నేను కూడా ఐఫోన్ 15 కొనబోతున్నా..

ఈనెల 22వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్15 అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాను కూడా ఈ ఫోన్‌ను కొనబోతున్నానని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. యాపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఐఫోన్ 15’ వచ్చేసింది. ఈ నెల 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ స్టోర్ల వద్ద ఫోన్ల కోసం జనం బారులు తీరుతున్నారు. సమయానికి డెలివరీ చేయలేదన్న కారణంతో కొన్ని చోట్ల స్టోర్ సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. ఐఫోన్ […]

Share:

ఈనెల 22వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్15 అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాను కూడా ఈ ఫోన్‌ను కొనబోతున్నానని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు.

యాపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఐఫోన్ 15’ వచ్చేసింది. ఈ నెల 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ స్టోర్ల వద్ద ఫోన్ల కోసం జనం బారులు తీరుతున్నారు. సమయానికి డెలివరీ చేయలేదన్న కారణంతో కొన్ని చోట్ల స్టోర్ సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. ఐఫోన్ 15 పిచ్చి అంతలా ఉంది మరి. ఇలా కొత్త ఐ ఫోన్ కొనాలని అనుకునే వారిలో ట్విట్టర్ (ఎక్స్) సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. త్వరలోనే తాను ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు 

ఫొటోలను షేర్ చేసిన టిమ్ కుక్

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌తో ఫొటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్క్స్‌, రూబెన్ వూ తీసిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌‌లో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ షేర్ చేశారు. వాళ్లు తీసిన ఫొటోలపై ప్రశంసలు కురిపించారు. ఐఫోన్ ద్వారా పరిమితులు లేని సృజనాత్మకతను సృష్టించవచ్చని ఫొటోగ్రాఫర్లు నిరూపించారని చెప్పారు. ఫొటోగ్రాఫర్లతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఐఫోన్ ద్వారా తీసే చిత్రాలు, వీడియోల అందం అపురూపమని కామెంట్ చేశారు.

ఏ కలర్ కొనబోతున్నారు సర్..

మరోవైపు న్యూయార్క్‌లోని ఓ యాపిల్ స్టోర్ వద్ద నెలకొన్న సందడి, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా టిమ్ కుక్ షేర్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. తాను కూడా ఒక ఐఫోన్ 15 ఫోన్ కొనబోతున్నానని ప్రకటించారు. ‘నేను కొనబోతున్నా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఎంతో మంది ఆ ట్వీట్‌పై స్పందిస్తున్నారు. అయితే ఆయన ఏ మోడల్, ఏ కలర్ కొనాలని అనుకుంటున్నారో చెప్పలేదు. దీంతో కొత్త ఫోన్‌లో ఏ ఫోన్‌ను కొంటారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏ కలర్ ఫోన్‌ను కొంటారో తెలుసుకోవాలని ఉందంటూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ట్విట్టర్‌‌లో వాణిజ్య ప్రకటనల కోసమే ఆయన ఇలా స్పందిస్తున్నారంటూ కొందరు నెగటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘ఇప్పుడు శామసంగ్ కంపెనీ వాడు ఏడుస్తుంటాడు‘ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఐఫోన్ 15లో నాలుగు మోడల్స్

2007లో తొలిసారి మార్కెట్‌లోకి ఐఫోన్ ఎంట్రీ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని సృష్టించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఏటా ఐఫోన్ సహా కొత్త ప్రొడక్టులను యాపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంటుంది. 16వ జనరేషన్ డివైస్ అయిన ఐఫోన్ 15ను ఇటీవల విడుదల చేసింది. కొత్తగా రిలీజ్ చేసిన ఐఫోన్ 15లో నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రకాలు ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లో మూడు (128 జీబీ, 256 జీబీ, 512 జీబీ) స్టోరేజీ కెపాసిటీలు ఉన్నాయి. పింక్, యెల్లో, గ్రీన్,బ్లూ, బ్లాక్ కలర్స్‌ ఉన్నాయి. ఐపోన్ 15 బేస్ స్టేరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.79,900. 15 ప్లస్ ధర రూ.89,900 నుంచి మొదలవుతుంది.  15 ప్రో 128 జీబీ ధర రూ.1,34,900 నుంచి, 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ ధర రూ.1,59,900 నుంచి ప్రారంభమతుంది.