Google Chrome ఇన్‌కాగ్నిటో ఫీచర్లు తెలుసుకోండి

గూగుల్ క్రోమ్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. లాక్ ఫీచర్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ అవసరం ద్వారా  ఇన్‌కాగ్నిటో మోడ్ ను ఉపయోగిస్తున్నప్పుడు యూజర్లకు మరింత ప్రైవసీని అందించడానికి రూపొందించబడింది. Google Chrome కొత్త ప్రైవసీ ఫీచర్‌ను ప్రకటించింది. ఇది యూజర్లు బయోమెట్రిక్ ప్రమాణీకరణతో వారి ఇన్‌కాగ్నిటో మోడ్ సెషన్‌లను లాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ iOSలోని Chrome యూజర్లందరికీ ఇప్పటికే అందుబాటులో ఉంది, ప్రస్తుతం Android యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. Google […]

Share:

గూగుల్ క్రోమ్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. లాక్ ఫీచర్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ అవసరం ద్వారా  ఇన్‌కాగ్నిటో మోడ్ ను ఉపయోగిస్తున్నప్పుడు యూజర్లకు మరింత ప్రైవసీని అందించడానికి రూపొందించబడింది.

Google Chrome కొత్త ప్రైవసీ ఫీచర్‌ను ప్రకటించింది. ఇది యూజర్లు బయోమెట్రిక్ ప్రమాణీకరణతో వారి ఇన్‌కాగ్నిటో మోడ్ సెషన్‌లను లాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ iOSలోని Chrome యూజర్లందరికీ ఇప్పటికే అందుబాటులో ఉంది, ప్రస్తుతం Android యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది.

Google Chrome ఫీచర్ ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, సెషన్‌కు అంతరాయం ఏర్పడిన తర్వాత తిరిగి ప్రారంభించబడినప్పుడు వేలిముద్ర లేదా ఫేస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ ప్రామాణీకరణ సెక్యూరిటీ ద్వారా యూజర్లకు మరింత ప్రైవసీని అందించడానికి రూపొందించబడింది.

ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో లాక్‌ని ఎలా ఆన్ చేయాలి

ఈ ఫీచర్‌ను ఇనేబుల్ చేయడానికి, యూజర్లు Chrome సెట్టింగ్‌లకు  వెళ్ళాలి.

యూజర్లు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి Chromeలో సహాయపడే ఐదు మార్గాలలో ఈ కొత్త ఫీచర్ ఒకటి. Chromeలో మరో నాలుగు ప్రైవసీ సెంటర్డ్ ఫీచర్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ప్రైవసీ గైడ్: ప్రైవసీ గైడ్ అనేది Chromeలో కీలకమైన సెక్యూరిటీ, ప్రైవసీ కంట్రోల్ యొక్క సలహాదారు. మీరు హిస్టరీ చెక్ చేసినప్పుడు, లేదా ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లు చూసినప్పుడు, ఏదైనా  డౌన్‌లోడ్‌లు చేసినప్పుడు, ఫాస్ట్ మరియు సేఫ్టీ గల మెరుగైన సురక్షితమైన బ్రౌజింగ్‌ని ఎంచుకున్నప్పుడు.. ప్రైవసీ ఆప్షన్స్ ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది.  సెక్యూరిటీ మార్గదర్శినిని యాక్సెస్ చేయడానికి.. Chrome లో కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెనుని క్లిక్ చేసి, “సెట్టింగ్స్” ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు, “ప్రైవసీ, సెక్యూరిటీ” ట్యాబ్‌కు నావిగేట్ చేయండి.

సేఫ్టీ చెక్: 

Chrome యొక్క సేఫ్టీ చెక్ అనేది సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు లేదా హానికరమైన వైరస్‌లను గుర్తిస్తే, మిమ్మల్ని హెచ్చరించే ఒక ఫీచర్. అప్‌డేట్‌లు ఉన్నప్పుడు, అత్యంత నూతనమయిన ప్రొయాక్టివ్ రక్షణలతో రక్షించబడినప్పుడు ఇన్‌స్టాల్ చేయమని ఇది మీకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు, మీరు ఇంతకు ముందు వెబ్‌సైట్‌లలో బ్రౌజ్ చేసిన వాటి గురించి మరింతగా ఉపయోగపడే రెకమండేషన్స్, రిమైండర్‌లను సేఫ్టీ చెక్ ద్వారా పరీక్షిస్తుంది. అనుమతులను ఉపసంహరించుకోవడానికి, మీ సెక్యూరిటీను రక్షించడానికి ఆ నియంత్రణలను ఒకే చోట చూడవచ్చు.

బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి: 

మీరు హిస్టరీ, కుక్కీలు, క్యాచీలతో పాటు మీ Chrome బ్రౌజింగ్ డేటాను నిర్దిష్ట సమయం నుండి లేదా పూర్తిగా తొలగించవచ్చు. మీకు మరింత నియంత్రణ కావాలంటే, మీరు సందర్శించిన పేజీల నుండి ఆటోఫిల్ సమాచారం వరకు వ్యక్తిగత అంశాలను తొలగించవచ్చు. Chrome చిరునామా బార్‌లో “బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి (Clear Browsing History)” అని టైప్ చేయడం ద్వారా కావాల్సిన డేటా క్లియర్ చేయవచ్చు.

Google పాస్‌వర్డ్ మేనేజర్: 

Google పాస్‌వర్డ్ మేనేజర్ మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో పాస్‌వర్డ్‌లను క్రియేట్ చెయ్యడం, గుర్తుంచుకోవడం, ఆటోఫిల్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది నేరుగా Chromeలో ఉంటుంది, మీరు మీ పాస్‌వర్డ్‌లను Google ఖాతా ద్వారా ఓపెన్ చేసినట్లయితే, మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మీ ఫోన్, ల్యాప్‌టాప్‌లోని Chromeలో అలాగే Android, iOS యాప్‌లలో కూడా ఉపయోగించవచ్చు.