మొదటి మొబైల్ కాల్‌ మాట్లాడి 50 ఏళ్లు గడిచింది..

 మాట్లాడింది.. తయారు చేసింది ఎవరు.. ఇంకా మరెన్నో విశేషాలు..  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు అది అందించే అనేక రకాల ఫీచర్స్, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు. మొబైల్ ఫోన్లు మన జీవితాలను వీలైనంత సౌకర్యవంతంగా మార్చేయి.. ఏప్రిల్ 3, 1973 చరిత్రలో ఓ మరిచిపోలేని రోజుగా నిలిచింది.. ఎందుకంటే ఈరోజునే మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు టెలిఫోన్ పరిచయమైన చాలా రోజుల తరువాత మొట్టమొదటి హ్యాండ్ హోల్డ్ […]

Share:

 మాట్లాడింది.. తయారు చేసింది ఎవరు.. ఇంకా మరెన్నో విశేషాలు.. 

ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు అది అందించే అనేక రకాల ఫీచర్స్, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు. మొబైల్ ఫోన్లు మన జీవితాలను వీలైనంత సౌకర్యవంతంగా మార్చేయి.. ఏప్రిల్ 3, 1973 చరిత్రలో ఓ మరిచిపోలేని రోజుగా నిలిచింది.. ఎందుకంటే ఈరోజునే మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు టెలిఫోన్ పరిచయమైన చాలా రోజుల తరువాత మొట్టమొదటి హ్యాండ్ హోల్డ్ మొబైల్ సెల్ ఫోన్ను మోటరోలా లో అమెరికన్ ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ తయారు చేశారు.. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు తన మొబైల్ నుంచి మొదటిసారి కాల్ చేశారు..

మొదటి కాల్ అతనితోనే..

మొట్టమొదట సెల్‌ఫోన్ నుంచి తొలి ఫోన్ కాల్ ఏప్రిల్ 3 నాటికి 50 ఏళ్లు అవుతుంది. అంటే 1973 ఏప్రిల్ 3న మొబైల్ తొలి ఫోన్ కాల్ వెళ్ళింది. న్యూ జెర్సీలోని బెల్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్ కు కూపర్ కాల్ చేసి మాట్లాడాడు.  పనిచేసిన తన పోటీదారుడు జోయల్ ఏంజెల్‌కు ఆయన కాల్ చేశారు.. 21/2 పౌండ్ ప్రోటో టైపును తన చెవి దగ్గర పెట్టుకొని మోటరోలా టీం ఫంక్షనల్ పోర్టబుల్ ఫోన్ కనిపెట్టిందని సంతోషంతో చెప్పాడు.. 

100 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. 

ప్రోటో టైప్ డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవర్ సాయంతో తొలి వైర్‌లెస్ ఫోన్ కాల్ చేశారు. ఆ తర్వాత కమర్షియల్‌గా రిలీజ్ చేసిన మొదటి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. 1973లో కాల్ చేసినప్పటికీ ఫోన్ అసలు నమూనా విడుదల చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది.  1973 లో వైర్లెస్ సెల్ఫోన్ ఒక కిలో బరువు ఉండేది.. 22.86 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12.7 సెంటీమీటర్ల పరిమాణం 4.44 వెడల్పు ఉండేది కోపర్ మొబైల్ ఫోన్ కాల్ స్టెప్ రేడియో టెలిగ్రాఫ్ సిస్టం కోసం 1973 నుంచి 1993 మధ్యకాలంలో మోటరోలా కంపెనీ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 1980లో పర్సనల్ సెల్యూలర్ ఫోన్లకు సంబంధించి ప్రమోషన్ వీడియోలను రిలీజ్ చేసినట్లు ఈడిఎన్ నెట్వర్క్ తెలిపింది. 

1973 ఏప్రిల్‌ 3న సెల్‌ఫోన్‌ నుంచి మొదటి ఫోన్‌ కాల్‌ చేశారు దాని సృష్టికర్త మార్టిన్‌ కూపర్‌. ఆయన అప్పట్లో మోటొరోలా సంస్థలో పని చేసేవారు. న్యూయార్క్‌లోని సిక్త్స్‌ అవెన్యూ 53వ, 54వ వీధుల మధ్య నడుస్తూ సెల్‌ఫోన్‌ నుంచి ఆయన మొదటి ఫోన్‌ కాల్‌ మాట్లాడారు. మోటొరోలాకు ప్రత్యర్థి సంస్థ అయిన బెల్‌ ల్యాబొరేటరీస్‌‌కు చెందిన ఇంజినీర్‌ జోయెల్‌ ఏంజెల్‌కు కూపర్‌‌కు ఫోన్‌ చేయడం విశేషం. ‘జోయెల్‌.. నేను మార్టిన్‌. నేను సెల్‌‌ఫోన్‌ నుంచి మాట్లాడుతున్నాను. చేతుల్లో పట్టుకోదగిన నిజమైన పోర్టబుల్‌ సెల్‌ఫోన్‌ ఇది’ అంటూ మార్టిన్‌ సంభాషణ సాగింది.

మొదటి సెల్‌ఫోన్‌ గురించి ఆసక్తికర విశేషాలు..

  • మొదటి సెల్‌ఫోన్‌ పేరు డైనాటాక్‌ ఇది దాదాపుగా చెప్పుల డబ్బా అంత పెద్దగా ఉండేది. కిలో బరువు ఉండేది.
  • 25 నిమిషాలు ఫోన్‌ మాట్లాడేందుకు 10 గంటలు ఛార్జింగ్‌ పెట్టవలసివచ్చేది.
  • ఈ ఫోన్ కనిపెట్టిన పదేండ్లకు డైనాటాక్‌ 8000ఎక్స్‌ పేరిట అమెరికాలో మోటొరోలా సంస్థ ఈ ఫోన్‌ను విక్రయించడం మొదలుపెట్టింది.
  • దీనిని మొదటిసారిగా 1983లో 3,995 డాలర్లకు విక్రయించారు. మన కరెన్సీలో ప్రస్తుత విలువ ప్రకారం దీని ధర రూ.3.28 లక్షలు.