జీ మెయిల్ ఖాతాల‌ను డిలీట్ చేయ‌నున్న గూగుల్

గూగుల్ ప్రస్తుతం జిమెయిల్ అకౌంట్ డిలీట్ చేసే పనిలో పడింది అని చెప్పుకోవాలి. అనవసరమైన జిమెయిల్  ఎకౌంట్ల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది గూగుల్. అయితే ముఖ్యంగా రెండు విషయాలు చేస్తే మీ జిమెయిల్ అకౌంట్ ని మీరు కాపాడుకున్నట్లు అవుతుంది. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందాం..  మీ జీమెయిల్ అకౌంట్ జాగ్రత్త:  గూగుల్ ప్రస్తుతం జిమెయిల్ అకౌంట్ డిలీట్ చేసే పనిలో పడింది అని చెప్పుకోవాలి. అనవసరమైన జిమెయిల్  ఎకౌంట్ల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది […]

Share:

గూగుల్ ప్రస్తుతం జిమెయిల్ అకౌంట్ డిలీట్ చేసే పనిలో పడింది అని చెప్పుకోవాలి. అనవసరమైన జిమెయిల్  ఎకౌంట్ల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది గూగుల్. అయితే ముఖ్యంగా రెండు విషయాలు చేస్తే మీ జిమెయిల్ అకౌంట్ ని మీరు కాపాడుకున్నట్లు అవుతుంది. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందాం.. 

మీ జీమెయిల్ అకౌంట్ జాగ్రత్త: 

గూగుల్ ప్రస్తుతం జిమెయిల్ అకౌంట్ డిలీట్ చేసే పనిలో పడింది అని చెప్పుకోవాలి. అనవసరమైన జిమెయిల్  ఎకౌంట్ల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది గూగుల్. కానీ మీరు మీ జిమెయిల్ అకౌంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గూగుల్ డిలీట్ చేసేది కేవలం కొన్ని జిమెయిల్ అకౌంట్లను మాత్రమే. చాలా కాలం నుంచి ఉపయోగంలో లేకుండా ఉన్నట్లయితే ఆ జిమెయిల్ అకౌంట్లను డిలీట్ చేసే పనిలో పడింది గూగుల్. ముఖ్యంగా మీ జిమెయిల్ అకౌంట్ డిలీట్ అయ్యే క్రమంలో ముందుగానే గూగుల్ మీకు ఇంటిమేట్ కూడా చేస్తుంది. ఒకవేళ అప్పటికి మీరు మీ జిమెయిల్ అకౌంట్ అయి అవసరం లేదు అనుకుంటేనే గూగుల్ మీ జిమెయిల్ అకౌంట్ ని డిలీట్ చేసేస్తుంది. 

ఉపయోగంలో లేనివి డిలీట్: 

మీ మొబైల్ ఫోన్లో ఒకటికి మించిన గూగుల్ అకౌంట్స్ గనక ఉన్నట్లయితే అవి రెండు సంవత్సరాల నుంచి ఉపయోగం లో లేనట్లయితే అటువంటి అకౌంట్స్ ను గూగుల్ డిలీట్ చేసే పనిలో పడింది. ముఖ్యంగా మీరు గూగుల్ సర్వీసెస్ అంటే యూట్యూబ్ వంటివి రెండు సంవత్సరాల నుంచి ఉపయోగించలేనట్టు గూగుల్ గమనించినట్లయితే అటువంటి అకౌంట్లను మాత్రమే డిలీట్ చేస్తుంది గూగుల్. అయితే ఎవరైనా తమ అకౌంట్లను జాగ్రత్తగా చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఈరోజే గూగుల్ అకౌంట్ ని మరొకసారి ఓపెన్ చేసి కాస్త సమయం ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు గూగుల్ అకౌంట్ డిసెంబర్ 2023 లోపు మీ గూగుల్ అకౌంట్స్ అన్నిటిని యాక్టివ్గా ఉంచుకోవడం మీ బాధ్యత. డిసెంబర్ తర్వాత నుంచి గూగుల్, ఉపయోగం లేని అకౌంట్ల డిలీట్ చేసే ప్రక్రియను ప్రారంభించనుంది. 

ముందుగానే ఇంటిమేట్ చేస్తుంది: 

మీరు ఒకవేళ రెండు సంవత్సరాల నుంచి మీ అకౌంట్ ను యాక్టివ్ లో ఉంచుకున్నట్లయితే, కచ్చితంగా గూగుల్ నుంచే మీకు ఒక ఇంటిమేషన్ వస్తుంది. గూగుల్ అకౌంట్లను డిలీట్ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి, గూగుల్ మన అకౌంట్లను డిలీట్ చేసే ముందు రెండు మూడు సార్లు ఇంటిమేషన్ అయితే పంపిస్తుంది. మనం అప్పటికి కూడా మన గూగుల్ అకౌంట్ ని ఇనాక్టీవ్ లోనే ఉంచినట్లయితే, డిసెంబర్ 2023 తరువాత డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటిమేట్ చేయకుండా మన గూగుల్ అకౌంట్ ని గూగుల్ ఎప్పటికీ డిలీట్ చేసే అవకాశం ఉండదు. మరో విషయం, మన జిమెయిల్ అకౌంట్ ఉపయోగంలో లేనట్లు అంటే, మనం రెండు సంవత్సరాలలో ఎవరికి మెయిల్స్ పంపించడం గాని, రిసీవ్ చేసుకోవడం లేకపోతే, మన జిమెయిల్ అకౌంట్ ఉన్న గూగుల్ సర్వీసెస్ ఉపయోగించడం ద్వారా, ఎకౌంటు యాక్టివ్ లో ఉంచుకున్న వాళ్ళం అవుతాము. ప్లేస్టోర్ నుంచి ఆప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, గూగుల్ అకౌంట్ యూస్ చేసి ఫోటోలు షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయడంతో మన అకౌంట్ ని యాక్టీవ్ లో ఉంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీ ఎకౌంట్ రెండు సంవత్సరాల నుంచి ఇనాక్టీవ్ లో ఉంటే గనక ఇప్పుడే ఆక్టివేట్ చేసుకోండి.