విమానాల బుకింగ్ ఎప్పుడు బెటరో ఇక గూగుల్ చెప్పేస్తుంది

ప్రస్తుతం మొత్తం ఆన్ లైన్ జమానా నడుస్తోంది. చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ వాడుతున్నారు. మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నామంటే మన అందులో మన ఇంట్రెస్ట్ లను తప్పకుండా చూపుతాం. ఆ ఇంట్రెస్ట్ ను బట్టి మనం దేని గురించి ఏ సమయంలో వెతుకుతామో సెర్చ్ ఇంజిన్ ఇట్టే పసిగట్టేస్తుంది. దీంతో ఇది నెక్ట్స్ లెవెల్ అని కొంత మంది అంటుంటే స్మార్ట్ ఫోన్ వాడే వారి […]

Share:

ప్రస్తుతం మొత్తం ఆన్ లైన్ జమానా నడుస్తోంది. చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ వాడుతున్నారు. మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నామంటే మన అందులో మన ఇంట్రెస్ట్ లను తప్పకుండా చూపుతాం. ఆ ఇంట్రెస్ట్ ను బట్టి మనం దేని గురించి ఏ సమయంలో వెతుకుతామో సెర్చ్ ఇంజిన్ ఇట్టే పసిగట్టేస్తుంది. దీంతో ఇది నెక్ట్స్ లెవెల్ అని కొంత మంది అంటుంటే స్మార్ట్ ఫోన్ వాడే వారి ప్రైవసీకి భంగం కలిగించడమే అని కొంత మంది వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ ఈ ఫీచర్ల వల్ల కొంత మందికి మాత్రం ఉపయోగంగా ఉంటుందనేది ఎవరూ కాదనలేని నిజం. దీంతో చాలా మంది తమ ఇంట్రెస్ట్ లను స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. అలా నిక్షిప్తం చేసిన డేటాను బట్టి మన అవసరాలు తెలుసుకుంటున్న స్మార్ట్ ఫోన్ అందుకు తగ్గ మనకు సజెషన్స్ ఇస్తుంది. 

ఇక మీదట ఫ్లైట్స్ కూడా

ఇప్పటి వరకు మనం ఏ సమయంలో ఏ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంది. మనం ఈ రూట్ లో వెళ్లితే త్వరగా చేరుతామా? లేక ట్రాఫిక్ లో చిక్కుకుపోతామా అని మాత్రమే చూపించే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇంకో రకం వైరల్ టెక్నాలజీ అందుబాటులో కి వచ్చింది. ఈ టెక్నాలజీతో మనం ఏ సమయంలో ఫ్లైట్ బుక్ చేసుకుంటే తక్కువకు వస్తుందని కూడా గూగుల్ చెప్పనుంది. ఆన్లైన్ వేదిక అయిన గూగుల్ ఫ్లైట్స్ insights అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకు విమాన టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం గురించి సూచనలను అందిస్తుంది. ఈ సూచనలు అనేవి పాత రోజుల ధరను బట్టి ఉంటాయి. అంతే కానీ వారు ఖచ్చితంగా విషయం చెప్పలేరు. మీరు వెళ్లాలని అనుకుంటున్న మార్గంలో గతం లోని ధరల యావరేజ్ తో పోలిస్తే ప్రస్తుతం మీరు సెర్చ్ చేస్తున్న సమయంలో ధరలు ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. తద్వారా మీరు గతంలో కంటే ఎక్కువ ధర చెల్లించారా? లేక తక్కువ ధరకే టికెట్ వస్తుందా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వార్తను గూగుల్ తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. గూగుల్ ఈ ఫీచర్ గురించి అలా పోస్ట్ చేసిందో లేదో మొత్తం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ఫీచర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. 

ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్స్ 

గూగుల్ ఫ్లైట్స్ లో ఇది మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ఉపయోగకర ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ఓ సారి మనం లుక్కేస్తే… ఇందులో విశ్వసనీయమైన ట్రెండ్ డేటాతో సెర్చ్‌లు ఉంటాయి. అంతే కాకుండా మీరు ఎంచుకున్న తేదీలు మరియు డెస్టినేషన్ ల బట్టి టికెట్ల ధరలు ఎప్పుడు తక్కువగా ఉంటాయో కూడా మీరు తెలుసుకోవచ్చుు. ఇందుకు సంబంధించి గూగుల్ కూడా ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. 

ఎలా ఎనేబుల్ చేయాలంటే… 

గూగుల్ కొత్త ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇంత మంచి ఫీచర్ వచ్చినా కానీ దానిని ఎనేబుల్ చేయరాకపోవడం మరియు సరిగ్గా ఉపయోగించుకోరాకపోవడంతో చాలా మంది ఈ ఫీచర్ సౌకర్యాలను మిస్ అవుతున్నారు. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి, మీరు మీ గూగుల్ ఖాతాలోకి మొదటగా లాగిన్ అవ్వాలి. మీరు విమానం బుక్ చేసినపుడు టేకాఫ్‌కి ముందు గూగుల్ ప్రతి రోజు ధరను పర్యవేక్షిస్తుంది మరియు ధర తగ్గితే.. ఒక వేళ మీరు బుక్ చేసుకున్న విమానం టికెట్ ధర తగ్గితే గూగుల్ పే ద్వారా మీకు తేడాను తిరిగి చెల్లిస్తుంది. అందువల్ల ఫ్లైట్ యూజర్స్ లాభం పొందొచ్చు. గూగుల్ ఫ్లైట్స్ ద్వారా బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.