దూసుకుపోతున్న జియో 5G.. ఇక మీదట అక్కడ కూడా..

దేశీయ టెలికం ఆపరేటర్ జియో దుమ్ములేపుతోంది. అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లో పాగా వేసిన జియో.. పోటీదారులకు చుక్కలు చూపెట్టింది. 4జీ తోనే ఎన్నో సంచలనాలను నమోదు చేసిన జియో.. ఇక ఇప్పుడు 5జీ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకింది. అందుకు తగ్గట్లుగానే అనేక ప్రాంతాలలో తన నెట్​వర్క్​ను విస్తరిస్తూ వస్తోంది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు 5G నెట్​వర్క్​ను విస్తరిస్తామని ప్రకటించిన జియో.. ఇప్పడు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా సరే తమ కస్టమర్లను […]

Share:

దేశీయ టెలికం ఆపరేటర్ జియో దుమ్ములేపుతోంది. అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లో పాగా వేసిన జియో.. పోటీదారులకు చుక్కలు చూపెట్టింది. 4జీ తోనే ఎన్నో సంచలనాలను నమోదు చేసిన జియో.. ఇక ఇప్పుడు 5జీ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకింది. అందుకు తగ్గట్లుగానే అనేక ప్రాంతాలలో తన నెట్​వర్క్​ను విస్తరిస్తూ వస్తోంది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు 5G నెట్​వర్క్​ను విస్తరిస్తామని ప్రకటించిన జియో.. ఇప్పడు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా సరే తమ కస్టమర్లను ఆకట్టుకోవాలని తోచిన విధంగా నెట్​వర్క్​ను అందించడం లేదు. ట్రూ 5జీ పేరుతో సేవలను అందిస్తూ వస్తోంది. ఇక తాజాగా జమ్మూకాశ్మీర్​లో కూడా 5G సేవలను స్టార్ట్ చేసింది. ఇక ఇది మాత్రమే కాకుండా 12 రాష్ట్రాల్లోని 25 పట్టణాల్లో కూడా ట్రూ 5G సేవలను తాము స్టార్ట్ చేసినట్లు జియో ప్రకటించింది.

గవర్నర్ మనోజ్ సిన్హా చేతుల మీదుగా

జమ్మూ కాశ్మీర్​లో కూడా జియో తన ట్రూ 5G సేవలను స్టార్ట్ చేసింది. అక్కడి రాజ్​భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్ము కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ సేవలను స్టార్ట్ చేశారు. ఈ సేవలను స్టార్ట్ చేయడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక దీంతో దేశవ్యాప్తంగా 304 పట్టణాల్లో జియో ట్రూ 5G సేవలను అందిస్తున్నట్లు అయింది. జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతానికి జియో ట్రూ 5G సేవలు రావడం ఎంతో ఆనందంగా ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. 4G కంటే స్పీడ్​ నెట్​వర్క్​ను అందిచడమే 5G (ఫిఫ్త్ జెనరేషన్) లక్ష్యం. జియో యొక్క ట్రూ 5G సేవలను ప్రారంభించడంతో, జమ్మూ మరియు కాశ్మీర్​లో అత్యుత్తమ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ మాత్రమే కాకుండా పర్యాటకం, ఈ-గవర్నెన్స్, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, IT మరియు SME వ్యాపార రంగాలలో అనంతమైన వృద్ధి అవకాశాలను పెంపొందుతాయని గవర్నర్ తెలిపారు. మనోజ్ఓ సిన్హా మాట్లాడుతూ… 5G నెట్​వర్క్ అనేది పౌరులు మరియు ప్రభుత్వం నిజ సమయ ప్రాతిపదికన కనెక్ట్ అవ్వడానికి కూడా వీలు కల్పిస్తుందన్నారు. చివరి మైలు వినియోగదారుని చేరుకోవడంలో ప్రభుత్వ పథకాల అమలు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

డిజిటల్ ఇండియా లక్ష్యంగానే… 

భారత ప్రధాని మోదీ విజన్ అయిన డిజిటల్ ఇండియా సాధనకు జియో ఎంతో కృషి చేస్తోందని జియో ప్రతినిధులు తెలిపారు. జియో జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 36,000 మందికి పైగా ఉపాధిని కల్పించిందని, జియో యొక్క 5G సేవల నుంచి ఎంతో ప్రయోజనం పొందే జమ్మూ & కాశ్మీర్ ప్రజలకు ఈ ప్రారంభం ఒక ముఖ్యమైన మైలు రాయి అని ప్రతినిధులు తెలిపారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు.  కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా, దేశంలోని 12 రాష్ట్రాల్లోని 25 పట్టణాలలో జియో ట్రూ 5G సేవలను ప్రారంభించామని, ఇది చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. జియో ప్రయోజనాలు పొందడం పట్ల మేము సంతోషిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 304 పట్టణాలకు నిజమైన 5G సేవలు అందుతున్నాయని అన్నారు. ప్రతి జియో వినియోగదారు 2023లో జియో ట్రూ 5G టెక్నాలజీ యొక్క పరివర్తన ప్రయోజనాలను ఆస్వాదించాలని తాము కోరుకుంటున్నట్లు తెలియజేశారు.