ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వెరిఫికేషన్ కోసం పేమెంట్

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కస్టమర్లు ఇప్పుడు బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం పే చేయవలసి ఉంటుందని వాటి మాతృ సంస్థ మెటా ప్రకటించింది. ఫేస్‌బుక్ కస్టమర్లకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ షాక్ ఇచ్చారు. ఇక నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందేందుకు ప్రతి నెలా చార్జీలు చెల్లించవలసి ఉంటుందని ప్రకటించారు. వెబ్ కస్టమర్లు నెలకు 12 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. iOS  కస్టమర్లు  నెలకు దాదాపు 15 డాలర్లు చెల్లించాలి.  అంటే మెటా వెరిఫికెషన్ వెబ్‌లో నెలకు 11.99 […]

Share:

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కస్టమర్లు ఇప్పుడు బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం పే చేయవలసి ఉంటుందని వాటి మాతృ సంస్థ మెటా ప్రకటించింది. ఫేస్‌బుక్ కస్టమర్లకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ షాక్ ఇచ్చారు. ఇక నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జ్ పొందేందుకు ప్రతి నెలా చార్జీలు చెల్లించవలసి ఉంటుందని ప్రకటించారు. వెబ్ కస్టమర్లు నెలకు 12 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. iOS  కస్టమర్లు  నెలకు దాదాపు 15 డాలర్లు చెల్లించాలి. 

అంటే మెటా వెరిఫికెషన్ వెబ్‌లో నెలకు 11.99 అమెరికన్ డాలర్లు (9.96 పౌండ్లు) లేదా ఐఫోన్ (iPhone) కస్టమర్లకు 14.99 డాలర్లు ఖర్చు అవుతుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తర్వాత ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామన్నారు.  ఇది సోషల్ మీడియా యాప్‌లలో భద్రతను, ప్రామాణికతను మెరుగుపరుస్తుందని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ నవంబర్ 2022లో ప్రీమియం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను అమలు చేసిన తర్వాత ఈ ప్రభంజనం మొదలయ్యింది. బ్యాడ్జ్‌లు  లేదా “బ్లూ టిక్‌లు” వాటి ప్రామాణికతను సూచించడానికి హై ప్రొఫైల్ ఖాతాల కోసం వెరిఫికేషన్ టూల్స్ గా  ఉపయోగపడతాయి.

పెయిడ్ కస్టమర్లకు.. బ్లూ బ్యాడ్జ్, వారి పోస్ట్‌ల విజిబిలిటీని పెంచడం, వంచన చేసేవారి నుండి రక్షణ కలిపించడం, కస్టమర్ సేవను సులభంగా యాక్సెస్ చేయగలగలగడం వంటి వాటిని ఈ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుందని మెటా తమ వెబ్‌సైట్‌లోని పోస్ట్‌లో తెలిపింది.

ఇంతకుముందే వెరిఫై అయిన ఖాతాలను ఈ మార్పు ప్రభావితం చేయదని ఆ కంపెనీ తెలిపింది, అయితే చెల్లించిన ఫీచర్‌కు వెరిఫికేషన్ పొందిన కొంతమంది చిన్న కస్టమర్లకు విజిబిలిటీ పెరుగుతుందని పేర్కొంది. పెయిడ్ కస్టమర్లకు బ్లూ టిక్ యాక్సెస్‌ను అనుమతించడం వలన మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు గతంలో ఇబ్బంది ఏర్పడింది. గత నవంబర్‌లో జనాలు బ్యాడ్జ్ కోసం పే చేసి పెద్ద బ్రాండ్‌లు, సెలబ్రిటీలలా వేషాలు వేయడం  మొదలుపెట్టినప్పుడు ట్విటర్  పే ఫర్ వెరిఫికేషన్ ఫీచర్ పాజ్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్‌నేమ్‌ల వెరిఫికేషన్ గ్రాంట్ చేయడానికి గవర్నమెంట్ ID డాక్యుమెంట్‌ ఇవ్వాలని, కస్టమర్లు వారి ముఖాన్ని కలిగి ఉన్న ప్రొఫైల్ చిత్రాన్ని కలిగి ఉండాలని మెటా తెలిపింది.

రెడిట్, యూట్యూబ్, డిస్‌కార్డ్ వంటి మిగతా వెబ్‌సైట్‌లు కూడా సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ మోడల్స్ ఉపయోగిస్తాయి.

మిగతా దేశాలకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మెటా ఇంకా తెలుపలేదు, అయినప్పటికీ జుకర్‌బర్గ్ “త్వరలో” అని ఒక పోస్ట్‌లో తెలిపారు. నవంబర్‌లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో అధిక పెట్టుబడి కారణంగా ఆ కంపెనీలో 11,000 మందికి ఉద్యోగాలు పోయినట్లు ప్రకటించింది.

సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌కు పెయిడ్ రేంజ్ ని పరిచయం చేసినందుకు ఎలాన్ మస్క్‌ను టెక్ రంగంలో చాలా మంది విమర్శించినప్పటికీ, అతని పోటీదారులు మాత్రం అతన్ని జాగ్రత్తగా  గమనిస్తున్నారని తేలింది. బిగ్ టెక్‌ పరిస్థితి ఏమీ బాగోలేదు. కానీ బిగ్ టెక్ కస్టమర్‌లకు కూడా ఈ రోజుల్లో ఇబ్బందిగానే ఉంది. ఎలాన్ మస్క్ చేసిన ప్రయోగం వల్ల జనాలు మెరుగైన అనుభవం కోసం ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.