ఎలాన్ మ‌స్క్ తోచింది చేసేస్తాడు

ఇప్పటి వరకు ట్విట్టర్ లో వచ్చిన అనేకమైన మార్పులు చూసిన తర్వాత, ట్విట్టర్ లో పని చేసిన మాజీ ఎంప్లాయ్, మస్క్ గురించి కొన్ని సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా ట్విట్టర్ లోగో మార్చిన దాని గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. ట్విట్టర్, ఎలన్ మస్క్ ప్రవర్తన గురించి, తాను తీసుకునే నిర్ణయాల గురించి నోరు విప్పారు ట్విట్టర్ మాజీ ఎంప్లాయ్.  ఆ పోస్టులో ఏముంది:  అందులో పని చేసిన మాజీ ఎంప్లాయ్, మస్క్ గురించి కొన్ని […]

Share:

ఇప్పటి వరకు ట్విట్టర్ లో వచ్చిన అనేకమైన మార్పులు చూసిన తర్వాత, ట్విట్టర్ లో పని చేసిన మాజీ ఎంప్లాయ్, మస్క్ గురించి కొన్ని సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా ట్విట్టర్ లోగో మార్చిన దాని గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. ట్విట్టర్, ఎలన్ మస్క్ ప్రవర్తన గురించి, తాను తీసుకునే నిర్ణయాల గురించి నోరు విప్పారు ట్విట్టర్ మాజీ ఎంప్లాయ్. 

ఆ పోస్టులో ఏముంది: 

అందులో పని చేసిన మాజీ ఎంప్లాయ్, మస్క్ గురించి కొన్ని సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా ట్విట్టర్ లోగో మార్చిన దాని గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, ఎలన్ మస్క్ ప్రవర్తన గురించి, తాను తీసుకునే నిర్ణయాల గురించి నోరు విప్పారు ట్విట్టర్ మాజీ ఎంప్లాయ్. ఎలన్ మస్క్ నిజానికి ఫన్నీగా కనిపించే వ్యక్తి అని, తను ఎల్లప్పుడూ మంచి ఫ్యాషన్ తో కనిపించే ఒక వ్యక్తి అని, అంతేకాకుండా ఎలన్ మస్క్కి ఎగ్జాక్ట్మేంట్తో కూడిన పనులను చేయించుకోవడానికి వెంటనే తను డబ్బును వాడేందుకు అసలు వెనకాడని వ్యక్తి అని, మాజీ ట్విట్టర్ ఎంప్లాయ్ క్రాఫోర్డ్ పేర్కొన్నారు. 

ముఖ్యంగా ట్విట్టర్ ఎంప్లాయిలు ఆయనని చూసి భయపడడానికి కారణం ఆయనతో జరిగే మీటింగ్స్ అలాగే నెగిటివ్ న్యూస్ డెలివరీ చేయాల్సిన అంశాల విషయంలోనే జరుగుతుందని, క్రాఫోర్డ్ చెప్పుకొచ్చారు. మస్క్ తీసుకునే నిర్ణయాలు వెంట వెంటనే ఉంటాయని, అంతేకాకుండా ప్రోడక్ట్ అలాగే బిజినెస్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు డేటా కి సంబంధించి, అలాగే ఎక్స్పర్ట్స్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు సేకరించేవాడు కాదు అని, తనకి నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునే వాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా, కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కంపెనీ ఎంప్లాయిస్ కంటే ముఖ్యంగా ఫీడ్బ్యాక్ బట్టి, ట్విట్టర్ పోల్స్ బట్టి, మస్క్ నిర్ణయాలు తీసుకునేవాడని, అతను కొన్ని వివరించడంలో, అలాగే పాషినేట్ తో ఉండడం ముందు ఉంటాడు కానీ, సానుభూతిలో ఎప్పుడు వెనకే ఉంటాడని మాజీ ఎంప్లాయ్ చెప్పారు. 

ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ముందు ఉండే మస్క్, సోషల్ నెట్వర్కింగ్ లో ముఖ్యంగా ఎమోషనల్ ఇంటిలిజెన్స్ వాడాలనేది మర్చిపోయారని మాజీ ఎంప్లాయ్ మస్క్ గురించి ఆయన తీసుకునే నిర్ణయాలు గురించి మాట్లాడారు. 

ఇటీవల ట్విట్టర్ లోగో మార్పు: 

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలోన్ మస్క్. అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్. 

గత సంవత్సరం ట్విట్టర్ యజమానిగా మస్క్ మారినప్పటి నుంచి, ఆయన ట్విట్టర్ ఆప్ లో తీసుకువచ్చిన మార్పులలో ఇదే చాలా పెద్ద మార్పు అని అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న లిండ యాకరినో తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను కంపెనీలో లోగో X ట్విట్టర్ ఆప్ లో స్థానాన్ని పొందుకునేందుకు ఆమె హస్తం ఎంతో ఉన్నట్లు చెప్పాడు మస్క్. అంతేకాకుండా తన ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ ఆప్ ని ఒక ప్రత్యేకమైన సూపర్ ఆప్ గా చేయాలని అంతేకాకుండా చైనాలో ప్రావీణ్యం పొందిన ‘wechat’ మాదిరిగ మార్చాలనేదే తన నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకొచ్చాడు మస్క్.