మస్క్ పేరు మార్చుకుంటున్నారా..?

ప్రపంచ అపర కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు చాలా తక్కువ. టెస్లాకు ఓనర్ గానే మస్క్ సంచలనాలు క్రియేట్ చేసాడంటే అతడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ (ప్రస్తుతం X)ను కొనుగోలు చేసిన తర్వాత అతని పేరు ఇంకా మారుమోగిపోయింది. ఈ అపరకుబేరుని ఖాతాలో ప్రస్తుతం టెస్లా, ఎక్స. కామ్ (పాత ట్విటర్), స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీలు ఉన్నాయి. మనోడు ట్విటర్ లో చేసే […]

Share:

ప్రపంచ అపర కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు చాలా తక్కువ. టెస్లాకు ఓనర్ గానే మస్క్ సంచలనాలు క్రియేట్ చేసాడంటే అతడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ (ప్రస్తుతం X)ను కొనుగోలు చేసిన తర్వాత అతని పేరు ఇంకా మారుమోగిపోయింది. ఈ అపరకుబేరుని ఖాతాలో ప్రస్తుతం టెస్లా, ఎక్స. కామ్ (పాత ట్విటర్), స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీలు ఉన్నాయి. మనోడు ట్విటర్ లో చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ట్విటర్ లో చాలా యాక్టివ్ గా ఉండే మస్క్ యూజర్లతో ఎప్పటికీ ఇంటరాక్ట్ అవుతుంటారు. తనకు వచ్చిన ఐడియాలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా యూజర్ల నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటారు. ఆ సజెషన్స్ ను తన బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. 

కొత్త ట్వీట్ వైరల్..

మస్క్ ట్విటర్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. మనోడు చేసే ట్వీట్స్ ఎక్కువ శాతం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మస్క్ ఓ ట్వీట్ చేయగా… అది వైరల్ అయింది. అతడు రీసెంట్ గా ట్విటర్ లో ‘నో బడీ.. దట్స్ మై నేమ్’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో చాలా మంది యూజర్లు మస్క్ ఈ ట్వీట్ ఎందుకు చేశాడా అని ఆలోచించడం మొదలు పెట్టారు. మరికొందరైతే మస్క్ త్వరలో పేరు మార్చుకుంటాడని అందుకే ఇలాంటి పోస్ట్ చేశాడని ఊహించుకున్నారు. అందుకు తగ్గట్టే వార్తలను వైరల్ చేశారు. మస్క్ చేసిన పోస్ట్ ను దాదాపు మూడు మిలియన్లకు పైగా మంది చూశారు. అంతే కాకుండా అనేక మంది ఈ ట్వీట్ కు కామెంట్స్ చేశారు. చాలా మంది మీమ్స్ తో అలరించారు. కొంత మంది మస్క్ మీరు ఓకేనా అని అడిగారు. ఇక అనేక మంది మీమ్స్ ఫెస్ట్ ను ప్రారంభించారు. ఎవరికి తోచిన విధంగా వారు మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. కేవలం మీమ్స్ మాత్రమే కాకుండా చాలా మంది కామెంట్స్ చేశారు. ఇంకా అనేక మంది మస్క్ మీకు ఏమైంది అని పర్సనల్ మెస్సేజెస్ కూడా చేశారట. ఒక యూజర్ హాయ్ నో బడీ అని కామెంట్ చేశాడు. ఎలాన్ చేసిన పోస్ట్ ను అనేక మంది వీక్షించడంతో పాటు ఫోన్లు చేసుకుని కూడా ఏంటి ఇది అని మాట్లాడుకున్నారు. 

మరో మారు మొదటి ర్యాంకు

ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటికే ఎన్నో సార్లు ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. మరోమారు కూడా మస్క్ ఆ ఘనత సాధించాడు. ఫోర్బ్స్ మరియు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ మొత్తం నికర ఆస్తుల విలువ 236 బిలియన్ డాలర్లు. అంత ఆస్తి ఈ ప్రపంచంలోనే ఎవరి దగ్గరా లేదు. అందుకోసమే అతడు వరుసగా నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నాడు. ట్విటర్ లాస్ లో ఉందని వార్తలు వస్తు్ననా కానీ మస్క్ సంపద మాత్రం తగ్గడం లేదు. మస్క్ ప్రపంచంలోని పెట్టుబడిదారులతో పోల్చుకుంటే డిఫరెంట్ గా పెట్టుబడులు పెడుతున్నాడు. అందుకోసమే అతడు నెంబర్ వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కుబేరులంతా సేఫ్ గేమ్ ఆడుతుంటే మస్క్ మాత్రం ఏమైనా పర్లేదు అని రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లాలో మస్క్ కు వాటా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జమానా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. కానీ మస్క్ మాత్రం ఇందులో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇక ఈ మధ్య స్పేస్ ఎక్స్ సంస్థ కూడా బాగా పాపులర్ అయింది. ఆ కంపెనీ షేర్లు కూడా రాకెట్ లా దూసుకుపోతూ మస్క్ కు రాబడిని పెంచుతున్నాయి. కేవలం ఇవి అని మాత్రమే కాకుండా బోరింగ్ కంపెనీ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. ఇక ట్విటర్ లో సబ్ స్క్రిప్షన్ పాలసీని సెట్ చేసిన మస్క్ అందర్ని ఆశ్చర్యపరిచాడు. ముందుగా ఈ విషయాన్ని అంతా ఆపోజ్ చేసినా కానీ చేసేదేం లేక తర్వాత అందరూ డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు. అలా కూడా మస్క్ కంపెనీకి రెవెన్యూ పెరుగుతోంది.