తెలంగాణలలో తగ్గిన అవినీతి : సీఎస్‌డీఎస్‌ సర్వేలో వెల్లడి

తెలంగాణలో అవినీతి తగ్గిందని 31.4% మంది ఓటర్లు అభిప్రాయపడ్డట్టు CSDS సర్వే తెలిపింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అవినీతి చాలా తక్కువగా ఉందని, కేవలం 23 శాతం మంది ఓటర్లు మాత్రమే రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని నమ్ముతున్నారని సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) లోక్‌నీతి ప్రోగ్రామ్ సర్వేలో తేలింది.  అవినీతి అనేది కీలకమైన ఎన్నికల సమస్య కదా.. అని తెలుసుకోవడానికి ఈ సర్వే ప్రయత్నించింది. అవినీతి వల్ల ఓటర్లు  అసంతృప్తికి గురి అవుతారని, […]

Share:

తెలంగాణలో అవినీతి తగ్గిందని 31.4% మంది ఓటర్లు అభిప్రాయపడ్డట్టు CSDS సర్వే తెలిపింది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అవినీతి చాలా తక్కువగా ఉందని, కేవలం 23 శాతం మంది ఓటర్లు మాత్రమే రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని నమ్ముతున్నారని సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) లోక్‌నీతి ప్రోగ్రామ్ సర్వేలో తేలింది. 

అవినీతి అనేది కీలకమైన ఎన్నికల సమస్య కదా.. అని తెలుసుకోవడానికి ఈ సర్వే ప్రయత్నించింది. అవినీతి వల్ల ఓటర్లు  అసంతృప్తికి గురి అవుతారని, రాజకీయ పార్టీలపై కోపంగా ఉన్నారని ఈ సర్వే కనుగొంది. అయితే గత ఎన్నికల సమయంలో..ప్రధానంగా ఓటింగ్ నిర్ణయాలు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఇటీవలి 13 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులోని 12 రాష్ట్రాల ఎన్నికల్లో.. వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్న వారితో పోలిస్తే.. మునుపటి ఎన్నికల కంటే.. ఉప్పుడు అవినీతి పెరిగిందని ఎక్కువ మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ 12 రాష్ట్రాలలో ఆరింటిలో.. అధికార పార్టీ లేదా అధికార కూటమి మళ్ళీ ఎన్నికైంది. మిగిలిన ఆరింటిలో అధికార పార్టీ తమ అధికారానికి దూరమైంది. 

ఇక ఇందులో అవినీతి తగ్గిందని ఎక్కువ మంది ఓటర్లు (31.4 శాతం) విశ్వసించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 2018లో అధికార భారత రాష్ట్ర సమితి (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) తిరిగి ఎన్నికైనప్పటికీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవలి సందర్భాలలో జరిగిన 13 రాష్ట్రాల ఎన్నికలలో లోక్‌నీతి CSDS బృందం సేకరించిన డేటాను ఈ సర్వే కవర్ చేసింది.

గత నాలుగు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు మరియు ఎన్నికలకు తరువాత నిరంతర ప్రక్రియగా సాగింది ఈ సర్వే. ఐతే మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి ఆకట్టుకునే అభిప్రాయాన్ని ఈ సర్వే వెల్లడించలేదు.

ఇక మిగితా రాష్ట్రాలలో పోలిస్తే..  పంజాబ్ రాష్ట్రంలో అవినీతి పెరిగిందని 69 శాతం మంది పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో అవినీతి పెరిగిందని 67 శాతం, గోవాలో 59 శాతం, కర్నాటకలో 58 శాతం, రాజస్థాన్లో 57 శాతం, గుజరాత్ లో 53 శాతం ఓటర్లు పేర్కొన్నారు.

కాగా.. మరో విశ్లేషణ ప్రకారం.. అవినీతి మరింత పెరిగినప్పటికీ, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకో గలిగాయి. అదే విధంగా, గుజరాత్ మరియు కర్ణాటకలలోని ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి జరుగుతున్నట్టు ప్రజలు గమనించినప్పటికీ, బీజేపీ తమ అధికారాన్ని చేజిక్కించుకుంది.

తెలంగాణలో రోడ్ల పరిస్థితి మెరుగుపడిందని 51.7 శాతం మంది అభిప్రాయపడగా, విద్యుత్ సరఫరా మెరుగుపడిందని 84.7 శాతం మంది,  తాగునీటి సరఫరా మెరుగుపడిందని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇక తెలంగాణలో కీలకమైన ప్రభుత్వ పథకాలపై అవగాహన చాలా ఎక్కువగా ఉందని, 94.9 శాతం మంది ప్రతివాదులు రైతు బంధు, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ (95.8 శాతం) గురించి విన్నారు. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ (93.2 శాతం), 2BHK పథకం (93.8) శాతం మరియు ఆరోగ్య శ్రీ (96.6 శాతం) లాంటి పథకాలు  K చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రెండవసారి విజయంలో కీలక పాత్ర పోషించాయని సూచిస్తున్నాయి.