ఆధార్ మిత్ర చాట్‌బాట్‌ 

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌ల యుగం, అందుకే ఆధార్ కార్డును తయారు చేసే ప్రభుత్వ సంస్థ యూఐడీఏఐ కూడా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ‘ఆధార్ మిత్ర’ పేరుతో ఉన్న ఈ చాట్‌బాట్ మీ ఆధార్ కార్డ్ సంబంధిత సమస్యలను అర్థం చేసుకుంటుంది మరియు ప్రతిస్పందిస్తుంది. ఆధార్ కార్డు గురించి మీకు సందేహాలున్నాయా? అయితే మీరేమీ దిగులు పడకండి. ఆధార్ మిత్ర చాట్‌బాట్ లో మీ సందేహాలను తీర్చుకోండి.  ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా […]

Share:

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌ల యుగం, అందుకే ఆధార్ కార్డును తయారు చేసే ప్రభుత్వ సంస్థ యూఐడీఏఐ కూడా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ‘ఆధార్ మిత్ర’ పేరుతో ఉన్న ఈ చాట్‌బాట్ మీ ఆధార్ కార్డ్ సంబంధిత సమస్యలను అర్థం చేసుకుంటుంది మరియు ప్రతిస్పందిస్తుంది.

ఆధార్ కార్డు గురించి మీకు సందేహాలున్నాయా? అయితే మీరేమీ దిగులు పడకండి. ఆధార్ మిత్ర చాట్‌బాట్ లో మీ సందేహాలను తీర్చుకోండి. 

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుతున్నారు. ఓపెన్ ఏఐ చాట్‌ జీపీటీ ట్రెండింగ్‌లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుండటంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. పౌరుల ఆధార్‌కు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘ఆధార్ మిత్ర’ సర్వీస్ కొత్తగా ప్రారంభించింది యూఐడీఏఐ. ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్‌కు సంబంధించి ఏ సమస్యలు, సందేహాలు ఉన్నా ఆధార్ మిత్ర చాట్‌బాట్ లో తెలుసుకోవచ్చు.

చాట్‌ జీపీటీ అనేది ఒక చాట్‌బాట్ , దీనిని ఒక ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 30, 2022 లో లాంచ్ చేశారు. 

ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఒక నాన్ – ప్రాఫిట్ ఓపెన్ AI సంస్థ. ఈ సంస్థను 2015‌‌లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్, ఇంకొంతమందితో కలిసి స్థాపించారు.   

చాట్‌ జీపీటీ ఒక చాట్‌బాట్  అయినప్పటికీ మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా జవాబులు ఇస్తుంది. ఈ చాట్‌బాట్  వివిధ ఫీల్డ్ లలో ఉన్న సమాచారం గురించి ట్రైన్ అయ్యి ఉండటం వల్ల మనం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. 

జీపీటీ అనేది ఒక రక మైన మెషీన్ లెర్నింగ్ మోడల్. చాట్‌బాట్ ‌‌లను ముందునుంచే రకరకాల ఫీల్డ్‌‌లకు చెందిన ఇన్ఫర్మేషన్‌తో ట్రైన్ చేస్తారు. ఈ చాట్‌బాట్ ‌లు ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్‌తో అప్‌డేట్ చేయబడతాయి. అందుకే మనం అడిగే ప్రశ్నలకు చాలా కరెక్ట్‌గా జవాబు చెబుతాయి. 

ఆధార్ మిత్ర ఏఐ చాట్‌బాట్ 

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్, కంప్లైంట్ స్టేటస్ లాంటి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, సమస్యలకు ఆధార్ మిత్ర సమాచారం ఇస్తుంది. ఆధార్ మిత్ర ఏఐ చాట్‌బాట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చాట్‌బాట్.. ఆధార్ కార్డ్ హోల్డర్ల ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి శిక్షణ పొందిందని యూఐడీఏఐ చెబుతోంది.

మన దేశంలో ఏం చేయాలన్నా కానీ ఆధార్ తప్పనిసరి. రాబోయే రోజుల్లో పశువులకు కూడా ఆధార్ రానుందట. కాబట్టే ఆధార్ కార్డులో ఏవైనా ప్రాబ్ల్సం ఉంటే చాలా కష్టం అవుతుంది. మనం చివరికి ఒక సిమ్ తీసుకోవాలన్నా కానీ ఆధార్ కార్డు నెంబర్ ఉండి తీరాల్సిందే. అంతలా మన దేశంలో ప్రతీదీ ఆధార్​కు అనుసంధానం చేసేశారు. దీని వల్ల కొంత ట్రాన్స్​పరసీ (పారదర్శకత) పెరిగి వివిధ రకాల పథకాలు నిజమైన లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయి. అందుకోసమే ప్రభుత్వం ప్రతి దాని కోసం ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపడుతూ వస్తోంది. కానీ ఇందులో కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. దేశంలో చాలా మంది దాదాపు 10 సంవత్సరాల కింద ఆధార్ కార్డులు తీశారు. అందులో పది సంవత్సరాల క్రితం నాటి ఫొటో ఉంటుంది. కానీ ఆ ఫొటో ప్రస్తుతం మనమే గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. ఇక వీడియో కేవైసీ చేసే సమయంలో ఫొటోను మార్చుకోవాల్సిందిగా కొంత మంది సూచిస్తున్నారు.