లెనోవో థింక్ ఫోన్: చూస్తుంటేనే మతి పోతుందిగా…

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ దునియా రాజ్యమేలుతోంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్​ ఫోన్​ లేనిదే నిద్ర పోవడం లేదు. పొద్దుపొద్దున లేవగానే ఇన్నాళ్లూ వేర్వేరు పనులు చేసిన చాలా మంది ఇప్పుడు ఫోన్ చూడటమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక యువతైతే స్మార్ట్​ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వచ్చి మన దైనందిన జీవితాన్ని సులభం చేసిందనే మాట వాస్తవమే కానీ ఫోనే ప్రపంచంలా కొంత మంది […]

Share:

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ దునియా రాజ్యమేలుతోంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్​ ఫోన్​ లేనిదే నిద్ర పోవడం లేదు. పొద్దుపొద్దున లేవగానే ఇన్నాళ్లూ వేర్వేరు పనులు చేసిన చాలా మంది ఇప్పుడు ఫోన్ చూడటమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక యువతైతే స్మార్ట్​ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వచ్చి మన దైనందిన జీవితాన్ని సులభం చేసిందనే మాట వాస్తవమే కానీ ఫోనే ప్రపంచంలా కొంత మంది బతికేస్తున్నారు. ఫోన్‌ను చూస్తూ అసలు చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం మానేశారు. నేటి రోజుల్లో మార్కెట్లో మనకు అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల ప్రైజ్ రేంజ్స్​లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. మనం పెట్టే ధరను బట్టి వాటిలో ఫీచర్లు ఉంటున్నాయి. తక్కువ ధరలో అధిక ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా నేడు అనేకం ఉన్నాయి. 

30 ఏళ్లయిన సందర్భంగా…

ప్రముఖ కంపెనీ మోటరోలా లెనోవో థింక్ ప్యాడ్ మోడల్స్​ను ప్రవేశపెట్టి 30 సంవత్సరాలయిన సందర్భంగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్​ లెనోవో థింక్​ను విడుదల చేసింది. ఈ మొబైల్​ ఫోన్​లో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని మోటరోలా తెలిపింది. ఎన్నో రోజుల నుంచి అదిగో.. వస్తుంది, ఇదిగో వస్తుందంటూ ఊరించిన స్మార్ట్ ఫోన్.. రిలీజ్ అయ్యేసరికి టెక్ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈ స్మార్ట్ ఫోన్​ను సొంతం చేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

థింక్ ఫోన్ ఫీచర్లివే..

ఇప్పుడంతా 5G హావా నడుస్తోంది. మొబైల్ ధర ఎంతని ఇన్నాళ్లు ప్రశ్నించేవారు.. కానీ ఇప్పుడు 5G ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ థింక్ ఫోన్ 5G కనెక్టివిటీని అందిస్తుంది. 128 GB మెమొరీని ఈ ఫోన్​లో స్టోర్ చేసుకోవచ్చు. 6.6 అంగుళాల డిస్​ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ RAM వచ్చేసి 8 GB. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8లోని సెకండ్ జెనరేషన్ ఆక్టా కోర్ ప్రాసెసర్​ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్​ ఫోన్​కు మూడు కెమెరాలు ఉన్నాయి. 50 MP+13 MP+ 2 MP పరిమాణం గల మూడు కెమెరాలు ఈ స్మార్ట్​ ఫోన్ సొంతం. మూడు కెమెరాలతో పాటుగా ఫేస్ డిటెక్షన్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

థింక్ ఫోన్ బ్యాటరీని చూస్తే వావ్ అనాల్సిందే5000MAH బ్యాటరీని ఈ ఫోన్​లో అమర్చారు. ఈ ఫోన్​కు చార్జింగ్ పెట్టుకునేందుకు 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా వైర్​లెస్ చార్జింగ్ ఆప్షన్​ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. ఇలా వైర్​లెస్​గా చార్జింగ్ పెట్టాలని కోరుకునే వారు ఈ ఫోన్​ను ప్రిఫర్ చేయొచ్చని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.