ముంబైలో మొదటి ఆపిల్ స్టోర్‌ను తెరిచిన టిమ్ కుక్..!

ఈ రోజు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారత దేశంలోని మొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను టిమ్ కుక్ ప్రారంభించిన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉన్న అభిమానుల కోసం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈరోజు ఉదయం అందరినీ స్టోర్ లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఇకపోతే భారతదేశంలో ఆపిల్ యొక్క రెండవ రిటైల్ స్టోర్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇకపోతే ప్రారంభమైన వెంటనే కుక్ […]

Share:

ఈ రోజు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారత దేశంలోని మొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను టిమ్ కుక్ ప్రారంభించిన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉన్న అభిమానుల కోసం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈరోజు ఉదయం అందరినీ స్టోర్ లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఇకపోతే భారతదేశంలో ఆపిల్ యొక్క రెండవ రిటైల్ స్టోర్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇకపోతే ప్రారంభమైన వెంటనే కుక్ ఎనర్జీ ముంబై ఇన్క్రెడిబుల్ అని ట్వీట్ చేశారు. “ముంబైలో ఉన్న శక్తి సృజనాత్మకత మరియు అభిరుచి అపురూపం. భారతదేశంలో మా మొదటి స్టోర్‌ తెరవడానికి చాలా సంతోషిస్తున్నాము” అంటూ ఆయన తెలిపారు.

ఇకపోతే ఆపిల్ స్టోర్ ఉత్పత్తి, విక్రయాలు, సేవలు మరియు ఉపకరణాల కోసం ఒక స్టాక్ గమ్యస్థానంగా పనిచేయడం ద్వారా కష్టమర్లకు అగ్రశ్రేణి అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దుకాణాలలోని అద్భుతమైన వాస్తు కూడా ఎదురులేని కస్టమర్ అనుభవాన్ని జోడిస్తోంది. భారతదేశంలో ఆపిల్… రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించడంతో ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టెక్ దిగ్గజం ఉత్పత్తులను ఉపయోగించే వినియోగదారులలో చాలామంది ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి గుజరాత్ మరియు రాజస్థాన్ వంటి చాలా దూరప్రాంతాల నుండి రావడం హర్షదాయకం.

ఇక్కడ ఒక అభిమాని పాతకాలపు ఆపిల్ కంప్యూటర్ ను మోస్తూ కనిపించాడు. తాను 1984లో దీనిని కొన్నానని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఆపిల్ ప్రయాణాన్ని చూపించడానికి దీనిని ఇక్కడికి తీసుకొచ్చాను.. 1984లో కొనుగోలు చేశాను.. అప్పటినుంచి ఆపిల్ ఉత్పత్తులను వాడడం మొదలుపెట్టాను. ఇది 2మెగా బైట్ల బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ అయితే ఇప్పుడు ఆపిల్ 4కే తయారు చేస్తోంది. 8 కే , రిజల్యూషన్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి. ఇకపోతే క్యూలో ఉన్నవారిలో చాలామంది నిన్న సాయంత్రం నుండే వేచి ఉన్నామని తెలిపారు. ఇక వారు తమ ఆపిల్ ఉత్పత్తులను ఫ్లాషింగ్ చేస్తూ కనిపించారు. ఇకపోతే ఒక అభిమాని గంటల తరబడి ఆహారం, నిద్ర లేకుండా దుకాణం వెలుపలే క్యాంపింగ్ చేశారని చెప్పుకొచ్చారు.

మరొక అభిమాని విషయానికి వస్తే తాను రాజస్థాన్ నుంచి వచ్చానని టింను కలిసే అవకాశం ఉన్నందున చాలా ఉత్సాహంగా ఉన్నానని.. తాను గత పది సంవత్సరాలుగా ఆపిల్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నానని తెలిపారు. రాజస్థాన్ నుండి ముంబైకి విమానంలో బయలుదేరానని.. సాకేత్ లో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభోత్సవం కోసం ఢిల్లీకి కూడా వెళ్తానని ఆ అభిమాని తెలిపాడు. ఆపిల్ పరికరాలు తమ జీవితాలను చాలా మెరుగుపరచాయి అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు తమ ఉత్సాహాన్ని వివరించారు.

మరొకవైపు పాతకాలపు కంప్యూటర్ తీసుకువచ్చిన అభిమానిని ఆపిల్ సీఈవో ఉత్సాహంగా స్వాగతిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే భారీ లాంచ్‌ల కోసం కుక్ భారత్‌ను సందర్శిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. “హలో ముంబై రేపు కొత్త ఆపిల్ బికేసికి మా కస్టమర్లను స్వాగతించడానికి మేము ఇంక ఆగలేకపోతున్నాము ఉండలేము” అన్నారు. ఢిల్లీలో కూడా సరికొత్త స్టోర్ ప్రారంభించనున్నారు.