మెటా థ్రెడ్స్, ట్విట‌ర్‌తో పోటీ లేదు: కూ

ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ సంబంధించిన యాప్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన కూ యాప్ ఒకటి. అయితే ప్రపంచంలో ఫేమస్ అయిన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సర్వీస్ యాప్స్ ట్విట్టర్ అలాగే మెటా విడుదల చేసిన థ్రెడ్‌ తో నేరుగా తలపడకపోయినప్పటికీ, రీజనల్గా ఫేమస్ అవుతోంది అని చెప్తున్నారు, Koo యాప్ వ్యవస్థాపకులు అప్రమీయ రాధాకృష్ణ.  కూ యాప్:  కూ అనేది ఒక భారతీయ మైక్రోబ్లాగింగ్ మరియు […]

Share:

ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ సంబంధించిన యాప్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన కూ యాప్ ఒకటి. అయితే ప్రపంచంలో ఫేమస్ అయిన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సర్వీస్ యాప్స్ ట్విట్టర్ అలాగే మెటా విడుదల చేసిన థ్రెడ్‌ తో నేరుగా తలపడకపోయినప్పటికీ, రీజనల్గా ఫేమస్ అవుతోంది అని చెప్తున్నారు, Koo యాప్ వ్యవస్థాపకులు అప్రమీయ రాధాకృష్ణ. 

కూ యాప్: 

కూ అనేది ఒక భారతీయ మైక్రోబ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్, బెంగళూరుకు చెందిన బాంబినేట్ టెక్నాలజీస్ యాజమాన్యం ఈ Koo మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సర్వీస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. Koo వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ మరియు మయాంక్ బిదవత్కా. Twitter, Meta ద్వారా ఇటీవల ప్రారంభించబడిన థ్రెడ్‌ల తో నేరుగా తలపడలేకపోయినప్పటికీ, రీజనల్గా కూ యాప్ ఫేమస్ అవుతోంది అని చెప్తున్నారు, Koo యాప్ వ్యవస్థాపకులు అప్రమీయ రాధాకృష్ణ. 

జర్నలిస్టు నళిన్ మెహతా పుస్తకావిష్కరణ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు. డేటా దుర్వినియోగం మరియు స్థానిక వ్యవహారాల్లో జోక్యం వంటి సమస్యలు ఉన్నందున, దేశంలో తాము కేవలం సోషల్-మీడియా- సర్వీస్ గా ఉండవచ్చు అంటూ Koo యాప్ గ్లోబల్ ప్లాన్‌ల గురించి, అదే విధంగా ఇతర సోషల్ మీడియా కంపెనీలను ప్రస్తావిస్తూ చెప్పాడు రాధాకృష్ణ. 

అతను ఇంకా PTI కి మాట్లాడుతూ, ట్విటర్, థ్రెడ్‌ల ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా విభిన్న ప్రేక్షకులను Koo యాప్ ఆకర్షించేలా ఉంటుంది అని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇంక వేరే ఫ్లాట్ ఫామ్ లతో పోటీ విషయానికి వస్తే, కూ యాప్ పనితీరు, నిజానికి భాషా రీజనల్ లాంగ్వేజ్ ఎంచుకునే దాన్ని బట్టి నడుస్తుంది కాబట్టి, కంపెనీ నేరుగా ఇతరులతో పోటీ పడడం లేదని రాధాకృష్ణ పేర్కొన్నాడు. అంతే కాకుండా ట్విట్టర్ అలాగే థ్రెడ్ వంటి అప్లికేషన్లకు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉందని, 2020 Koo యాప్ స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాలకే పుంజుకుందని వెల్లడించారు రాధాకృష్ణ. ప్రస్తుతం గ్లోబల్ గా తనదైనసైలిలో విస్తరించే క్రమంలో ఉంది, Koo యాప్. 

ఇటీవల విడుదలైన థ్రెడ్‌ యాప్: 

ఇటీవల లాంచ్ అయిన థ్రెడ్‌ అప్లికేషన్ ద్వారా మనం టెక్స్ట్, లింక్ షేరింగ్ మరియు ఇంటరాక్షన్‌ ఇటువంటి వెసులుబాట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా రిపోర్ట్స్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఇంచుమించు ట్విట్టర్ అప్లికేషన్ మాదిరిగానే ఉంటుంది. సుమారు ఇంస్టాగ్రామ్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ థ్రెడ్‌ అప్లికేషన్ సులువుగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని థ్రెడ్ లోకి మైగ్రేట్ చేసుకోవచ్చు. 2 బిలియన్స్ కంటే ఎక్కువ మంది ఇప్పుడు ఆప్ యూస్ చేస్తున్నారు అని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం థ్రెడ్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటివరకు ఉన్న వినియోగదారులు చాలా మంది టెక్స్ట్ ఆధారిత యాప్‌ను తయారు చేయమని కంపెనీని అడుగుతున్నారని ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కానర్ హేస్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతోమంది కొత్తగా వచ్చిన థ్రెడ్‌ ఆప్ యూస్ చేసి హ్యాపీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఒక కస్టమర్ రివ్యూస్ ఇస్తూ, ఈ థ్రెడ్‌ యాప్ అనేది చాలా బాగుందని.. అంతేకాకుండా ఇంటర్ ఫెస్ నిజానికి అద్భుతంగా ఉందని.. ఈ యాప్ లో మరింత ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని.. ముఖ్యంగా అలన్ మస్క్ ట్విట్టర్ అధిపతికి మంచి కాంపిటేటర్ వచ్చింది అని అంటున్నారు.