గూగుల్ పిక్సెల్ 8, 8 ప్రో ఫీచ‌ర్లు లీక్

గూగుల్ పిక్సెల్ 8 అదే విధంగా గూగుల్ పిక్సెల్ 8 ప్రో వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయిన క్రమం కనిపిస్తోంది. ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు సోషల్ మీడియా లీక్ అవడంతో పలు వివరాలు బయటపడ్డాయి. నిజానికి ఈ మొబైల్స్ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  గూగుల్ పిక్సెల్ 8, 8 ప్రో విశేషాలు లీక్:  గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను విడుదల […]

Share:

గూగుల్ పిక్సెల్ 8 అదే విధంగా గూగుల్ పిక్సెల్ 8 ప్రో వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయిన క్రమం కనిపిస్తోంది. ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు సోషల్ మీడియా లీక్ అవడంతో పలు వివరాలు బయటపడ్డాయి. నిజానికి ఈ మొబైల్స్ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

గూగుల్ పిక్సెల్ 8, 8 ప్రో విశేషాలు లీక్: 

గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ డివైజ్‌ల డిజైన్, స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌ల గురించిన  సమాచారం కొంతకాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గూగుల్ కి సంబంధించి ఇప్పుడు ఫోన్‌లు, వాచ్‌లు లాంచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో, వీటి గురించిన మరింత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం, Google Pixel 8, గూగుల్ Pixel 8 Pro స్వల్ప మార్పులతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు ఫోన్‌ల సమాచారం ప్రకారం.. రెండు ఫోన్లు కూడా వేర్వేరు రంగులలో కనిపిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 8 నాలుగు వేర్వేరు రంగులలో వస్తుంది, అయితే గూగుల్ పిక్సెల్ 8 ప్రో మూడు విభిన్న రంగులలో వస్తుంది. అయితే వచ్చిన స్వల్ప మార్పులలో, రెండు ఫోన్‌లు స్లిమ్ బెజెల్స్, అంతేకాకుండా పంచ్-హోల్ నాచ్ డిజైన్‌తో రాబోతున్నట్లు సమాచారం.

ధర, స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం రండి: 

ధర పరంగా, గూగుల్ Pixel 8 సుమారు రూ. 70,200, ధరతో ప్రారంభమవ్వచ్చని అంచనా. అయితే గూగుల్ Pixel 8 Pro ప్రారంభ ధర దాదాపు రూ. 96,500గా ఉండొచ్చని అంచనా. 

లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, గూగుల్ Pixel 8 6.17-అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్, 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. మరోవైపు, పిక్సెల్ 8 ప్రో 3120×1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో రాబోతోంది. గూగుల్ Pixel 8లాగానే, గూగుల్ Pixel 8 Pro కూడా 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నట్లు సమాచారం.

గూగుల్ Pixel 8 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వినియోగదారుల కోసం రాబోతోంది. ఒకటి 8GB RAM, 128 GB స్టోరేజ్, మరొకటి 8 GB RAM మరియు 256 GB స్టోరేజ్‌తో వస్తున్నట్లు లీక్ ఆయన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇక పిక్సెల్ 8 ప్రో మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వినియోగదారుల కోసం రాబోతోందని భావిస్తున్నారు. 12GB RAM + 128GB, 12GB RAM + 256GB మరియు 12GB RAM + 512GB..

మొబైల్ కొనే ముందు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూసేది కెమెరా వైపే, రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో రాబోతున్నట్లు భావిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 8 అల్ట్రా-వైడ్ యాంగిల్ షాట్‌ల కోసం సోనీ IMX386 సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఉండచ్చు. Pixel 8 Pro 64-మెగాపిక్సెల్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. రెండు ఫోన్‌ల ఫ్రంట్ కెమెరాలో 11 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. Pixel ఫోన్‌లు గతంలో వాటి కెమెరా పనితీరు గురించి వినియోగదారుల అభిమానాలు సంపాదించుకుంది. మొబైల్స్ కి సంబంధించి ఎటువంటి లీక్స్ వచ్చినప్పటికీ, ఈసారి గూగుల్ తన వైపు నుంచి అక్టోబర్ 4న విడుదల చేయబోయే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.