ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్.. ఎంచక్కా ఫోటోలకు పాటలను యాడ్ చేసుకోవచ్చు

ప్రముఖ ఫోటో వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్ స్టాగ్రామ్ తన యూజర్ల కోసం తరచుగా అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ పరిచయం చేసిన ఆకర్షణ ఏమైనా ఫీచర్ల కారణంగా యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత పెరిగింది. అయితే మరిన్ని ఫీచర్లతో ఫ్లాట్ ఫామ్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఇన్ స్టాగ్రామ్ నిత్యం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫోటోలకు పాటలను యాడ్ చేసుకునే ఓ యూస్ ఫుల్ […]

Share:

ప్రముఖ ఫోటో వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్ స్టాగ్రామ్ తన యూజర్ల కోసం తరచుగా అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ పరిచయం చేసిన ఆకర్షణ ఏమైనా ఫీచర్ల కారణంగా యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత పెరిగింది. అయితే మరిన్ని ఫీచర్లతో ఫ్లాట్ ఫామ్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఇన్ స్టాగ్రామ్ నిత్యం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫోటోలకు పాటలను యాడ్ చేసుకునే ఓ యూస్ ఫుల్ ఫీచర్ లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమకు నచ్చిన పాటలను వారి ఫోటోలకు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. 

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపడుతూ ఆకర్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ లాంచ్ చేయనంది. ఇప్పటివరకు ఫోటో షేరింగ్, వీడియో రిలీజ్, చాటింగ్ వంటి వాటితో యూజర్లను ఆకర్షిస్తున్న ఇన్స్టా తాజాగా సాంగ్స్ ఎంచుకునే ఫీచర్ ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్లతో యూసర్లు సులభంగా తమకు నచ్చిన పాటలను వారి ఫోటోలకు యాడ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ ప్రసార ఛానెల్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే మరికొన్ని దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను కలిగి ఉండగా, వినియోగదారులను అనుమతిస్తుంది. వ్యక్తిగత ఫోటోలకు పాటలను జోడించడానికి, ఇది మరింత అడ్వాంటేజ్ గా మారనుంది. చిత్రాల గ్యాలరీలు పాటలు యాడ్ చేయవచ్చు. కేవలం ఒకే ఫోటోను చూస్తున్నప్పుడు పాటల ట్రాక్‌ని వినడం, వినియోగదారులు ఇష్టపడతారు. ఇప్పుడు మరిన్ని చిత్రాలు, సంగీతాన్ని వినడానికి ఇంస్టాగ్రామ్ వినియోగదారులు ఎక్కువ సమయాన్ని గడుపుతారని ఈ ఆలోచనను తీసుకొచ్చింది. వినియోగదారులు పాటలు వింటూ ఎక్కువ చిత్రాలను స్వైప్ చేస్తారు అని అంచనా వేస్తున్నారు.

గతంలోఇన్‌స్టాగ్రామ్ తన యూజరలందరి కోసం పిన్ టు యువర్ ప్రొఫైల్ అనే ఆకర్షణీయమైన ఫీచర్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే .ట్విట్టర్, వాట్సప్ వంటి తదితర సోషల్ మీడియా సైట్స్ లో ఇప్పటికే పిన్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ ఇంస్టాగ్రామ్ యూజర్ లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వినియోగించి యుసార్లు పోస్టులను ప్రొఫైల్ టాప్ లో ఫిన్ చేసుకోవచ్చు ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన మూడు పోస్టులను టాప్ లో అందరికీ కనిపిస్తాయి.

ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల వానిష్ మోడ్ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వానిష్ మోడ్ ఫీచర్ ద్వారా ఏదైనా మెసేజ్ ఫోటోలు, వీడియోలు, ఇతర కంటెంట్ ను ఇన్స్టాగ్రామ్ చాట్లు లేదా డిఎం లతో పంపేందుకు అనుమతి ఇస్తుంది ఎవరైనా చాట్ నుంచి బయటకు వచ్చినప్పుడు వానిష్ మోడ్ ను ఆఫ్ చేసినప్పుడు వానిష్ మోడ్ లో షేర్ చేసిన టెక్స్ట్ మీడియా ఆటోమేటిగ్గా అదృశ్యం అవుతుంది. వానిష్ మోడ్ ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు తప్పనిసరిగా ఇన్స్టాగ్రామ్ లోని మెసెంజర్ ఫీచర్లకు అప్డేట్ చేయాలి. ఈ ఫీచర్ గతంలో ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ లో వానిష్ మోడ్ లో మెసేజ్ లను ఎలా పంపాలో కూడా వివరణ ఆత్మకంగా తెలియజేసింది. తాజాగా ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో తన యూజర్లను అట్రాక్ట్ చేస్తుందనే చెప్పుకోవాలి. యూజర్లు తమకు నచ్చిన పాటలను వారి ఫోటోలకు యాడ్ చేసుకునే అవకాశం ఉంది.