సైబర్ క్రైమ్‌లో సరికొత్త టెక్నిక్

అందమైన మహిళలకు వీడియో కాల్స్.. ఆపై కాల్ అంతా రికార్డుతీరా చూస్తే డబ్బు కోసం బెదిరింపులు.. ఇది సైబర్ క్రైం కొత్త దందా ప్రస్తుతం సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలను అరికట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేరాల బారిన ప్రజలు పడకుండా ఉండేలా పోలీసు శాఖ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఎందుకంటే దోచుకోవడానికి మోసగాళ్లు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీడియో కాల్స్ చేయడం, ట్రాప్ చేయడం లాంటివి మోసగాళ్లు […]

Share:

అందమైన మహిళలకు వీడియో కాల్స్.. ఆపై కాల్ అంతా రికార్డు
తీరా చూస్తే డబ్బు కోసం బెదిరింపులు.. ఇది సైబర్ క్రైం కొత్త దందా

ప్రస్తుతం సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలను అరికట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేరాల బారిన ప్రజలు పడకుండా ఉండేలా పోలీసు శాఖ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఎందుకంటే దోచుకోవడానికి మోసగాళ్లు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీడియో కాల్స్ చేయడం, ట్రాప్ చేయడం లాంటివి మోసగాళ్లు తాజాగా అనుసరిస్తున్న ట్రెండ్.

అందమైన మహిళలతో వీడియో కాల్ కావాలా అంటూ లింక్ పంపిస్తారు. ఇక ఆ లింక్ క్లిక్ చేసే విధంగా మోసగాళ్లు తమ పనిని స్టార్ట్ చేస్తారు. దీని కోసం వారు ముఖ్యంగా నిరాశలో ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుంటారు. వారు లింక్‌ను తెరిచి వీడియో కాల్ ప్రారంభించిన తర్వాత మోసగాళ్లు మొత్తం కాల్‌ను రికార్డ్ చేస్తారు. అనంతరం వీడియో లీక్ అవుతుందని బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు.

ఈ వార్త బయటకు వస్తే తమ ఇమేజ్ చెడిపోతుందనే భయంతో బాధితులు డబ్బులు చెల్లిస్తున్నారు. చాలా అరుదుగా బాధితులు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంటారు. వారి భయమే మోసగాళ్ల ఆయుధం, డబ్బు కోసం ఇలా అనేకమందిని దోచుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

సైబర్ నేరాలు

వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు తాజాగా ఇలాంటి మోసగాళ్ల బారిన పడ్డాడు. మోసగాళ్లు అడిగిన మేరకు బాధితుడు రూ.5 లక్షల వరకు చెల్లించాడు. అయితే ఇంత మొత్తం చెల్లించినా వేధింపులు ఆగలేదు. ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

దీనిపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఈ మెసేజ్‌లు, కాల్‌లకు దూరంగా ఉండాలని, లేకుంటే డబ్బు మొత్తం పోగొట్టుకోక తప్పదని పోలీసులు చెబుతున్నారు.

ఇవి పాటిస్తే నేరాలకు అడ్డుకట్ట

సైబర్ నేరగాళ్లు నేరాలకు కొత్త మార్గాలను అవలంబిస్తున్నారని అన్నారు. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదు, ఎల్లప్పుడూ ATM పిన్‌ను మారుస్తూ ఉండాలి, సులభంగా ఊహించగలిగే PINని ఉంచవద్దు.

ఎలాంటి ఆఫర్లకు, అత్యాశకు లొంగకండి. ఏ లింక్‌నూ తెరవవద్దు. బ్యాంకు ఉద్యోగులు ఎప్పుడూ ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడగరు. ఎలాంటి కాల్ వచ్చినా, ఎదురుగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఉద్యోగిగా నటిస్తూ వ్యక్తిగత సమాచారం, OTP లేదా KYC చేస్తున్న పేరుతో ఏదైనా సమాచారం అడిగితే, ఆ వ్యక్తికి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దు.

అయినప్పటికీ, మీరు సైబర్ క్రైమ్ బాధితులైతే, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. సైబర్ క్రైం కేసుల్లో మీరు మీ ఫిర్యాదును నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://wwwcrimedotgov.in లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్/ఔట్‌పోస్ట్‌లో నమోదు చేసుకోవచ్చు. వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే మీరు మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందవచ్చు.