ఎందుకంటే.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రెండూ ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారతదేశంలో చాలా ఖరీదైనవిగా చెప్పవచ్చు.

భారత్ కన్నా యూకేలోనే ధర తక్కువ:

వాస్తవానికి, యూకేలోని ఐఫోన్ 15 ప్రో మాక్స్ కూడా భారత మార్కెట్లో (ఐఫోన్ 15ప్రో ) కన్నా సరసమైనది. ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ ఏ ఇతర దేశాల్లో కూడా లక్ష మార్కును దాటలేదు. దాంతో ఐఫోన్ల ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఐఫోన్ ప్రో మోడల్‌ కావాలనుకుంటే.. విదేశీ మార్కెట్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 15 ధర ల్యాండ్‌స్కేప్ డైనమిక్, దేశాలలో గణనీయంగా మారుతుంది. ఐఫోన్ 15 బేస్ మోడల్ స్వదేశంలో తక్కువ ధర ఉన్నప్పటికీ.. ఐఫోన్ 15 ప్రో మోడల్‌ కొనుగోలుదారులు విదేశాలలో ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.