Meta లాంచ్ చేసిన Llama 2

మెటా (Meta) మంగళవారం లామా 2 (Llama 2)ని ప్రారంభించింది, ఇది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) నెక్స్ట్ జనరేషన్. మార్క్ జుకర్‌బర్గ్-హెల్మెడ్ కంపెనీ Llama 2ని ప్రస్తుతం రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు చాట్ జిపిటికి ఇది గొప్ప పోటీగా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు.  లామా 2 (Llama 2) అంటే ఏమిటి?:  మెటా కి సంబంధించిన ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పుడు Llama 2 లాంచ్ అయింది. అయితే ఇది నిజానికి చెప్పాలంటే అత్యాధునిక […]

Share:

మెటా (Meta) మంగళవారం లామా 2 (Llama 2)ని ప్రారంభించింది, ఇది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) నెక్స్ట్ జనరేషన్. మార్క్ జుకర్‌బర్గ్-హెల్మెడ్ కంపెనీ Llama 2ని ప్రస్తుతం రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు చాట్ జిపిటికి ఇది గొప్ప పోటీగా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు. 

లామా 2 (Llama 2) అంటే ఏమిటి?: 

మెటా కి సంబంధించిన ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పుడు Llama 2 లాంచ్ అయింది. అయితే ఇది నిజానికి చెప్పాలంటే అత్యాధునిక ఓపెన్-యాక్సెస్ లాంగ్వేజ్ మోడల్‌ళ్ల క్యాటగిరిలోకి వస్తుంది.

లామా 2 (Llama 2) ప్రత్యేకతలు: 

మెటా ప్రకారం, Llama 2 దాని కన్నా ముందు వచ్చినా లామా 1 కంటే 40% ఎక్కువ డేటాతో వచ్చేసింది. అంతే కాకుండా, ఇది మనం ఇచ్చే కాంటాక్ట్స్ లెంత్ కూడా పెంచేసింది, అంటే డబల్ లెన్త్ తీసుకుంటుంది. ప్రస్తుతం వచ్చిన మోడల్ మూడు క్లాసిఫికేషన్స్లో  అందుబాటులో ఉంది: 7B, 13B అలాగే 70B.

ఫేస్బుక్ మదర్ కంపెనీ మెటా లాంచ్ చేసిన Llama 2, ప్రస్తుతం మరికొన్ని వర్షన్స్ లో అందుబాటులో ఉండే రీజనింగ్, కోడింగ్, ప్రొఫిషియన్సీ మరియు నాలెడ్జ్ టెస్ట్‌లతో సహా మరిన్ని కేటగిరిలో ఒక మెట్టు పైనే ఉందని చెప్తున్నారు.

పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ డేటా సోర్సెస్ మీద లామా-2-చాట్కి పూర్తి అవగాహన ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఇది అందుబాటులోకి వచ్చిన బెస్ట్ మోడల్. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఇన్‌స్ట్రక్షన్ డేటాసెట్‌ల మీద అంతే కాకుండా, 1 మిలియన్ కంటే ఎక్కువ ఎనోటేషన్స్ మీద ప్రీ ట్రైనింగ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. 

లామా 2కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్ట్నర్స్: 

మైక్రోసాఫ్ట్ (Micosoft) , అమెజాన్ (Amazon Web Services) (AWS), IBM,స్ఫోటిఫ్య్ (Spotify), షాపిపై(Shopify), Jio, క్వాల్కం (Qualcomm), Nvidia, Accenture, Zoom, T- వంటి కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మొబైల్ కంపెనీలు ఈ Llama 2 ప్రాజెక్ట్కు ఉత్తమ మద్దతును అందించారు. Azure AI మోడల్ కేటలాగ్‌లో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా చక్కగా పనిచేస్తుంది. 

మైక్రోసాఫ్ట్‌ను మెటా పార్ట్నర్ అని తెలిసిందే, మైక్రోసాఫ్ట్కి ఎప్పటినుంచో గట్టి పోటీ ఇస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా, అలాగే AI స్టార్టప్ హగ్గింగ్ ఫేస్, అంతే కాకుండా మరెన్నో సర్వీసెస్ ద్వారా కూడా మోడల్‌లు అందుబాటులో ఉంటాయని మెటా తెలిపింది. మైక్రోసాఫ్ట్ కూడా చాట్‌జిపిటి-OpenAIకి ప్రైమరీ పార్ట్నర్.

గట్టి పోటీ ఇవ్వనుంది: 

అయితే ప్రస్తుతం OpenAI ChatGPT అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం కొంతవరకు మాత్రమే స్పష్టమైన ఆక్యురసీ అందుబాటులో ఉందని, అయితే ఇప్పుడు మెటా ద్వారా అందుబాటులోకి వచ్చిన Llama 2, ప్రస్తుతం అందుబాటులో ఉన్న OpenAI ChatGPTకి గట్టి పోటీ ఇస్తూ మంచి పనితనం చూపిస్తూ మన పనిని 100% ఆక్యురసీతో పూర్తి చేయగలదు అంటున్నారు మెటా అధినేతలు. 

అయితే ఇంతకుముందు మెటా, పెద్ద పెద్ద బుక్స్, న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని రైటింగ్స్ అనేవి డిజిటైజ్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మోడల్ దానికన్నా తక్కువ పనితీరును చూపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.