యాపిల్ ఈవెంట్: రిలీజ్ కాబోయేవి ఇవే…

యాపిల్.. యాపిల్… యాపిల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ యాపిల్ అన్న పేరు మార్మోగుతూ ఉంది. కారణం యాపిల్ సంస్థ నిర్వహించే వండర్ లస్ట్ ఈవెంట్. ఈ ఈవెంట్ కోసం అంతా సిద్ధమైంది. రోజు ఎన్నో ఈవెంట్ లు జరుగుతాయి ఇందులో అంత స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా.. ఈ ఈవెంట్ చాలా స్పెషల్. మార్కెట్లో యాపిల్ ఫోన్లకు రేట్ ఎక్కువ. అయినా కానీ చాలా మంది ఈ యాపిల్ ఫోన్లను దక్కించుకుంటారు. అప్పు చేసైనా సరే యాపిల్ […]

Share:

యాపిల్.. యాపిల్… యాపిల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ యాపిల్ అన్న పేరు మార్మోగుతూ ఉంది. కారణం యాపిల్ సంస్థ నిర్వహించే వండర్ లస్ట్ ఈవెంట్. ఈ ఈవెంట్ కోసం అంతా సిద్ధమైంది. రోజు ఎన్నో ఈవెంట్ లు జరుగుతాయి ఇందులో అంత స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా.. ఈ ఈవెంట్ చాలా స్పెషల్. మార్కెట్లో యాపిల్ ఫోన్లకు రేట్ ఎక్కువ. అయినా కానీ చాలా మంది ఈ యాపిల్ ఫోన్లను దక్కించుకుంటారు. అప్పు చేసైనా సరే యాపిల్ ఫోన్లను దక్కించుకోవాలని చూస్తారు. అటువంటి యాపిల్ ఫోన్స్ నుంచి కొత్త మోడల్స్ విడుదలయ్యే వండర్ లస్ట్ ఈవెంట్ కోసం టెక్ ప్రియులే కాకుండా సాధారణ ప్రజలు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 

ఇదే ఆనవాయితీ

యాపిల్ కంపెనీ ఏళ్లుగా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ లోనే కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. కేవలం కొత్త ఐఫోన్స్ అని మాత్రమే కాదు.. కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే ఏ గ్యాడ్జెట్ అయినా సరే సెప్టెంబర్ లోనే కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటుంది. అందుకోసమే టెక్ లవర్స్ సెప్టెంబర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఈ ఫోన్లు అలా మార్కెట్లోకి రిలీజ్ అవ్వడంతోనే వాటిని దక్కించుకునేందుకు టెక్ ప్రియులు పోటీ పడుతుంటారు. అందుకే యాపిల్ ఫోన్లకు అంత డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా యాపిల్ తన ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు వండర్ లస్ట్ అనే ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కోసం సర్వం సిద్ధం చేసింది. ఈ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9 మరియు USB-C ఛార్జింగ్ కేస్‌తో కూడిన యాపిల్ వాచ్ అల్ట్రా 2 మరియు కొత్త ఎయిర్ పాడ్స్ వంటి ఆసక్తికర గ్యాడ్జెట్లను ప్రవేశపెడతారని టెక్ లవర్స్ భావిస్తున్నారు. 

మళ్లీ నాలుగు మోడల్స్ 

పోయిన సంవత్సరం రిలీజ్ చేసి యాపిల్ 14 మోడల్ లో నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టారు. ఈ సారి జరిగే ఈవెంట్ లో యాపిల్ ఫోన్ 15ను లాంచ్ చేస్తారని ఎప్పటి నుంచో అంటున్నారు. అదీ కాకుండా ఈ సారి కూడా నాలుగు మోడల్స్ నే రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోందట. ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను కంపెనీ రిలీజ్ చేయనుందని సమాచారం. అంతే కాకుండా కొత్త వాచ్ 9 సిరీస్ ను కూడా యాపిల్ లాంచ్ చేయనుందట. ఇక ఈ ఫోన్స్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం 14 ప్రో మరియు 14 ప్రో మ్యాక్స్ లో నాచ్ (డైనమిక్ ఐలాండ్) ఫీచర్ ను ఇచ్చిన కంపెనీ ఈ సారి మాత్రం 15 నుంచే ఆ ఫీచర్ ను ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇవి టైటానియం ఫ్రేమ్ తో ఉంటాయని తెలుస్తోంది. 

అందుకోసం ఈ కొత్త మోడల్స్ కు పాత మోడల్స్ కంటే ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక స్క్రీన్ సైజ్ విషయంలో కంపెనీ ఎటువంటి మార్పులను పెద్దగా చేయలేదని టాక్. యాపిల్ అంటేనే కొత్త డిజైన్లకు పెట్టింది పేరు. ఈ ఈవెంట్ లో లాంచ్ చేసే ఫోన్ల డిజైన్ కూడా వెరైటీగా ఉండనుందని సమాచారం. అంతే కాకుండా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ కానున్నాయట. అందుకోసం యాపిల్ ఇప్పటికే అన్నీ సిద్ధం కూడా చేసింది. ప్రపంచంలోని కంపెనీల్లో అత్యంత విలువ కలిగిన కంపెనీగా యాపిల్ కంపెనీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక 14 ప్రో తో పోల్చుకుంటే 15 ప్రో లో కెమెరా పనితనం ఇంప్రూవ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఇందులో వాడినట్లు సమాచారం.