ట్విట్టర్‌‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో షాకింగ్‌ నిర్ణయం

 ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విట్టర్‌‌ను కొన్న తర్వాత అందులో పనిచేసే ఉద్యోగులను తీసేయడం మొదలు.. ట్విట్టర్ పేరు మార్పు వరకు మస్క్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారింది. ట్విట్టర్‌‌ను మస్క్‌ హ్యాండ్‌ ఓవర్‌‌లోకి వచ్చాక ఆ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌లో చాలా మార్పులు చేశారు. మొదట ట్విట్టర్‌‌ పాత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను తీసివేయం, తర్వాత ఖర్చు పేరుతో ఉద్యోగులను ఒక్క ఈ మెయిల్‌తో ఇంటికి […]

Share:

 ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విట్టర్‌‌ను కొన్న తర్వాత అందులో పనిచేసే ఉద్యోగులను తీసేయడం మొదలు.. ట్విట్టర్ పేరు మార్పు వరకు మస్క్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారింది. ట్విట్టర్‌‌ను మస్క్‌ హ్యాండ్‌ ఓవర్‌‌లోకి వచ్చాక ఆ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌లో చాలా మార్పులు చేశారు. మొదట ట్విట్టర్‌‌ పాత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను తీసివేయం, తర్వాత ఖర్చు పేరుతో ఉద్యోగులను ఒక్క ఈ మెయిల్‌తో ఇంటికి పంపించడం.. లాంటి నిర్ణయాలు ఆయనకు బ్యాడ్‌ నేమ్‌ తెచ్చిపెట్టాయి. అలాగే, బ్లూ టిక్‌ పొందాలంటే డబ్బులు కట్టాలని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నాడు. ట్విట్టర్‌‌ పిట్ట లోగో తీసేసి కుక్క బొమ్మ పెట్టడం, సెక్యూరిటీ  రీజన్స్ పేరుతో కొన్ని వేల అకౌంట్లను తొలగించడం లాంటి నిర్ణయాలపై కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. ఎవరూ ఏమీ చెప్పినా వినకపోవడం మస్క్‌ నైజం. తను అనుకున్నదే కచ్చితంగా చేసి తీరుతాడని ట్విట్టర్‌‌లో చేసిన మార్పులే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ట్విట్టర్‌‌ లోగోను, పేరును మారుస్తారనే ప్రచారం కూడా అప్పట్లో బాగా జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే ట్విట్టర్‌‌ పేరు ‘ఎక్స్‌’ గా మార్చి, అదే అక్షరంతో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో లోగోను తీసుకొచ్చారు. ‘ఎక్స్’ అనే అక్షరం మస్క్‌ చాలా ఇష్టమని, అందుకే ట్విట్టర్‌‌కు ఆయన ఈ పేరు పెట్టాడని తెలిసింది. 

ట్విట్టర్‌‌ పేరు మార్పు, లోగో మార్పు తర్వాత కూడా అందులో ఇప్పటికీ ఇంకా  చాలా చేంజెస్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘ఎక్స్‌’ అని పిలువబడే ట్విట్టర్‌‌లో ‘బ్లాక్‌’ చేసే ఫీచర్‌‌ను డీలిట్‌ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించి, యూజర్లకు షాక్‌ ఇచ్చారు. ఈ ఆప్షన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌‌లో ఆయన పేర్కొన్నారు. ఓ యూజర్‌‌ బ్లాక్‌ ఫీచర్‌‌ గురించి అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బ్లాక్‌ ఫీచర్‌‌తో పెద్దగా అవసరం  లేదని, అందుకే దీనిని దీనిని  త్వరలో తొలగిస్తామని తెలిపారు. 

ఆన్‌లైన్ వేధింపులు పెరుగుతాయ్‌..

భద్రతాపరమైన ఫీచర్లలో ముఖ్యమైన బ్లాక్‌ ఫీచర్‌‌ను తొలగించడం వల్ల ఆన్‌లైన్‌లో వేధింపులు పెరిగే అవకాశం ఉందని యూజర్లు వాపోతున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్‌‌)లో ఇకపై బ్లాక్‌ ఫీచర్‌‌కు బదులుగా మ్యూట్‌ ఫీచర్‌‌ని వినియోగించవచ్చని మస్క్‌ పేర్కొన్నారు. మనం ఏదైనా ట్విట్టర్‌‌ అకౌంట్‌ను మ్యూట్‌ చేస్తే ఆ అకౌంట్‌ హోల్డర్‌‌ చేసే పోస్టుల్ని మనం వీక్షించకుండా ఉండేందుకు వీలుంటుంది. అయితే, మనం చేసే పోస్టులను మ్యూట్‌  చేసిన వ్యక్తి చూసే అవకాశం ఉంటుంది. ఆ పోస్టులను అతను తన ఫాలోవర్లకు రీపోస్ట్‌ కూడా చేయొచ్చు. ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్లకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని యూజర్లు మండిపడుతున్నారు. 

ట్విట్టర్‌‌ మాజీ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే.. మస్క్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు. 100 శాతం ఇది మ్యూట్‌ మాత్రమేనని ట్వీట్‌ చేశారు. కాగా, మ్యూట్‌ ఆప్షన్‌ ప్రస్తుతం అకౌంట్‌ పోస్ట్లుల నోటిఫికేషన్లను మాత్రమే సైలెంట్‌ చేస్తుంది. అయితే, మ్యూట్‌ చేసిన అకౌంట్ల పోస్టులు చూడొచ్చు. వాటిని రిప్లై కూడా ఇవ్వచ్చు.

‘‘మస్క్‌ పెద్ద పొరపాటు చేశారు” అని ఓ యూజర్‌‌ ట్విట్టర్‌‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, బ్లాక్‌ ఫీచర్‌‌ను తొలగించడం ‘వల్ల ఆపిల్‌ యాప్‌ స్టోర్‌‌, గూగుల్‌ ప్లే వంటి యాప్‌ స్టోర్లలో నిబంధనలు, షరతులను ఉల్లంఘించినట్లు అవుతుంది. వేధింపులు, బెదిరింపులను ఫిల్టర్‌‌ చేయడానికి సోషల్‌ మీడియా యాప్‌లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ట్విట్టర్‌‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది’  అని యూజర్లు అంటున్నారు.