ఇండియన్ కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్ లేంటో తెలుసా..?

మేధోపరమైన హక్కులు , సమాచారం సైబర్ దాడులు ప్రమాదాలు అనేవి భారత కంపెనీల ఎదుర్కొంటున్న ప్రధాన రిస్కులు అని ఫిక్కీ కి సర్వే తెలిపింది. ముఖ్యంగా మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే ఇప్పుడు 2022లో 5 వ స్థానానికి వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో తమ కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. లాజిస్టిక్స్, నిర్మాణరంగ కంపెనీల ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని […]

Share:

మేధోపరమైన హక్కులు , సమాచారం సైబర్ దాడులు ప్రమాదాలు అనేవి భారత కంపెనీల ఎదుర్కొంటున్న ప్రధాన రిస్కులు అని ఫిక్కీ కి సర్వే తెలిపింది. ముఖ్యంగా మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే ఇప్పుడు 2022లో 5 వ స్థానానికి వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో తమ కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. లాజిస్టిక్స్, నిర్మాణరంగ కంపెనీల ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.

ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళనకరమైన అంశంగా పేర్కొనబడింది. ఇకపోతే ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉండగా నిర్మాణ రంగ కంపెనీలు కూడా ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్ ను చూస్తున్నాయి. ఇక రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపి హక్కుల చోరీ, విపత్తులను రిస్కులాగా తెలిపాయి. ఇకపోతే మీడియా వినోద పరిశ్రమ సమాచారం ప్రకారం.. సైబర్ సెక్యూరిటీ ప్రిస్కులను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఐటీ తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రధమ రిస్క్ గా పేర్కొనబడింది.

మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్కులను తెలుసుకోవడానికి ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించిందని సమాచారం. ఇకపోతే తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సాంకేతిక ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఇంటర్నెట్ కూడా ఒకటి. ఈ రోజు సమాచారం, కమ్యూనికేషన్, టెక్నాలజీలు సర్వ వ్యాప్తి డిజిటలైజేషన్ వైపు ధోరణి పెరిగిపోతోంది.

ఇకపోతే ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పెరుగుతున్న డిమాండ్ కంప్యూటర్ టెక్నాలజీని సాధారణంగా బ్యాక్ స్పేస్ ను నిలబెట్టుకోవడంలో పనిచేసే ఉత్పత్తులలో ఏకీకృతం చేయడానికి ఇది దారి తీసింది.

ఇక ఫిక్కీ నిర్వహించిన సర్వేలో.. సైబర్ ప్రపంచం ఒక వర్చువల్ రియాల్టీని కలిగింది ఇక్కడ ఎవరైనా సరే ఈ గుర్తింపును దాచవచ్చు లేదా నకిలీ చేయవచ్చు ఇంటర్నెట్ బహుమతిని నేరపూరితంగా తప్పుగా వ్యవహరించడానికి కొంతమంది ఉపయోగిస్తున్నారు. ఇక డిజిటల్ ఇండియా అనేక ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి కానీ కొంతమంది దీనిని చాలా అధ్వానంగా ఉపయోగిస్తున్నారని చెప్పాలి. ఇంటర్నెట్ సాధారణంగా ఉపయోగించే ఇతర పరికరాలైన సోషల్ మీడియా సైట్లు ఫేస్బుక్, చాట్ రూమ్ లు,  స్కైప్,  వాట్సాప్ , డేటింగ్ సైట్లు మొదలైనవి మహిళలను ట్రాప్ చేయడానికి ప్రధమంగా చిత్రీకరించాయి.

ఈ నేపథ్యంలోనే ఎంతోమంది మహిళలు ఇలా సైబర్ క్రైమ్ బారిన పడుతుండగా.. అన్ని విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని మహిళలకు ఇంటర్నెట్ విషయంలో అవగాహన కల్పించడమే కాదు వారు మోసపోకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ వల్ల చాలామంది మనోభావాలు దెబ్బ తినడమే కాకుండా కొంతమంది సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇకపోతే మిగతా దేశాలతో పోల్చుకుంటే ముఖ్యంగా ఇండియన్ కంపెనీలలోని ఉద్యోగులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.