త్వరలోనే ట్విట్టర్ లోగో, బ్రాండ్ మార్పులు: ఎలన్ మస్క్

ప్రస్తుతం ట్విట్టర్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ఏడాది ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, తన హయాంలో ట్విట్టర్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. ఇప్పుడు తాజాగా లోగో అలాగే బ్రాండ్లలో కూడా మార్పులు వస్తాయి అని ఆదివారం తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  ట్విట్టర్ లోగోకి బై:  సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు […]

Share:

ప్రస్తుతం ట్విట్టర్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ఏడాది ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, తన హయాంలో ట్విట్టర్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. ఇప్పుడు తాజాగా లోగో అలాగే బ్రాండ్లలో కూడా మార్పులు వస్తాయి అని ఆదివారం తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

ట్విట్టర్ లోగోకి బై: 

సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలోన్ మస్క్. అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్. 

గత సంవత్సరం ట్విట్టర్ యజమానిగా మస్క్ మారినప్పటి నుంచి, ఆయన ట్విట్టర్ ఆప్ లో తీసుకువచ్చిన మార్పులలో ఇదే చాలా పెద్ద మార్పు అని అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా ఉన్న లిండ యాకరినో తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తను కంపెనీలో లోగో X ట్విట్టర్ ఆప్ లో స్థానాన్ని పొందుకునేందుకు ఆమె హస్తం ఎంతో ఉన్నట్లు చెప్పాడు మస్క్. అంతేకాకుండా తన ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ ఆప్ ని ఒక ప్రత్యేకమైన సూపర్ ఆప్ గా చేయాలని అంతేకాకుండా చైనాలో ప్రావీణ్యం పొందిన ‘wechat’ మాదిరిగ మార్చాలనేదే తన నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకొచ్చాడు మస్క్.

ఎలన్ మస్క్ గురించి మరింత: 

బిజినెస్ మాగ్నెట్ ఎలన్ మస్క్, ఏప్రిల్ 14, 2022న అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ Twitter, Inc. కొనుగోలు చేయడం ప్రారంభించి, తర్వాత అది అక్టోబర్ 27, 2022న ముగిసింది. జనవరి 2022లో మస్క్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు, ఏప్రిల్ నాటికి ట్విట్టర్ యొక్క  9.1 శాతం యాజమాన్య వాటాతో దాని అతిపెద్ద భాగస్వామిగా ఎలన్ మాస్క్ మారిపోయాడు. సోషల్ మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న Twitter దాని డైరెక్టర్ల బోర్డులో చేరమని మస్క్‌ని ఆహ్వానించింది, ఈ ఆఫర్‌ని తను మొదట అంగీకరించాడు. ఏప్రిల్ 14న, మస్క్ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్‌ను ఇచ్చాడు, దీనికి ట్విట్టర్ బోర్డు ప్రారంభంలో ప్రతిస్పందిస్తూ ప్రతికూల భావంతో స్పందించింది, ఏప్రిల్ 25న మస్క్ చేసిన $44 బిలియన్ల కొనుగోలు ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించింది. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడానికి, దాని అల్గారిథమ్‌లను ఓపెన్-సోర్స్ చేయడానికి, స్పామ్ అకౌంట్స్ ఎదుర్కోవడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Twitter ప్రైవేటీకరణ చేయడమే కాకుండా, X Corp అనే కొత్త సంస్థలో విలీనం అయింది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ తక్షణమే మునుపటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను ఎవరూ ఊహించని విధంగా విధుల నుంచి తొలగించారు. మస్క్ ట్విట్టర్‌కు అనేక కొత్త మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించాడు మరియు కంపెనీలో సగం మందిని తొలగించాడు.”అత్యంత హార్డ్‌కోర్” పనికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో వందలాది మంది ఉద్యోగులు మానేసి కంపెనీకి రాజీనామా చేశారు.