గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి వెబ్‌లోని ఫోటోలను టెక్స్ట్ రూపంలోకి మార్చడం ఎలా?

ప్రస్తుతం గూగుల్  ట్రాన్స్‌లేట్‌లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్‌సైటు ఇప్పుడు కంప్యూటర్లో లేదా మొబైల్‌లో, ల్యాప్ ట్యాప్‌లో ఉన్న ఫోటో లేదా స్క్రీన్ షాట్ అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తోంది. చాలా సందర్భాలలో వెబ్ ఫ్లాట్ ఫారంలోని చిత్రాలను టెక్స్ట్ గా మార్చవచ్చు. గూగుల్ లెన్స్ కోసం ఏ ఆర్ ట్రాన్స్‌లేట్‌ టూల్ లాగానే చాలా సాంకేతికతను ఉపయోగించుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చిత్రాల నుండి టెక్స్ట్ రూపంలో పొందవచ్చు. ఇకపోతే గూగుల్ ట్రాన్స్‌లేట్ […]

Share:

ప్రస్తుతం గూగుల్  ట్రాన్స్‌లేట్‌లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఈ వెబ్‌సైటు ఇప్పుడు కంప్యూటర్లో లేదా మొబైల్‌లో, ల్యాప్ ట్యాప్‌లో ఉన్న ఫోటో లేదా స్క్రీన్ షాట్ అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తోంది. చాలా సందర్భాలలో వెబ్ ఫ్లాట్ ఫారంలోని చిత్రాలను టెక్స్ట్ గా మార్చవచ్చు. గూగుల్ లెన్స్ కోసం ఏ ఆర్ ట్రాన్స్‌లేట్‌ టూల్ లాగానే చాలా సాంకేతికతను ఉపయోగించుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చిత్రాల నుండి టెక్స్ట్ రూపంలో పొందవచ్చు. ఇకపోతే గూగుల్ ట్రాన్స్‌లేట్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత పేజీ పైన భాగంలో ఉన్న ట్యాబ్‌ల వరుసను మీరు గమనించవచ్చు. అయితే ఇంతకుముందు కూడా మీరు ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ని ఉపయోగించినట్లయితే ఆ సైట్‌లో ఉన్న ట్యాబ్‌లతో పాటు ట్యాబ్‌లు వచ్చి చేరినట్లు మీరు గమనించవచ్చు. 

గూగుల్ ట్రాన్స్‌లేట్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసినప్పుడు ఆ పేజీ పైన ఉన్న ట్యాబ్‌ను క్లిక్ చేసి ఫోటో లేదా స్క్రీన్‌షాట్ ను అప్లోడ్ చేయవచ్చు. కొత్త ఫీచర్ ని మీరు టాప్ టు ట్రాన్స్‌లేట్ అని పిలవచ్చు. ఇకపోతే కంప్యూటర్ నుండి ఫోటో లేదా స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు అందులో ఉండే టెక్స్ట్‌నుమీరు కాపీ చేయవచ్చు లేదా టెక్స్ట్ నుంచి కన్వర్ట్ అయిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెబ్ ఇంటర్‌స్పేస్ 113 భాషలలో మీకు అందుబాటులో ఉంది. అలాగే 133 భాషల జాబితా కూడా కనిపిస్తుంది.

ఇకపోతే ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ పేరు ఇప్పుడు “లెన్స్ ట్రాన్స్‌లేట్‌” గా మార్చబడింది. అలాగే గూగుల్ లెన్స్ కోసం ఏ ఆర్ ట్రాన్స్‌లేట్‌కి శక్తిని ఇచ్చే ఒక జనరేటివ్ అడ్‌వర్సారియల్ నెట్వర్క్ (జిఏఎన్) ఉపయోగించబడుతుంది. గూగుల్ లెన్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్లో ఉన్న చిత్రాలను కన్వర్ట్ చేసినప్పటికీ, ఆ కంపెనీ యొక్క మ్యాజిక్ ఎరేజర్ వలె అది సాంకేతికను ఉపయోగించలేదు. అయితే ఇప్పుడు కొత్త వెర్షన్ గత సంవత్సరం ప్రారంభించబడింది. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి ఒరిజినల్ టెక్స్ట్‌ను కేవలం చూపడం మాత్రమే కాకుండా దాన్ని ఆ ఫోటోపై ఉంచి చూపుతుంది.

ఎవరైతే ఏవైనా సందేశాలు, మెనూ లేదా ఇతర పత్రాల వంటి ఫోటోల నుండి టెక్స్ట్‌కి కన్వర్ట్ చేయాల్సి వచ్చే వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు లేదా పేపర్ల నుండి మీరు టెక్స్ట్‌ను చాలా త్వరగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు విద్యార్థులకు, పరిశోధకులకు కూడా ఈ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు కన్వర్ట్ కాకుండా “షో ఒరిజినల్”. టోగుల్ పైన క్లిక్ చేస్తే ఆ ఫీచర్ పక్కపక్కనే కంపేర్ చేసి కూడా మీకు అందిస్తుంది. అంటే ఒక ఫోటోను మీరు అప్లోడ్ చేసి దానిని టెక్స్ట్ రూపంలోకి మార్చినప్పుడు మీకు “బిఫోర్”, “ఆఫ్టర్” లాగా మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు కన్వర్ట్ అయిన ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అందుకొని టెక్స్ట్‌ను మాత్రమే కాపీ చేసుకోవచ్చు. ముఖ్యంగా వెబ్ బ్రౌజర్లయిన వినియోగదారులు కూడా ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం పొందుతారు.