ఇక అన్నదాతలకు కూడా అందుబాటులోకి చాట్ జీపీటీ!

గత కొన్ని రోజుల నుండి ఎక్కడ చూసినా.. చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. గూగుల్ సెర్చింజిన్​కే ముచ్చెమటలు పట్టించిన ఈ సంచలనంలో.. మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టింది. గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఆగమేఘాల మీద బార్డ్ అనే సర్వీస్​ను ప్రవేశపెట్టిందంటేనే చాట్ జీపీటీ ఎలా సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలిసిపోతుంది. ఇటీవల అమెరికాలో నెలకు 20 డాలర్ల రుసుంతో చాట్ జీపీటీ ప్లస్ సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక ఇండియాలో రైతులకు చాట్ […]

Share:

గత కొన్ని రోజుల నుండి ఎక్కడ చూసినా.. చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. గూగుల్ సెర్చింజిన్​కే ముచ్చెమటలు పట్టించిన ఈ సంచలనంలో.. మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టింది. గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఆగమేఘాల మీద బార్డ్ అనే సర్వీస్​ను ప్రవేశపెట్టిందంటేనే చాట్ జీపీటీ ఎలా సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలిసిపోతుంది. ఇటీవల అమెరికాలో నెలకు 20 డాలర్ల రుసుంతో చాట్ జీపీటీ ప్లస్ సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక ఇండియాలో రైతులకు చాట్ జీపీటీ ద్వారా మేలు చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గూగుల్ స్పీడ్​కు కళ్లెం వేద్దామని ఎప్పటి నుంచో భావిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇదే మంచి తరుణంగా భావించి పెట్టుబడులు పెట్టింది. చాట్ జీపీటీని మరింత డెవలప్ చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్ జీపీటీ చర్చే నడుస్తోందంటే అది క్రియేట్ చేస్తున్న సంచలనాలను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలు స్టూడెంట్స్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చాట్ జీపీటీ ఉపయోగించకుండా నిషేధం విధించాయి. కానీ మన ప్రభుత్వం ఈ చాట్ జీపీటీని రైతుల కోసం ఉపయోగించాలని అనుకుంటోంది. అసలు మన గవర్నమెంట్ ఏం చేయనుందో ఓ సారి లుక్కేస్తే.. 

రైతుల కోసం ఏం చేయనున్నారు?

చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో నడిచే సేవ. అటువంటి సేవ నిరక్షరాస్యులైన కొంత మంది అన్నదాతలకు ఎలా ఉపయోగపడుతుందని చాలా మందికి అనుమానం రావొచ్చు. ప్రస్తుతం చాట్ జీపీటీ డిఫాల్డ్ మోడ్, టర్బోమోడ్ అందిస్తోంది. ఇండియన్ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ చాట్ జీపీటీని ప్రభుత్వ పథకాలు రైతులు తెలుసుకునేలా డిజైన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే పథకాల గురించి తెలియక లాస్ అవుతున్న అన్నదాతలు ఇక ఎప్పుడూ అప్డేట్​గా ఉండేలా చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 

రైతులకు మరింత సమాచారం

రైతులకు ప్రభుత్వ పథకాలను గురించిన మరింత సమాచారం అందించేలా చాట్ జీపీటీని వాట్సాప్​తో అనుసంధానించాలని ఐటీ మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ లోని టీమ్ భాషిణి, చాట్ జీపీటీ ద్వారా నడిచే చాట్ బాట్​ను పరీక్షిస్తున్నట్లు ఒక జాతీయ మీడియా తెలిపింది. ఇది అందుబాటులోకి వస్తే అన్నదాతలకు మరింత ప్రయోజనం కలగనుంది. ఇంటర్​నెట్‌‌ను ఉపయోగించి భారతీయ రైతులు ప్రభుత్వ కార్యక్రమాలను యాక్సెస్ చేసేందుకు త్వరలోనే జీపీటీ ఇంటర్​ఫేస్​ను ఉపయోగించుకోవచ్చునని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్​లో ప్రకటించారు. దీంతో చాట్ జీపీటీ త్వరలోనే రైతులకు సేవలందించనుందనే వార్తలకు బలం చేకూరింది. మరి చూడాలి.. టెక్ రంగంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన చాట్ జీపీటీ భారతీయ రైతులకు ఎంత వరకు ఉపయోగపడుతుందో.. మన ఇండియన్ వ్యవసాయ రంగంలో ఈ టెక్ సంచలనం ఏవైనా సంచలనాలను క్రియేట్ చేస్తుందో.. లేక ఎప్పటి లాగానే రైతుల అవస్థలు అలాగే ఉంటాయో.