Elon Musk: మరో క్రేజీ ఆఫర్ ఇచ్చిన మస్క్ మామ..

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చాలా మందికే మస్క్ (Elon Musk)  సుపరిచితుడు. ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ ను కొన్న నాటి నుంచి మస్క్ (Elon Musk)  పేరు మరింతగా మార్మోగిపోయింది. అంతకు ముందు టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలను ఆపరేట్ చేసినపుడైనా పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఎప్పుడైతే ట్విటర్ ను కొనుగోలు చేశాడో అప్పటి నుంచి మస్క్ (Elon Musk)  […]

Share:

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చాలా మందికే మస్క్ (Elon Musk)  సుపరిచితుడు. ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ ను కొన్న నాటి నుంచి మస్క్ (Elon Musk)  పేరు మరింతగా మార్మోగిపోయింది. అంతకు ముందు టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలను ఆపరేట్ చేసినపుడైనా పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఎప్పుడైతే ట్విటర్ ను కొనుగోలు చేశాడో అప్పటి నుంచి మస్క్ (Elon Musk)  క్రేజ్ మాములుగా ఉండడం లేదు. ప్రస్తుతం మస్క్ (Elon Musk)  వార్తల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఏంటి అతడు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నాడు. కొన్ని సార్లు కొన్ని రకాల కొత్త నిర్ణయాలతో వార్తల్లో ఉండే మస్క్ (Elon Musk)  ఈ సారి మాత్రం తన విచిత్ర ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ట్విటర్ లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్  (Elon Musk) కంపెనీ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. అనేక మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్ కొత్త కొత్త నిర్ణయాలతో యూజర్లను మాత్రమే కాకుండా అందులో పని చేసే ఉద్యోగులను కూడా  ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అటువంటి మస్క్ తాజాగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అయింది. 

వికీపీడియాపై మస్క్ కన్ను.. 

మనకు ఎటువంటి సమాచారం అయినా ఉచితంగా అందించే వికీపీడియా (Wikipedia) గురించి అందరికీ తెలిసిందే. అటువంటి వికీపీడియా (Wikipedia) మీద మస్క్ (Elon Musk)  ఈ సారి సెటైర్ వేశారు. దానిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వికీపీడియా (Wikipedia) పేరు మార్చుకుంటే 1 బిలియన్ అమెరికా డాలర్లు ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు. అంతే కాకుండా వారు ఏం పేరు పెట్టుకోవాలో కూడా అతడే సూచించడం గమనార్హం. ఈ ట్వీట్ (Tweet) ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొంత మంది మస్క్ (Elon Musk)  చెప్పిన దానితో ఏకీభవించగా.. కొంత మంది మాత్రం మస్క్ చెప్పిన దానిని వ్యతిరేఖిస్తున్నారు. ఇలా బయటి కంపెనీల గురించి చులకనగా మాట్లాడడం మానుకోవాలని ఎలాన్ మస్క్ (Elon Musk)  కు హితవు పలుకుతున్నారు. 

మస్క్ సూచించిన పేరు ఇదే.. 

ఎలాన్ మస్క్ (Elon Musk)  ఒక పేరు సూచించాడంటే అది ఏం పేరు అయి ఉంటుందా అని అంతా ఆరాలు తీయడం కామన్. మస్క్ (Elon Musk)  అంటే క్రేజ్ అలా ఉంటుంది మరి.. ట్విటర్ ను కొన్న దగ్గరి నుంచి మస్క్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వికీపీడియా పేరు మార్చమని అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై మస్క్ స్పందించాడు. వికీపీడియా (Wikipedia) హోం పేజ్ కు యాడ్ చేయాల్సిందిగా ఆవు బొమ్మ, పూఫ్ (మలం) ట్వీట్ చేశాడు. 

అసలు డబ్బులు ఎందుకు?

ఎలాన్ మస్క్ (Elon Musk)  బంపరాఫర్ ఇచ్చారు. అది కాకుండా ఒక ప్రశ్నను కూడా సంధించాడు. అసలు వికీపీడియా (Wikipedia) కు డబ్బులు ఎందుకని అన్నాడు. వికీపీడియా యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. దానిపై మస్క్ (Elon Musk) సెటైరికల్ గా ట్వీట్ చేశారు. అసలు వికీపీడియా (Wikipedia) డబ్బులు ఎందుకు వసూలు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. వికీపీడియాను ఆపరేట్ చేసేందుకు ఇది ఖచ్చితంగా అవసరం లేదని పేర్కొన్నారు. మీరు మీ ఫోన్‌ లో కూడా టెక్ట్స్ ను రాయొచ్చు అని అన్నారు. అటువంటపుడు డబ్బులు ఎందుకివ్వాలని ట్వీట్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఎంతో కొంత మొత్తం డొనేట్ చేయమని వికీపీడియా యూజర్లను అడుగుతోంది. దీనిపై మస్క్ స్పందించారు. ఇలా వికీపీడియా డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై యూజర్లు స్పందిస్తూ వారు విరాళాలు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కొనుగోలు చేయండి.. 

ఇలా వికీపీడియా గురించి వచ్చినపుడు దానిని కొనుగోలు చేయమని కొంత మంది మస్క్ (Elon Musk) ను అభ్యర్థించారు. దానిని కొనుగోలు చేసి ఒక ఏఐని పెట్టండి అని తెలిపారు. మస్క్ ఇలా వికీపీడియా (Wikipedia) మీద కాన్సంట్రేట్ చేయడంతో అతడు వికీపీడియా (Wikipedia)ను కొనుగోలు చేస్తాడా అని అంతా చర్చించుకుంటున్నారు. ట్విటర్ ను కొనుగోలు చేసే ముందు కూడా మస్క్ (Elon Musk) ట్విటర్ గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తారని గుర్తు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఏదో జరగబోతోందని కామెంట్లు చేస్తున్నారు.