యూట్యూబ్ లో మాల్వేర్ వీడియోలు.. జాగ్రత్తగా ఉండకపోతే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ..

మాల్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే మోసపూరిత వ్యూహాలను వీడియోలు కలిగి ఉంటాయి, వాటిని గుర్తించడం మరియు తీసివేయడం యూట్యూబ్ అల్గారిథమ్‌కు సవాలుగా మారింది. వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్.. ప్రస్తుతం చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు యూట్యూబ్ వీడియోలకు అలవాటు పడ్డారు.. యూట్యూబ్ కి ఉన్న యూజర్ బేస్ మరే ఇతర వీడియో ఫ్లాట్ ఫామ్ కి లేదంటే అతిశయోక్తి కాదు.. అందుకే సైబర్ నేరగాళ్లు యూట్యూబ్ యూజర్ లను […]

Share:

మాల్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే మోసపూరిత వ్యూహాలను వీడియోలు కలిగి ఉంటాయి, వాటిని గుర్తించడం మరియు తీసివేయడం యూట్యూబ్ అల్గారిథమ్‌కు సవాలుగా మారింది.

వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్.. ప్రస్తుతం చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు యూట్యూబ్ వీడియోలకు అలవాటు పడ్డారు.. యూట్యూబ్ కి ఉన్న యూజర్ బేస్ మరే ఇతర వీడియో ఫ్లాట్ ఫామ్ కి లేదంటే అతిశయోక్తి కాదు.. అందుకే సైబర్ నేరగాళ్లు యూట్యూబ్ యూజర్ లను టార్గెట్ చేస్తున్నారు.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే పనిలో పడ్డారు.. 

122 మిలియన్లకు పైగా..

గ్లోబల్ మీడియా ఇండెక్స్ ప్రకారం.. ప్రతిరోజు 122 మిలియన్లకు పైగా యూట్యూబ్ వీడియోలను చూస్తున్నారు. ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ గంటల కంటెంట్ ను చూస్తున్నారు. 467 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులతో భారతదేశం అతిపెద్ద యూట్యూబ్ వినియోగదారుల జనాభా కలిగి ఉందని వెబ్సైట్ తెలిపింది.. 

మాల్వేర్ లింక్స్..

సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెట్ ప్రకారం.. నవంబర్ 2022 నుండి నెలకు 200 నుంచి 300 వీడియోల కంటెంట్ పెరిగింది. అడోబ్ ఫోటోషాప్, ఆటో కార్డ్ వంటి లైసెన్స్ పొందిన సాఫ్ట్వేర్ నుంచి  మాల్వేర్ లింక్స్ ఉన్న యూట్యూబ్ వీడియోలు ఇటీవల గణనీయంగా పెరిగాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఇన్ఫో స్టీలర్స్ అని పిలిచే ఒక మాల్వేర్ ఫేక్ వెబ్సైట్లు, డౌన్లోడ్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా యూజర్ల కంప్యూటర్ లోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆ సిస్టంలో దొంగలించిన క్యుసమాచారాన్ని ఈ మాల్వేర్ సైబర్ క్రైమ్ చేసే సర్వర్ కి  పంపిస్తుంది. దాంతో యూజర్ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది.  

ఏఐ జనరేటర్ వీడియోలతో జాగ్రత్త..

యూట్యూబ్ యూజర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి సైబర్ నేరస్తులు ఏఐ జనరేటర్ వీడియోలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పలు రకాల సాఫ్ట్ వేర్ల ప్రీమియం వెర్షన్ తీసుకోవాలనుకుంటారు కానీ.. అందుకు సరిపడినంత డబ్బు లేకపోవడంతో, కొన్ని యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పలు యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటారు. ఆ వీడియలలో వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంటారు. దాంతో అలాంటి వారిని టార్గెట్ చేసి దోపిడీ చేస్తున్నారు హ్యాకర్స్. 

సున్నితమైన కంటెంట్ గోవిందా..

సైబర్ నేరగాళ్లు ప్రతి గంటకు యూట్యూబ్ లో క్రాక్డ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్లు, హానికరమైన లింకులను కలిగి ఉన్న ఐదు నుంచి పది వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలు మాల్వేర్ ను డౌన్లోడ్ చేసేలా యూసర్లను ప్రేరేపిస్తాయి. వారు వీడియోలను అప్లోడ్ చేసేటప్పుడు ఈ నేరగాళ్లు యూట్యూబ్ అల్గారిధమ్ దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వీరి ఆటలు సాగుతున్నాయి.

ఈ మాల్వేర్ క్రెడిట్ కార్డ్ వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లు, పాస్ వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తుంది. ఖరీదైన సాఫ్ట్వేర్ల ఇల్లీగల్ కాపీలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రజలకు నేర్పించే వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని క్లౌడ్ సెట్ నివేదిక తెలిపింది. దాంతో వీడియోలను రూపొందించే వ్యక్తులు మాల్వేర్ చట్టబద్ధమైనదని భావించే లాగా, వ్యూవర్స్ ని మోసగించడానికి, వారు నమ్మకంగా ఉండేందుకు ఫేక్ వ్యక్తులను కూడా సృష్టించడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఇది పెరుగుతున్న ట్రెండ్. అందుకే జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ  నిపుణులు సూచిస్తున్నారు. అందువలన యూట్యూబ్ యూసర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సదరు సంస్థ హెచ్చరిస్తోంది. దయచేసి మాల్వేర్ లింకులను క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను తెలుపకుండా జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది.