ChatGPTలో బగ్. ప్రీమియం వినియోగదారుల ప్రైవేట్ డేటా బహిర్గతం

ఇంటర్నెట్ సంచలనం.. చాట్ GPT మరియు GPT-4 ని డెవలప్ చేసిన సాంకేతిక సంస్థ OpenAI, గత వారం డేటా ఉల్లంఘన జరిగిందని ప్రకటించింది. కొంతమంది వినియోగదారుల చాట్ హిస్టరీ ఇతర వినియోగదారులకు బహిర్గతం అయినట్టు తెలిపింది. డేటా ఉల్లంఘన తర్వాత, US-ఆధారిత జనరేటివ్ AI సొల్యూషన్స్ కంపెనీ మార్చి 20న ChatGPTని ఆఫ్‌లైన్‌ చేసింది అంటే ఆపేసింది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో లేకుండా పోయింది. జరిగిన తప్పును […]

Share:

ఇంటర్నెట్ సంచలనం.. చాట్ GPT మరియు GPT-4 ని డెవలప్ చేసిన సాంకేతిక సంస్థ OpenAI, గత వారం డేటా ఉల్లంఘన జరిగిందని ప్రకటించింది. కొంతమంది వినియోగదారుల చాట్ హిస్టరీ ఇతర వినియోగదారులకు బహిర్గతం అయినట్టు తెలిపింది.

డేటా ఉల్లంఘన తర్వాత, US-ఆధారిత జనరేటివ్ AI సొల్యూషన్స్ కంపెనీ మార్చి 20న ChatGPTని ఆఫ్‌లైన్‌ చేసింది అంటే ఆపేసింది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో లేకుండా పోయింది. జరిగిన తప్పును సరిదిద్దడం, తదుపరి డేటా బహిర్గతం కాకుండా నిరోధించడం మరియు దిద్దుబాటు చర్యలు చేపట్టడం కోసం AI చాట్‌బాట్ సేవను పునరుద్ధరించిన తర్వాత కూడా కంపెనీ వినియోగదారుల చాట్ హిస్టరీలు వినియోగదారులకు కనబడకుండా హైడ్ చేసింది.

ఏం బట్టబయలైంది:

బగ్ కారణంగా, కొన్ని సబ్‌స్క్రిప్షన్ చేయబడిన ఇమెయిల్స్ సమాచారం ఇతర యూజర్లకు పంపబడ్డాయి. ఇక సోమవారం సర్వీస్ ఆగిపోయే కొన్ని గంటల ముందు, కొంతమంది వినియోగదారులకు మరొక వినియోగదారు.. మొదటి మరియు చివరి పేరు, ఇమెయిల్ అడ్రస్, పేమెంట్ అడ్రస్, క్రెడిట్ కార్డ్ నంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు మరియు క్రెడిట్ కార్డ్ గడువు తేదీని చూడగలిగారు. కాగా.. బగ్‌ను పరిష్కరించడానికి సంస్థ పని చేస్తోంది.

డేటా ఉల్లంఘనపై ChatGPT.. యూజర్ కమ్యూనిటీకి క్షమాపణలు చెబుతూ, పూర్తి క్రెడిట్ కార్డ్ నంబర్‌లు ఏ సమయంలోనూ బహిర్గతం కావని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు జరిగిన తప్పు మరెప్పుడు జరగకుండా చూసుకుంటామని యూజర్ కమ్యూనిటీకి హామీ ఇచ్చింది.

“ఓపెన్ సోర్స్ లైబ్రరీలో ఉన్న బగ్ కారణంగా మేము ఈ వారం ప్రారంభంలో ChatGPTకి ఆన్లైన్ కెనెక్టీవిటి తిలిగించాం అంటే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నామని, దీని వలన కొంతమంది వినియోగదారులు మరొక యాక్టివ్ యూజర్ యొక్క చాట్ హిస్టరీ నుండి డేటా చూడగలిగారు” అని కంపెనీ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

“ఇద్దరు వినియోగదారులు ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉంటే కొత్తగా సృష్టించబడిన సంభాషణ యొక్క మొదటి సందేశం వేరొకరి చాట్ హిస్టరీ కనిపించే అవకాశం కూడా ఉంది” అని సంస్థ వివరించింది.

చాట్ సేవ అందుబాటులో లేకపోవడానికి కారణమైన బగ్ ఇప్పుడు పరిష్కరించబడిందని కంపెనీ ధృవీకరించింది. చాట్ హిస్టరీని కూడా పునరుద్ధరించవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిర్దిష్ట తొమ్మిది గంటల విండోలో యాక్టివ్‌గా ఉన్న 1.2 శాతం ChatGPT Plus GPT-4-గ్రేడ్ అంటే ఫాస్ట్ రెస్పాన్స్ అందించే ప్రీమియం సర్వీస్) చందాదారులకు చెల్లింపు సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడానికి అదే బగ్ దారితీసిందని కంపెనీ తెలిపింది.

“వాస్తవానికి ఇతరులకు డేటా బహిర్గతం చేయబడిన వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని మేము నమ్ముతున్నాము” అని సంస్థ పేర్కొంది.

“బాధిత వినియోగదారులకు వారి చెల్లింపు సమాచారం బహిర్గతమై ఉండవచ్చని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. మీ వినియోగదారుల డేటాకు ఎటువంటి ప్రమాదం లేదని మేము ఆశిస్తున్నామని” అని కంపెనీ పేర్కొంది.

బగ్ గురించిన కొన్ని సాంకేతిక వివరాలు ఇక్కడ ఉన్నాయి.  Redis క్లయింట్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ, redis-pyలో బగ్ కనుగొనబడింది. సమస్యను పరిష్కరించడానికి ఒక ప్యాచ్‌తో Redis మెయింటెయినర్‌లను సహాయం కోరినట్లు OpenAI తెలిపింది.