ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్

పాలసీదారులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ఐసీ ఇప్పుడు WhatsAppలో 24×7 సేవలను అందిస్తుంది, అది ఎలా ఉపయోగించాలో చూడండి. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అవసరమైన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఎల్‌ఐసితో భాగస్వామ్యం కావడం పట్ల కంపెనీ సంతోషిస్తున్నట్లు వాట్సాప్ ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ తెలిపారు. ఈ సేవ పాలసీదారులకు సంప్రదాయ అనుభవాన్ని సులభతరం చేస్తుందని, తమ LIC ప్రయాణంలో మరింత సురక్షితమైనదిగా, అందుబాటులో ఉండేలా చేస్తుందని గార్గ్ పేర్కొన్నారు. లైఫ్ […]

Share:

పాలసీదారులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ఐసీ ఇప్పుడు WhatsAppలో 24×7 సేవలను అందిస్తుంది, అది ఎలా ఉపయోగించాలో చూడండి.

వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అవసరమైన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఎల్‌ఐసితో భాగస్వామ్యం కావడం పట్ల కంపెనీ సంతోషిస్తున్నట్లు వాట్సాప్ ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ తెలిపారు. ఈ సేవ పాలసీదారులకు సంప్రదాయ అనుభవాన్ని సులభతరం చేస్తుందని, తమ LIC ప్రయాణంలో మరింత సురక్షితమైనదిగా, అందుబాటులో ఉండేలా చేస్తుందని గార్గ్ పేర్కొన్నారు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తన పాలసీదారుల కోసం LIC WhatsApp చాట్‌బాట్ ద్వారా కొత్త 24×7 సేవను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ లోన్ అర్హత, రీపేమెంట్ కొటేషన్లు, పాలసీ స్థితి, బోనస్ సమాచారం, యూనిట్ల ULIP స్టేట్‌మెంట్, LIC సేవల లింక్‌లు, ప్రీమియం గడువు తేదీ అప్‌డేట్‌లు, లోన్ వడ్డీ గడువు తేదీ నోటిఫికేషన్‌లు, చెల్లించిన ప్రీమియంలకు సంబంధించిన సర్టిఫికెట్‌లతో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది. మీకు ఈ సర్వీస్ కావాలనుకుంటే “ఆప్ట్ ఇన్” ని వద్దు అనుకుంటే “ఆప్ట్ అవుట్” ని ఎంపిక చేసుకోవచ్చు.

LIC WhatsApp సేవను ఎలా ఉపయోగించాలి


ఈ సేవను ఉపయోగించడానికి, LIC పాలసీదారులు ముందుగా LIC ఇండియా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అదే విధంగా చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడానికి, కావలసిన సేవను ఎంచుకోవడానికి.. LIC ప్రీమియం తీసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ నుండి +91 89768 62090 నంబర్ కి “హాయ్” అని మెసేజ్ పంపాలి. ఈ LIC సేవ వేగంగా, సురక్షితమైనదిగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది. ఇది ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా పాలసీదారులు తమ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

వాట్సాప్ ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ మాట్లాడుతూ, వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అవసరమైన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఎల్‌ఐసితో ఒప్పందం తమ బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.  ఇక LICతో భాగస్వామ్యం కావడం పట్ల కంపెనీ మరింత లాభ పడనున్నట్లు రవి గార్గ్ తెలిపారు. ఈ సేవ పాలసీదారులకు మరింత సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కస్టమర్ల సంప్రదాయ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుందని,  వినియోగదారుల ప్రయాణంలో మరింత సురక్షితమైనదిగా  అందుబాటులో ఉండేలా చేస్తుందని గార్గ్ పేర్కొన్నారు.

మరో వైపు LIC WhatsApp చాట్‌బాట్‌ను ValueFirst సంస్థ అభివృద్ధి చేసింది. ValueFirst CEO, వ్యవస్థాపకుడు విశ్వదీప్ బజాజ్ మాట్లాడుతూ..  LIC కోసం WhatsAppలో ఒక పరిష్కారాన్ని రూపొందించినందుకు కంపెనీ సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. LIC తమ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి, దాని బ్రాండ్‌ను బలోపేతం చేయడానికి ChatBot AI సహాయపడుతుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)  అనేది ఒక జీవిత బీమా సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద భీమా సంస్థ. మే 2022 నాటికి 41,00,000 కోట్ల రూపాయల (510 బిలియన్ డాలర్ల) విలువ గల ఆస్తులు గలిగిన అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్. ఇది భారత ప్రభుత్వ, ప్రైవేట్  యాజమాన్యం, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంది.

భారతదేశంలోని భీమా పరిశ్రమను జాతీయం చేస్తూ భారత పార్లమెంటు భారతదేశ జీవిత బీమా చట్టాన్ని ఆమోదించినప్పుడు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1 సెప్టెంబర్ 1956న స్థాపించబడింది. దీంతో 245కి పైగా బీమా కంపెనీలు, ప్రావిడెంట్ సొసైటీలు కలిసిపోయాయి.