కర్ణాటక రాష్ట్రంలో రూ.8వేల కోట్ల విలువైన ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ ఏర్పాటు..

ఐఫోన్ తయారీదారు యాపిల్‌కు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ఫాక్స్‌కాన్‌కి ఎయిర్‌పాడ్‌లను తయారు చేయడానికి భారీ ఆర్డర్‌ వచ్చిందని ఒక నివేదిక ద్వారా తెలిసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను తయారుచేయడానికి ఫాక్స్‌కాన్‌ భారతదేశంలో ప్లాంట్ నిర్మించాలని యోచిస్తోంది కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ఐఫోన్‌తో సహా చాలా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను తయారు చేసే తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌ రూ.8000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది. అయితే ఇంత పెద్ద కంపెనీ మన ఇండియాకి రావడానికి అసలు కారణం అమెరికా, చైనాల మధ్య […]

Share:

ఐఫోన్ తయారీదారు యాపిల్‌కు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ఫాక్స్‌కాన్‌కి ఎయిర్‌పాడ్‌లను తయారు చేయడానికి భారీ ఆర్డర్‌ వచ్చిందని ఒక నివేదిక ద్వారా తెలిసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను తయారుచేయడానికి ఫాక్స్‌కాన్‌ భారతదేశంలో ప్లాంట్ నిర్మించాలని యోచిస్తోంది

కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ఐఫోన్‌తో సహా చాలా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను తయారు చేసే తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌ రూ.8000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది. అయితే ఇంత పెద్ద కంపెనీ మన ఇండియాకి రావడానికి అసలు కారణం అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత అని చెప్పవచ్చు. ఈ రెండు దేశాల మధ్య నల్గొండ వివాదాల వల్ల భారతదేశం ఇప్పుడు బాగా లాభపడుతుంది.. ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి ఉత్పత్తి ఇప్పుడు మరింత పెరగబోతుంది. యాపిల్ ఐఫోన్ల తయారీకి భారత్‌లోనే మరో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉండడం హర్షణీయమని చెప్పాలి.

రైటర్స్ నివేదిక ప్రకారం.. 

యాపిల్ కోసం ఐఫోన్ సహా చాలా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను తయారు చేసే తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌ కర్ణాటకలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ 967.91 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఫాక్స్‌కాన్‌ కొత్త పెట్టుబడిని కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిందని తెలుస్తోంది. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ ద్వారా సుమారుగా 50వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే తైవాన్ కంపెనీ చాలాకాలంగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కానీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సరైన ఏర్పాట్లు జరగలేదు.

మేడ్ ఇన్ ఇండియా ఫోన్.. 

ఈ పెట్టుబడికి సంబంధించి కంపెనీ వైపు నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.. బెంగళూరు విమానాశ్రయానికి దగ్గర లో ఈ ఫాక్స్‌కాన్‌ సంస్థను 300 ఎకరాలలో ఏర్పాటు చేయబోతున్నట్లు గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఫాక్స్‌కాన్‌ గ్రూప్‌లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్‌ తరపున మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయబోతుందట. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే.. హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ ఈ ఫాక్స్‌కాన్‌ ప్లాంటును ప్రధానంగా ఆపిల్ ఐఫోన్‌లను కర్ణాటక ప్లాంట్ లో తయారు చేయడానికి ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ వాహనాలు ..

ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి కూడా ఈ ప్లాంట్‌ను ఫాక్స్‌కాన్‌ ఉపయోగించుకోబోతోందట. అలాగే ఆపిల్ ఏర్పాట్లను కూడా ఈ కంపెనీ రూపొందించవచ్చని వైర్‌లెస్ ఇయర్ ఫోన్లోని కూడా తయారు చేయడానికి ఆపిల్ నుంచి ఆర్డర్ పొందిందని సమాచారం. తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌ ప్రస్తుతం చైనాలోని జెంగ్ జౌ నగరంలో ఉన్న ప్లాంట్లో ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తోంది. అయితే గతంలో కూడా భారతదేశంలో ఐఫోన్ తయారీని మొదలుపెట్టింది కానీ.. కోవిడ్ సమయంలో చైనాలో ఈ ఉత్పత్తి ఆగిపోయింది. మరోవైపు అమెరికా చైనా మధ్య ఉద్రిక్తత కూడా పెరిగిపోతుంది. అందుకే అంతర్జాతీయ కంపెనీలు కూడా చైనా వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. చైనా వ్యూహం అంటే ఉన్నచోటే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా ప్లాంట్లను ఏర్పాటు చేసి లాభం పొందడం. అందుకే చైనాకు బదులుగా భారత్‌ను ఎంపిక చేసిందని తెలుస్తోంది. ఇక 2027 నాటికి భారత దేశంలోనే ఐఫోన్లను అసెంబుల్ చేయాలని నిర్ణయించుకుందట.