ట్విట్టర్ యూజర్స్ కి చుక్కలు చూపిస్తున్న ఎలాన్ మస్క్..

ప్రస్తుతం మన డైలీ రొటీన్ జీవితం లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మన చేతి వేళ్ళు  ఆటోమేటిక్ గా ట్విట్టర్ యాప్ ని క్లిక్ చేస్తుంది. ఒక్కసారి ఈ యాప్ అలవాటు అయ్యిందంటే మాత్రం ఒక వ్యసనం అనే చెప్పాలి. ఈ ట్విట్టర్ యాప్ లో ఏ చిన్న వార్త వచ్చినా చాలు, నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. సినీ తారలు , క్రీడాకారులు, రాజకీయ నాయకులూ ఇలా ప్రతీ ఒక్కరూ […]

Share:

ప్రస్తుతం మన డైలీ రొటీన్ జీవితం లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మన చేతి వేళ్ళు  ఆటోమేటిక్ గా ట్విట్టర్ యాప్ ని క్లిక్ చేస్తుంది. ఒక్కసారి ఈ యాప్ అలవాటు అయ్యిందంటే మాత్రం ఒక వ్యసనం అనే చెప్పాలి. ఈ ట్విట్టర్ యాప్ లో ఏ చిన్న వార్త వచ్చినా చాలు, నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. సినీ తారలు , క్రీడాకారులు, రాజకీయ నాయకులూ ఇలా ప్రతీ ఒక్కరూ ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్నా లేకపోయినా, ట్విట్టర్ లో మాత్రం కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ట్విట్టర్ నుండి వచ్చే వార్తలే అధికారిక వార్తలు లెక్క పరిగణిస్తుంటుంది ఎలక్ట్రానిక్ మీడియా. ఒక్క మాటలో చెప్పాలంటే మనమంతా ట్విట్టర్ కి బాగా అడిక్ట్ అయిపోయాము. ప్రతీ పది నిమిషాలకు ట్విట్టర్ ని ఓపెన్ చెయ్యకుండా ఉండలేము.

సరికొత్త లిమిట్స్ :

అయితే ఎప్పుడైతే ఈ ట్విట్టర్ అప్లికేషన్ జాక్ నుండి ఎలాన్ మాస్క్ చేతుల్లోకి వెళ్లిందో, అప్పటి నుండి ట్విట్టర్ లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ట్విట్టర్ అకౌంట్గ్ బ్లూ టిక్ తో వెరిఫై అవ్వాలంటే కచ్చితంగా ప్రఖ్యాతి గాంచిన సెలబ్రిటీ అయ్యుండాలి. అప్పుడే ట్విట్టర్ సంస్థ బ్లూ వెరిఫైడ్ అకౌంట్ గా పరిగణిస్తుంది ట్విట్టర్. కానీ ఇప్పుడు చేతిలో వెయ్యి రూపాయిలు ఉంటే చాలు , ఒక నెల రోజుల పాటు బ్లూ టిక్ కి సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ రీసెంట్ గా ఆయన ట్విట్టర్ వినియోగదారులకు సరికొత్త నిబంధనలు పెట్టాడు. అదేమిటంటే బ్లూ టిక్ తో వెరిఫై అయిన అకౌంట్ రోజుకి పది వేల ట్వీట్స్ ని చూడొచ్చు అంట. అంతకు ముందు ఇలాంటి లిమిట్స్ ఏమి లేవు, రోజుకి ఎన్ని వేల ట్వీట్స్ ని అయినా చూసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా చేసాడు ఎలాన్ మస్క్.

ఈ లిమిట్స్ మొత్తం తాత్కాలికం మాత్రమే :

ప్రస్తుతానికి బ్లూ టిక్ తో వెరిఫై చేయించుకున్న యూజర్లకు రోజుకు 10 వేల ట్వీట్స్ ని చూసే అవకాశం కలిపించాడు, ముందు రోజు అయితే వెరిఫై యూజర్స్ కి 6000 ట్వీట్లు, నాన్ వెరిఫైడ్ యూజర్స్ కి 600 ట్వీట్లు అలాగే అప్పుడే ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేసిన ఖాతాదారులకు 300 ట్వీట్స్ ని మాత్రమే చూసే అవకాశం కలిపించాడు. ఎలాన్ మస్క్ కి ఎమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నాడు. ట్విట్టర్ సజావుగా నడవడం ఆయనకీ ఇష్టం లేదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. అయితే ఎలాన్ మాస్క్ అలా చెయ్యడానికి కారణం కూడా ఉందట. ఈమధ్య ట్విట్టర్ డేటా అత్యధికంగా చోరీకి గురి అవుతుందట. దానిని కంట్రోల్ చెయ్యడానికే  ఈ లిమిట్స్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే, ఎప్పుడైతే డేటా ని సేవ్ చేయగలము అనే నమ్మకం వస్తుందో, అప్పుడే లిమిట్స్ మొత్తాన్ని తొలగిస్తామని మస్క్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఇంతకు ముందు ట్విట్టర్ లో మనకి అకౌంట్ లేకపోయినా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సౌకర్యం లేదు, ఎవరైనా ట్విట్టర్ ని చూడాలంటే కచ్చితంగా అందులో అకౌంట్ సృష్టించి లాగిన్ అవ్వాల్సిందే. లేకపోతే ట్విట్టర్ లోకి ఎంట్రీ అనేదే లేదు. డేటా చోరీని అరికట్టడానికి ఇలాంటి చర్యలు చేపట్టారట. చూడాలి మరి ఎన్ని రోజులు ఈ లిమిట్స్ కొనసాగుతుంది అనేది.