ప్రాణాంతక టౌ ప్రోటీన్ ని నివారించేందుకు కొత్త డ్రగ్ మార్కెట్ లోకి వచ్చేసింది

అల్జీమర్స్ వ్యాధికి UCL మరియు UCLH లో మొదటి ట్రయిల్ గా జెన్ థెరఫీని ప్రయోగించారు, ఈ థెరఫీ ద్వారా ‘టౌ’ అనే హానికరమైన ప్రోటీన్ కలిగించే నష్టాలను తగ్గిస్తుంది. ప్రముఖ న్యూరోలాజిస్ట్ క్యాథరీన్ మమ్మరీ ఈ పరిశోధనలను నిర్వహించారు. ఈమె UCL క్వీన్ స్క్వేర్ అఫ్ న్యూరాలజీ & నేషనల్ హాస్పిటల్ ఫర్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీలో పని చేస్తుంది. ఆమె చెప్పేది ఏమిటంటే జెన్ థెరఫీ ద్వారా ఇలాంటి పరిశోధనలు జరగడం ప్రపంచంలో […]

Share:

అల్జీమర్స్ వ్యాధికి UCL మరియు UCLH లో మొదటి ట్రయిల్ గా జెన్ థెరఫీని ప్రయోగించారు, ఈ థెరఫీ ద్వారా ‘టౌ’ అనే హానికరమైన ప్రోటీన్ కలిగించే నష్టాలను తగ్గిస్తుంది. ప్రముఖ న్యూరోలాజిస్ట్ క్యాథరీన్ మమ్మరీ ఈ పరిశోధనలను నిర్వహించారు. ఈమె UCL క్వీన్ స్క్వేర్ అఫ్ న్యూరాలజీ & నేషనల్ హాస్పిటల్ ఫర్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీలో పని చేస్తుంది. ఆమె చెప్పేది ఏమిటంటే జెన్ థెరఫీ ద్వారా ఇలాంటి పరిశోధనలు జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి, ఇది వర్కౌట్ అవుతుంది కూడా అంటూ చెప్పుకొచ్చింది. డమేన్తియా మరియు అల్జీమర్స్ వ్యాధి తీవ్రతని తగ్గించాలంటే ఇదొక్కటే మార్గం అట. ఈ థెరఫీకి BIIB080 (/IONIS-MAPTRx) అనే డ్రగ్ అవసరం ఉంటుంది. ఇది ఒక యాంటీ సెన్స్ ఒలిగోన్యూక్లియోటైడ్. ఇది జెన్ కోడింగ్ లో ‘టౌ’ ప్రోటీన్ తీవ్రతని అమాంతం తగ్గించేస్తుంది. ఈ టౌ ప్రోటీన్ ని మైక్రో ట్యూబుల్ ప్రోటీన్ టౌ జెన్ అని అంటారు డాక్టర్లు.

ఈ డ్రగ్ ఉపయోగించడం వల్ల శరీరంలో అత్యంత ప్రమాదకరమైన టౌ ప్రోటీన్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గుయించవచ్చు అని, అల్జీమర్స్ వ్యాధి మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తుందని రీసెంట్ గా జరిగిన పరిశోధనల ఆధారంగా చెప్తున్నారు. ఇక ఈ డ్రగ్ తదుపరి ట్రైల్స్ ని నిర్వహించడం కోసం భారీ ఎత్తున పేషెంట్స్ అవసరం ఉంటుందని, మొదటి ఫేస్ లో 46 మంది పేషెంట్స్ పై ఈ డ్రగ్ ని ఉపయోగించగా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకున్నారని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కాబట్టి ఈ డ్రగ్ ని మిగిలిన ట్రైల్స్ లో ఎక్కువ శాతం పేషెంట్స్ పై ప్రయోగించవచ్చు అని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. ఇది వరకు టౌ ప్రోటీన్ కి ఎలాంటి ట్రీట్ మెంట్ లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇచ్చిన అదుకేన్యుమాబ్, లేకనేమాబ్ అనే రెండు డ్రగ్స్ వచ్చాయి, వీటినే వాడకంలో ఉంచారు డాక్టర్లు ఇన్ని రోజులు.

అయితే BIIB080 డ్రగ్ ఇంతకు ముందు అందుబాటులో ఉన్న ఆ రెండు డ్రగ్స్ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాయని, MAPT జెన్ నుండి శరీరంలో టౌ ప్రోటీన్ ఉత్పత్తిని కేవలం ఈ డ్రగ్ మాత్రమే నివారించగలదని డాక్టర్లు చెప్తున్నారు. ఈ డ్రగ్ ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్న పేషెంట్స్ లో అధిక శాతం మంది 66 ఏళ్ళ వయస్సు ఉన్నవాళ్లే అవడం విశేషం. ఈ డ్రగ్ ని ట్రైల్స్ లో మూడు డోసుల ద్వారా ఇస్తారు, ఈ డ్రగ్ ని ఇంట్రాటెక్కల్ ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఈ ఇంజక్షన్ మన శరీరంలో స్పైనల్ కెనాల్ ద్వారా ప్రయాణించి నెర్వస్ సిస్టంలోకి చేరుకుంటుందట. అయితే ఈ డ్రగ్ ద్వారా పేషెంట్స్ కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదురుకున్నారట. ఈ డ్రగ్ తీసుకోగానే ముందుగా తలనొప్పి బాగా వస్తుందట, అంతకు మించి ప్రాణాంతక సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి రాలేదని చెప్తున్నారు పరిశోధకులు, ఈ డ్రగ్ ని ఉపయాగించడం ద్వారా టౌ ప్రోటీన్ తీవ్రతని శరీరం ని 50 శాతం కి పైగా తగ్గించారట,ఈ డ్రగ్ పై మరింత పరిశోధనలు జరిపి ఇంకా మెరుగ్గా ఉండేలాగా చూస్తామని, కచ్చితంగా ఈ డ్రగ్ మెడికల్ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తుందని చెప్పుకొచ్చారు. ఈ డ్రగ్ వాడకంలోకి వస్తే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబీకులు కూడా హాయిగా ఊపిరి తీసుకోవచ్చు.