ఐఫోన్ 15 కొనేందుకు 17 గంటలు లైన్ లో!

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగే ఈవెంట్ వండర్ లస్ట్ లో భాగంగా ఆపిల్ కొత్తగా లాంచ్ చేయబోతున్న కొన్ని ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి ఇటీవల పరిచయం చేసింది.  […]

Share:

ఎన్ని మొబైల్స్ మార్చినప్పటికీ మనం ఎప్పటికైనా ఆపిల్ కంపెనీ అందిస్తున్న ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదండీ.. అంతేకాకుండా చాలామంది ఎక్కువగా ఆపిల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్న వారు లేకపోలేదు. కేవలం ఐఫోన్ మాత్రమే కాకుండా, ఆపిల్ సంస్థ అనేకమైన ప్రొడక్ట్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగే ఈవెంట్ వండర్ లస్ట్ లో భాగంగా ఆపిల్ కొత్తగా లాంచ్ చేయబోతున్న కొన్ని ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి ఇటీవల పరిచయం చేసింది. 

ఐఫోన్ 15 కొనేందుకు 17 గంటలు లైన్ లో?: 

భారతదేశంలో ఐఫోన్ సిరీస్ 15 కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా శుక్రవారం నాడు ఆపిల్ ఐఫోన్ 15 రిలీజ్ అవ్వడంతో ఆపిల్ స్టోర్ బయట జనాలు బారులు తీరిన క్రమం కనిపిస్తోంది. అయితే అహ్మదాబాద్ కి చెందిన ఒక కష్టమర్, సుమారు 17 గంటలు, భారతదేశంలోనే, ముంబైలో ఉన్న మొదటి ఆపిల్ స్టోర్ బయట లైన్ లో నిలబడి, తన ఫస్ట్ ఐఫోన్ 15 సిరీస్ కొనేందుకు వెయిట్ చేయడం జరిగింది. 

నిజంగా ఆపిల్ స్టోర్ లోకి వెళ్లి తన మొదటి ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనుక్కునేందుకు తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని, అంతేకాకుండా ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ తనని ఎంతగానో ఆకట్టుకుందని, తాను వైట్ టైటానియం, 256 జీబీ వేరియంట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. మొదటి రోజే తనకి ఐఫోన్ 15 అనుకున్న ప్రకారం తన చేతిలోకి రావడం చాలా ఆనందంగా ఉందంటూ సంతోషాన్ని బయట పెట్టాడు అహ్మదాబాద్ కస్టమర్. 

ఐఫోన్ 15 గురించి మరింత:  

ఆపిల్ తన ఐఫోన్ 14 తరువాత సిరీస్ కి సంబంధించి, ఈ సంవత్సరం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు, అయితే కొత్త మోడళ్లలో గుర్తించదగిన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ముఖ్యమైన ఆకర్షణ. ఇటీవలి నివేదికల ప్రకారం, ప్రతి మోడల్‌లో థండర్‌బోల్ట్/ USB 4 కనెక్షన్తో పాటుగా 35W వరకు వేగంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉన్న USB టైప్-C పోర్ట్‌తో కొత్త ఐఫోన్ సిరీస్ వస్తున్నట్లు భావిస్తున్నారు. 

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మ్యూట్ స్విచ్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌ ఉన్నట్లు సమాచారం. ఈ బటన్ ప్రోగ్రామబుల్ కావచ్చు. టాప్-ఆఫ్-లైన్ మోడల్ నిజానికి ద బెస్ట్ ఆప్టికల్ జూమ్ పనితీరును అందించే పెరిస్కోప్ కెమెరాతో వచ్చేస్తుంది. రెండు మోడల్‌లు కొత్త కలర్ ఆప్షన్‌లతో టైటానియం వస్తున్నట్లు సమాచారం. 

డిస్కౌంట్ చూద్దాం రండి: 

iPhone 15: ₹74,900, దాని అసలు ధర ₹79,900.

• iPhone 15 Plus: ₹84,900, దాని అసలు ధర ₹89,900.

• iPhone 15 Pro: ₹128,900, దాని అసలు ధర ₹1,34,900.

• iPhone 15 Pro Max: ₹153,900, అసలు ధర ₹159,900.

ఆపిల్ అందిస్తున్న మరిన్ని ఆకర్షణలు: 

ఆపిల్ వాచ్: 

కొత్త స్మార్ట్‌వాచ్ మోడళ్లను విడుదల చేయాలనే ఆలోచనా ఇప్పుడు ఆపిల్ సంస్థకు లేనట్లే అంటూ కొంతమంది అంటున్నారు. అయితే కొత్త నివేదికల ప్రకారం, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ అల్ట్రా మరియు ఆపిల్ వాచ్ సిరీస్ 9 కొత్త S9 చిప్‌తో వచ్చే అవకాశం ఉందని, ఇది 2020 లో లాంచ్ చేసిన సిరీస్ 6 మోడల్ నుండి వాచ్‌లోని ప్రాసెసర్‌కు మొదటి అప్‌గ్రేడ్, అంతేకాకుండా మరింత హై పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ ఎయిర్పోర్ట్స్: 

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఎయిర్ ఫోర్స్ ప్రో సెకండ్ జనరేషన్ కు మరిన్ని మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి సెప్టెంబర్ 12న జరగన వండర్లస్ట్ ఈవెంట్లో ఆపిల్ తన కొత్త ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విడుదల కాబోయే ఎయిర్పోర్ట్స్ యూఎస్బీ టైప్ సి పోర్టుతో వస్తున్నట్లు సమాచారం.