ఫేస్‌బుక్  తప్పుడు ఆలోచన తనకి తెలుసు అంటున్న మస్క్

కేవలం జనాలని కొన్ని దారులలో మాత్రమే ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పని చేస్తోంది అని విమర్శలు కురిపించారు ట్విట్టర్ దిగ్గజం ఎలోన్ మస్క్. ప్రజలను పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తుందని, ఫేస్‌బుక్ అల్గరిథం దీనికి సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నాడు ఎలోన్ మస్క. ఇంకా చెప్పాలంటే, ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న అల్గరిథం ప్రకారం, కేవలం కొన్ని విషయాలను మాత్రమే హైలెట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే విధంగా […]

Share:

కేవలం జనాలని కొన్ని దారులలో మాత్రమే ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పని చేస్తోంది అని విమర్శలు కురిపించారు ట్విట్టర్ దిగ్గజం ఎలోన్ మస్క్. ప్రజలను పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తుందని, ఫేస్‌బుక్ అల్గరిథం దీనికి సాక్ష్యం అంటూ చెప్పుకొస్తున్నాడు ఎలోన్ మస్క. ఇంకా చెప్పాలంటే, ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న అల్గరిథం ప్రకారం, కేవలం కొన్ని విషయాలను మాత్రమే హైలెట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని ఫేస్ బుక్ మీద మండిపడ్డారు ఎలోన్ మస్క్. 

విమర్శించిన ఎలోన్ మస్క్: 

ఎలోన్ మస్క్ బుధవారం మార్క్ జుకర్‌బర్గ్ మరియు ఫేస్‌బుక్‌లను బహిరంగంగా విమర్శించారు, వారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పక్కదారీ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే, ఎవరు ఎంత మొత్తుకున్నప్పటికీ, ఫేస్‌బుక్ మాత్రం ఎప్పటికీ తన అల్గారిథమ్‌ను ఎప్పటికీ విడుదల చేయదని కూడా ఆయన చెప్పారు.

ఎలోన్ మస్క్, తన ట్వీట్‌లో, ఫేస్‌బుక్ పెద్ద ఎత్తున ప్రజలను మానిప్యులేట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని ఎత్తి చూపారు. ఫేస్‌బుక్ వెనుక ఉన్న మెటా తమ అల్గారిథమ్‌ను ఓపెన్ సోర్స్‌గా ఎందుకు విడుదల చేయదని కూడా విమర్శించారు మస్క్. 

ఇటీవల మెటా విడుదల చేసిన Llama 2: 

OpenAI ChatGPT అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం కొంతవరకు మాత్రమే స్పష్టమైన ఆక్యురసీ అందుబాటులో ఉందని, అయితే ఇప్పుడు మెటా ద్వారా అందుబాటులోకి వచ్చిన Llama 2, ప్రస్తుతం అందుబాటులో ఉన్న OpenAI ChatGPTకి గట్టి పోటీ ఇస్తూ మంచి పనితనం చూపిస్తూ మన పనిని 100% ఆక్యురసీతో పూర్తి చేయగలదు అంటున్నారు మెటా అధినేతలు. 

అయితే ఇంతకుముందు మెటా, పెద్ద పెద్ద బుక్స్, న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని రైటింగ్స్ అనేవి డిజిటైజ్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మోడల్ దానికన్నా తక్కువ పనితీరును చూపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఎలన్ మస్క్ గురించి మరింత: 

సోషల్ మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న Twitter దాని డైరెక్టర్ల బోర్డులో చేరమని మస్క్‌ని ఆహ్వానించింది, ఈ ఆఫర్‌ని తను మొదట అంగీకరించాడు. ఏప్రిల్ 14న, మస్క్ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్‌ను ఇచ్చాడు, దీనికి ట్విట్టర్ బోర్డు ప్రారంభంలో ప్రతిస్పందిస్తూ ప్రతికూల భావంతో స్పందించింది, ఏప్రిల్ 25న మస్క్ చేసిన $44 బిలియన్ల కొనుగోలు ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించింది. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడానికి, దాని అల్గారిథమ్‌లను ఓపెన్-సోర్స్ చేయడానికి, స్పామ్ అకౌంట్స్ ఎదుర్కోవడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మస్క్ ట్విట్టర్‌కు అనేక కొత్త మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదించాడు మరియు కంపెనీలో సగం మందిని తొలగించాడు.”అత్యంత హార్డ్‌కోర్” పనికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో వందలాది మంది ఉద్యోగులు మానేసి కంపెనీకి రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో ట్విట్టర్ హవా అందరికీ తెలిసిందే. అందులో ఉండే లోగో గురించి ఎప్పటినుంచో మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా చాలాసార్లు ప్రస్తావించాడు ఎలోన్ మస్క్. అంతే కాకుండా, మునుపటి నుంచి ట్విట్టర్ లోగో పక్షి ఎంత ప్రావీణ్యం పొందిందో ఆయన చెప్తూనే, తన ట్విట్టర్లో రాబోయే కొత్త లోగో గురించి ప్రస్తావించాడు. అయితే త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్ కు కొత్త లోగో రాబోతుందని ఇక అన్ని పక్షులకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ పోస్టులో ఒకవేళ ‘X’ అనే లోకో గనక బాగుంటే, అది రేపటి నుంచి ప్రపంచం మొత్తం గా లైవ్ లోకి వెళ్తుంది అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు మస్క్ తర్వాత రోజు నుంచే ట్విట్టర్ పేరుని మార్చడం జరిగింది.