Apple: చనిపోయిన వారి ఐఫోన్ అన్లాక్ చేయొచ్చా?

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్  (Apple) కంపెనీ అందిస్తున్న ఐఫోన్  (iPhone) కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్  (Apple) ప్రొడక్ట్స్ (Products) ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్  (iPhone) మాత్రమే కాకుండా, ఆపిల్  (Apple) సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ (Products) ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. కెనడాకు చెందిన ఒక వ్యక్తి బైక్ ఆక్సిడెంట్ ద్వారా మృతి చెందగా అతని ఐఫోన్  (iPhone) 13 […]

Share:

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్  (Apple) కంపెనీ అందిస్తున్న ఐఫోన్  (iPhone) కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్  (Apple) ప్రొడక్ట్స్ (Products) ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్  (iPhone) మాత్రమే కాకుండా, ఆపిల్  (Apple) సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ (Products) ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. కెనడాకు చెందిన ఒక వ్యక్తి బైక్ ఆక్సిడెంట్ ద్వారా మృతి చెందగా అతని ఐఫోన్  (iPhone) 13 అన్లాక్ చేసేందుకు ఫ్యామిలీ సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఉన్న తన తమ్ముడు జ్ఞాపకాల కోసం అతని అక్క కష్టపడుతుంది. మరి ఆపిల్  (Apple) ఎటువంటి వెసులుబాటు అందించిందో చూద్దాం. 

Read More: Elon Mask: భారీగా తగ్గిన ‘ఎక్స్’ విలువ..!

ఆపిల్ ఏం చెప్తోంది..: 

ఆమె బహుమతిగా ఇచ్చిన తన సోదరుడి ఐఫోన్  (iPhone) 13ని ఎలా అన్‌లాక్ చేయాలో ఎవరికీ తెలిదు. మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్  (Contact)స్, ఫోటోలు, డాక్యుమెంట్ ఫైల్స్ మరియు మరిన్ని… iPhoneలో ఆమె సోదరుడి జీవితంలోని జ్ఞాపకాలు మరియు చివరి క్షణాలు ఉన్నాయి. కానీ ఆమె ఏమి చేయగలదు?

ఇది చాలా కష్టమైన పని, నిపుణుడైన మొబైల్ టెక్నీషియన్ నుండి ఉత్తమంగా ఆశించేది ఐఫోన్  (iPhone)‌ను రీసెట్ చేయడమే.. కానీ అంత ఈజీ పని కాదది. మరణించిన కుటుంబ సభ్యుల Apple IDకి లింక్ చేసిన వేరొక iPhone, iPad మరియు iPod వంటి Apple డివైసెస్ నుండి “యాక్టివేషన్ లాక్‌ని తీసివేయడానికి” Apple సదుపాయాన్ని అందిస్తుంది. కానీ మొబైల్ ఫోన్లో ఉన్న మెమొరీ తిరిగి వస్తుందా అనే విషయం గురించి స్పష్టం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆపిల్  (Apple) స్టోర్ కి వెళ్లి ఆపిల్  (Apple) ఐఫోన్  (iPhone) లోని మెమొరీ పోకుండా అన్లాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ మెమొరీ పోయే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఐక్లౌడ్  (ICloud) అకౌంట్ ఉపయోగించి, మెమొరీ పోకుండా అన్లాక్ చేయడానికి కాస్త అవకాశం ఉన్నప్పటికీ, పూర్తిగా రికవరీ అవుతుందని అవకాశం ఉండకపోవచ్చు. 

ఆపిల్ ఐక్లౌడ్ అకౌంట్ వెసులుబాటు: 

ఆపిల్  (Apple) ఇప్పుడు వినియోగదారులకు వ్యక్తిగత డేటా  (Data)ను అందజేయడానికి ఒక మార్గాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. iOS 15.2, iPadOS 15.2, macOS 12.1 లేదా అంతకంటే ఎక్కువ వర్షం వినియోగదారులు, వారి Apple ID కోసం లెగసీ కాంటాక్ట్  (Contact) అనేది లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. Apple ప్రకారం, లెగసీ కాంటాక్ట్  (Contact)‌ను లింక్ చేసుకోవడం అంటే, ఎవరైనా కావలసిన వాళ్లు చనిపోయినప్పుడు వాళ్ళ కాంటాక్ట్  (Contact) డేటా  (Data)ను మళ్ళీ రికవరీ చేసేందుకు ఈ ఐక్లౌడ్  (ICloud) అకౌంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది.. 

ఐక్లౌడ్  (ICloud) అకౌంట్ ద్వారా మొబైల్ అన్లాక్ చేసేందుకు.. లెగసీ కాంటాక్ట్  (Contact) ప్రత్యేకమైన యాక్సెస్ కీ.. వినియోగదారు మరణించిన తర్వాత మాత్రమే ఉపయోగించబడుతుంది. లెగసీ కాంటాక్ట్  (Contact)‌గా ముందుగా ప్రూవ్ చేసుకోవడానికి, తమ సొంత వారి డెత్ సర్టిఫికెట్ ఆపిల్  (Apple) స్టోర్ లో అందించాల్సిన అవసరం ఉంది. 

వెంటనే అప్డేట్ చేసుకోవాలి అంటూ..: 

భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ (Security) ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), iPhone, iPad మరియు Apple వాచ్‌లతో సహా ఆపిల్  (Apple) ఉత్పత్తుల్లోని ఉన్న వల్నరబిలిటీ గురించి ఆపిల్  (Apple)వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. అయితే రిస్క్ (Risk) విషయాన్నీ పక్కనపెట్టి, అప్డేట్ చేసుకోకపోతే తప్పకుండా తమ డేటా  (Data) రిస్క్ (Risk) లో పడే అవకాశం ఉందని గవర్నమెంట్ హెచ్చరిస్తోంది. అయితే ఇటువంటి హ్యాక్ అనేది ఏమీ జరగలేదని ఆపిల్  (Apple) సంస్థ ప్రకటించడం కూడా జరిగింది. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.