ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్స్ గురూ..!

రోజులు మారాయి… ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ మయం అయిపోయింది. వాట్సాప్ లో బ్రేక్ ఫాస్ట్, ఇన్ స్టాలో లంచ్, ట్విటర్ లో డిన్నర్ చేసే రోజులివి. కానీ ఒక్క విషయంలో మాత్రం అంతా వర్రీ అవుతున్నారు… అదే డేటా ప్రైవసీ.. మన డేటాకు ప్రైవసీ ఉంటుందా? అని అంతా కలవరపడుతున్నారు. డేటా ప్రైవసీకి సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కానీ నిత్యం ఎక్కడో చోట ఏదో విధంగా డేటా చోరీ […]

Share:

రోజులు మారాయి… ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ మయం అయిపోయింది. వాట్సాప్ లో బ్రేక్ ఫాస్ట్, ఇన్ స్టాలో లంచ్, ట్విటర్ లో డిన్నర్ చేసే రోజులివి. కానీ ఒక్క విషయంలో మాత్రం అంతా వర్రీ అవుతున్నారు… అదే డేటా ప్రైవసీ.. మన డేటాకు ప్రైవసీ ఉంటుందా? అని అంతా కలవరపడుతున్నారు. డేటా ప్రైవసీకి సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కానీ నిత్యం ఎక్కడో చోట ఏదో విధంగా డేటా చోరీ జరుగుతూనే ఉంది. డేటా అక్రమార్కుల చేతిలోకి చిక్కడంతో సామాన్యులు సఫర్ అవుతూనే ఉన్నారు. కాసింత మనం అలర్ట్ గా ఉంటే.. ఈ డేటా చోరీకి పుల్ స్టాప్ పెట్టొచ్చు. దుర్మార్గుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా ఎడ్యుకేట్ చేసి కాపాడొచ్చు. 

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తరకం మోసం 

ప్రస్తుతం యూత్ చాలా మంది ఇన్‌స్టా‌గ్రామ్ కి అలవాటు పడ్డారు. ఇక దీనినే అదనుగా తీసుకున్న కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు 2.35 బిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. యూజర్లు ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో కొంత మంది కేటుగాళ్లు ఈ ఫొటో షేరింగ్ ప్లాట్ ఫాంను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేస్తూ వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది సెలబ్రెటీల మార్ఫింగ్ ఫొటోలను కూడా అప్ లోడ్ చేస్తూ వారిని చిత్రవధకు గురి చేస్తున్నారు. ఇటువంటి చర్యలను అడ్డుకునేందుకు ఇన్ స్టా యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నా కానీ ఏదో ఓ చోట ఇలాంటి సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. 

ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్స్ ఎలా గుర్తించాలి?

ఫొటో షేరింగ్ ప్లాట్ ఫాం ఇన్ స్టాలో ఫేక్ అకౌంట్స్ కోకొల్లలుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అందుకోసమే ఏ అకౌంట్ ఫేక్, ఏ అకౌంట్ జెన్యూన్ అనేది మనం గుర్తించగల్గాలి. అలా గుర్తించినపుడే మన డేటా ప్రైవసీకి భంగం కలగకుండా ఉంటుంది. ఒక అకౌంట్ ఫేక్ అకౌంట్ అయితే… ఆ ప్రొఫైల్ లో ఎక్కువ పోస్టులు మనకు కనబడవు. ఏ అకౌంట్ లో అయితే ఎక్కువగా పోస్టులు మనకు కనిపించవో అటువంటి అకౌంట్ విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా అకౌంట్ హాండిల్ పేరు విషయంలో కూడా మనం తేడాలను గమనించొచ్చు. ఒరిజినల్ పేరుకు దగ్గరగా ఏదో ఒక చిన్న మార్పు చేసి డూప్లికేట్ అకౌంట్ హాండిల్ నేమ్ ఉంటుంది.

ఫేక్ అకౌంట్స్‌తో ఏం చేస్తారంటే…

ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్ చేసి నార్మల్ యూజర్స్ నుంచి డబ్బును వసూలు చేయడం అంతే కాకుండా వారిని డేటాను దొంగిలించడం చేస్తుంటారు. కావున మనం అటువంటి అకౌంట్ల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కానీ మన విలువైన డేటా వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలా ఫేక్ అకౌంట్లు మెయింటేన్ చేసే వారు డైరెక్టు మెస్సేజెస్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేస్తుంటారు. నేను ఆ పోటీలో పాల్గొంటున్నాను.. ఈ పోటీలో పాల్గొంటున్నాను మీ విలువైన ఓటు నాకు వేసి గెలిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ పలు ఫ్రాడ్ లింక్స్ పంపిస్తుంటారు. మనం పొరపాటున ఆ లింక్స్ ను కనుక ఓపెన్ చేస్తే మన వ్యక్తిగత సమాచారం మొత్తం వారు చోరీ చేసే ప్రమాదం ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను వారు ఊడ్చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. 

ఫ్రాడ్ మెస్సేజెస్ వస్తే ఏం చేయాలి??

ఇటువంటి ఫ్రాడ్ మెస్సేజెస్, ఫిషింగ్ అటాక్స్ ప్రతి నిత్యం చాలా మంది మీద జరుగుతూ ఉంటాయి. ఈ లిస్టులో ఏదో ఒక రోజు మీరు కూడా ఉండొచ్చు. అటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీ విలువైన డేటాను కోల్పోయే ప్రమాదం ఉంది.  కావున మనకు తెలియని అన్‌నౌన్ యూజర్ల నుంచి వచ్చే మెస్సేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడం, వారు పంపించే లింక్స్ ను క్లిక్ చేయకపోవడమే చాలా ఉత్తమం. ఒక వేళ అది ఫ్రాడ్ అకౌంట్ అని మనకు తెలిసిన వెంటనే దానిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేస్తే ఇంకా ఎవరు కూడా ఆ అకౌంట్ వల్ల ఫ్రాడ్ కి గురి కాకుండా ఉంటారు. 

బాధ్యత అనుకోవాల్సిందే… 

సోషల్ మీడియాలో ఇటువంటి ఫ్రాడ్ అకౌంట్స్ నిత్యం వేల సంఖ్యలో దర్శనం ఇస్తుంటాయని ఎన్ని అకౌంట్లను బ్లాక్ చేస్తూ పోతామని చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. కానీ మనం ఒక్కరమే అన్ని ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ ఇది తమ బాధ్యత అనుకుని ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేస్తూ రిపోర్ట్ చేస్తే చాలా మంది వాటి బారి నుంచి తప్పించుకుంటారు. మీకు తెలియకుండానే వారికి ఎంతో సాయం చేసినట్లు అవుతుంది.