HDFC కార్డు ఉందా?? మీకు అదిరిపోయే శుభవార్త

క్రెడిట్ కార్డు ఉన్నా కానీ దానిని యూపీఐకి లింక్ చేసుకుని చెల్లింపులు చేసేలా HDFC బ్యాంక్ తన కస్టమర్లకు సౌకర్యాన్ని కల్పించింది UPI (యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్) ఈ విధానం ఇండియాలో ఎంత సక్సెస్ అయిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెలకు కొన్ని బిలియన్ కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరుగుతున్నాయని ఇప్పటికే ఆర్బీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అనేక రిపోర్టులను కూడా మనం చూశాం. డిజిటల్ పేమెంట్స్​కు ఊతమివ్వాలనే ఇండియా ఆలోచనకు సరైన రూపమే ఈ యూపీఐ. […]

Share:

క్రెడిట్ కార్డు ఉన్నా కానీ దానిని యూపీఐకి లింక్ చేసుకుని చెల్లింపులు చేసేలా HDFC బ్యాంక్ తన కస్టమర్లకు సౌకర్యాన్ని కల్పించింది

UPI (యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్) ఈ విధానం ఇండియాలో ఎంత సక్సెస్ అయిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెలకు కొన్ని బిలియన్ కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరుగుతున్నాయని ఇప్పటికే ఆర్బీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అనేక రిపోర్టులను కూడా మనం చూశాం. డిజిటల్ పేమెంట్స్​కు ఊతమివ్వాలనే ఇండియా ఆలోచనకు సరైన రూపమే ఈ యూపీఐ. రూపాయి చెల్లింపు నుంచి లక్షల వరకు చెల్లింపు ఈ యూపీఐ ద్వారానే జరుగుతోంది. కిరాణా షాపులలో కానీ, మాల్స్​లో కానీ, ఎక్కడైనా కానీ నగదు చెల్లింపును ఈ యూపీఐ మరింత సులభం చేసింది. అందుకోసమే దేశంలో చాలా మంది ప్రస్తుతం యూపీఐకి అలవాటు పడ్డారు. యూపీఐ లేకపోతే జీవితమే ముందుకు సాగదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. జనాలు నగదు చెల్లించడానికి బదులు సులభంగా చేసే యూపీఐ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. ఎంత చిన్న దుకాణానికి పోయినా కానీ, పెద్ద మాల్ లేదా సూపర్ మార్కెట్​కు పోయినా కానీ బిల్లెంతయిందని అడగడమే తరువాయి.. జేబులోంచి ఫోన్ తీసి అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేస్తూ సెకనులో చెల్లింపులు చేసేస్తున్నారు. ఇక యూపీఐ కంప్లైంట్లను కూడా చాలా తొందరగా పరిష్కరిస్తుండడంతో ఈ పేమెంట్స్ మెథడ్​ను చాలా మంది వాడుతున్నారు.

సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే…

కానీ యూపీఐతో వచ్చిన చిక్కేంటంటే.. కేవలం సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే మనం ఎక్కడైనా సరే ఇన్నాళ్లూ పేమెంట్స్ చేయొచ్చేది. సేవింగ్స్ అకౌంట్ కనుక లేకపోతే మన వద్ద డబ్బులున్నా క్యూఆర్ ద్వారా పేమెంట్లు చేసేందుకు వీలుండేది కాదు. ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్​ను యూపీఐకి లింక్ చేసిన తర్వాత మాత్రమే యూపీఐ చెల్లింపులు చేసేందుకు వీలుండేది. కానీ తాజాగా ఈ పద్ధతిలో మార్పు చేస్తూ ఓ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకు నిర్ణయంతో కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

క్రెడిట్ కార్డు ఉన్నా కానీ..

క్రెడిట్ కార్డు ఉన్నా కానీ దానిని యూపీఐకి లింక్ చేసుకుని చెల్లింపులు చేసేలా HDFC బ్యాంక్ తన కస్టమర్లకు సౌకర్యాన్ని కల్పించింది. ఎవరి వద్దైతే HDFC రూపే క్రెడిట్ కార్డు ఉంటుందో వారు.. యూపీఐ అకౌంట్​కు ఆ కార్డును కూడా జోడించుకుని నగదు చెల్లింపులు చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ విధానం తీసుకురావడం పట్ల పలువురు ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భిమ్ యూపీఐతో పాటు ఇతర యూపీఐ యాప్స్​కు కూడా.. నిశ్చింతగా ఇక HDFC క్రెడిట్ కార్డును జత చేసుకోవచ్చునని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల ఖాతాదారులకు మరింత సులభమైన చెల్లింపులు చేసే సౌకర్యం కలగనుంది.

నిరక్షరాస్యులు కూడా..

దేశంలో ఉన్న పలువురు నిరక్షరాస్యులు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వారు కూడా క్యూఆర్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయడం నేర్చేసుకుంటున్నారు. నోట్ల రద్దు సమయంలో చాలా ప్రాంతాల్లో ఈ యూపీఐ పేమెంట్లు అందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్ని రోజులు కేవలం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్​తోనే ఉండే పేమెంట్లకు ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా యాడ్ అయింది. ఇక ఈ పేమెంట్లు ఏ రేంజ్​లో పెరుగుతాయో వేచి చూడాలి. ఇది యూపీఐ వాడే యూజర్లకు శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ ఎంచక్కా.. మనకు కావాల్సినవి క్రెడిట్ కార్డుతో కొనుక్కునే సదుపాయం వచ్చింది.