జూలై 7న అందుబాటులోకి జియో భారత్ ఫోన్

అందరికీ శుభవార్త, భారతదేశంలో రిలయన్స్ జియో, జియో భారత్ ఫోన్‌ను విడుదల చేసింది. దాదాపు 1 మిలియన్ యూనిట్లను ప్రజలకు అందించబోతున్నారు మొదటి సెట్ జియో భారత్ ఫోన్‌స్ జూలై 7, 2023 నుండి ఆన్లైన్లో అందుబాటులోకి రాబోతున్నాయి. అందుబాటులోకి వచ్చేస్తున్న జియో భారత్ ఫోన్‌:  Reliance Jio భారతదేశంలో, అద్భుతమైన తక్కువ ధరలో లభించే Jio Bharat 4G ఫోన్‌ను విడుదల చేసింది. “2G-MUKT BHARAT’ విజన్‌ని వేగవంతం చేయడంలో భాగంగా ఈ మొబైల్ ఫోన్‌ని […]

Share:

అందరికీ శుభవార్త, భారతదేశంలో రిలయన్స్ జియో, జియో భారత్ ఫోన్‌ను విడుదల చేసింది. దాదాపు 1 మిలియన్ యూనిట్లను ప్రజలకు అందించబోతున్నారు మొదటి సెట్ జియో భారత్ ఫోన్‌స్ జూలై 7, 2023 నుండి ఆన్లైన్లో అందుబాటులోకి రాబోతున్నాయి.

అందుబాటులోకి వచ్చేస్తున్న జియో భారత్ ఫోన్‌: 

Reliance Jio భారతదేశంలో, అద్భుతమైన తక్కువ ధరలో లభించే Jio Bharat 4G ఫోన్‌ను విడుదల చేసింది. “2G-MUKT BHARAT’ విజన్‌ని వేగవంతం చేయడంలో భాగంగా ఈ మొబైల్ ఫోన్‌ని లాంచ్ చేయడం వెనుక  కంపెనీ లక్ష్యం తెలుస్తుంది. రిలయన్స్ జియో ప్రస్తుతానికి కార్బన్‌ కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకుని ఇప్పటికీ రెండు జియో భారత్ ఫోన్ మోడల్‌లలో ఒకదాన్ని విడుదల చేసింది. ‘జియో భారత్ ఫోన్‌లను’ మరిన్ని విస్తృతంగా భారతదేశంలో విడుదల చేయడమే కాకుండా, తక్కువ ధరకే ప్రజలకు అందించడం తమ లక్ష్యం అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే, మరిన్ని ఆకర్షితమైన మోడల్స్ను లాంచ్ చేయడానికి మరిన్ని బ్రాండ్‌లతో  జియో పార్ట్నర్ షిప్ కూడా తీసుకోబోతుంది. 

భారతదేశంలో రిలయన్స్ జియో, జియో భారత్ ఫోన్‌ను విడుదల చేసింది. దాదాపు 1 మిలియన్ యూనిట్లను ప్రజలకు అందించబోతున్నారు మొదటి సెట్ జియో భారత్ ఫోన్‌స్ జూలై 7, 2023 నుండి ఆన్లైన్లో అందుబాటులోకి రాబోతున్నాయి. 

అద్భుతమైన ఫీచర్స్: 

కొత్తగా లాంచ్ చేసిన జియో భారత్ ఫోన్, ప్రస్తుతం అందరూ వాడుతున్న సాధారణ ఫోన్ లాగే కనిపిస్తుంది (కానీ ఇది స్మార్ట్ 4G ఫోన్)లో కీప్యాడ్ ఉంటుంది అంతేకాకుండా పైన మనకి స్క్రీన్ కనిపిస్తుంది. వెనుక, ప్యానెల్ అదే విధంగా స్పీకర్లు, కెమెరా ఈ ఫోన్లో మనకి అందుబాటులో ఉంటుంది. Jio Bharat ఫోన్ ఉపయోగించి మనం భారతదేశంలో ఎక్కడైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు అంతేకాకుండా, అద్భుతమైన ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకించి JioPayని ఉపయోగించి UPI చెల్లింపులను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. JioCinema, JioSaavan మరియు FM రేడియోలకు మద్దతుతో సహా అనేక ప్రత్యేకమైన ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతానికి జియో రెండు అద్భుతమైన మోడల్స్ భారత దేశంలో లాంచ్ చేసినట్లు గమనించాలి. మోడల్‌లలో ఒకదాని వెనుక కవర్‌లో “జియో” బ్రాండ్ లోగో ఉంటుంది, రెండవ మోడల్‌లో “కార్బన్” లోగో ఉంటుంది. ఇందులో ప్రెసెంట్ రెండు కలర్ ఆప్షన్స్ ఉంటాయి- బ్లూ మరియు రెడ్. 

జియో ప్లాన్స్: 

జియో భారత్ ఫోన్ ప్లాన్ ధర నెలకు కేవలం రూ.123 మాత్రమే. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ అంతేకాకుండా 14 GB డేటా అంటే ప్రస్తుతానికి (రోజుకు 0.5GB) పొందుతారు. Jio అందించిన సమాచారం ప్రకారం , ఇది 30 శాతం అతి తక్కువ అద్భుతమైన నెలవారీ ప్లాన్. అంతేకాకుండా ఇతర ఆపరేటర్ల ఫీచర్ ఫోన్ ఆఫర్‌లతో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ డేటాను జియో ఫోన్ అందిస్తుంది.

కంపెనీ జియో భారత్ ఫోన్‌తో వార్షిక ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వినియోగదారునికి వార్షిక ప్లాన్‌ రూ. 1,234 నుంచి మొదలవుతుంది, ఇది అపరిమిత కాలింగ్‌తో పాటు మొత్తం 168GB డేటాను అంటే సుమారు (రోజుకు 0.5GB) అందిస్తుంది. 

ఆకాష్ అంబానీ మాటల్లో: 

ఆకాష్ అంబానీ జియో ఫోన్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ,” 6 సంవత్సరాల క్రితం, జియో భారతదేశంలో పరిచయం అయినప్పటి నుంచి, ఇంటర్నెట్‌ సాంకేతికత యొక్క ప్రయోజనాలను ప్రతి భారతీయుడికి అందించడానికి జియో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదని మేము స్పష్టం చేసాము. అంటే, సాంకేతికత అనేది ఇక కొంతమందికి మాత్రమే ఇకపై ప్రత్యేక హక్కుగా ఉండదు. ఈ దశలోనే కొత్త జియో భారత్ ఫోన్తో మరో అడుగు వేసాము” అంటూ విలేకరులతో పేర్కొన్నారు.