2024 నాటికి దివాలా తీయ‌నున్న చాట్ జీపీటీ

టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేస్తుంది అని అంటూ ఉంటారు, ప్రతీ రోజు కొత్తగా వస్తున్న ఇన్వెన్షన్ లతో ఇది పూర్తిగా నమ్మవచ్చు అని నిరూపిస్తుంది కూడా. అసలు ఒకప్పుడు దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడాలి అంటే ఉత్తరం ఒకటే మార్గంగా ఉండేది. అక్కడి నుండి లాండ్ ఫోన్ ఆ తర్వాత సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం అంతా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ రాకతో సామాన్యులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ […]

Share:

టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేస్తుంది అని అంటూ ఉంటారు, ప్రతీ రోజు కొత్తగా వస్తున్న ఇన్వెన్షన్ లతో ఇది పూర్తిగా నమ్మవచ్చు అని నిరూపిస్తుంది కూడా. అసలు ఒకప్పుడు దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడాలి అంటే ఉత్తరం ఒకటే మార్గంగా ఉండేది. అక్కడి నుండి లాండ్ ఫోన్ ఆ తర్వాత సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం అంతా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ రాకతో సామాన్యులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సాక్షాత్తు ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే కొత్తగా వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవ జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది అనే పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చేసింది. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ముఖ్య ఉద్దేశంగా సాం ఆల్ట్ మన్ కంపెనీ చాట్ జీపీటీ అనే టూల్ ను రూపొందించింది. చాట్ జీపీటీ రాకతో నే పెను సంచలనాలు సృష్టించింది. నవంబర్ 2022 లో ప్రారంభించబడిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి చాట్ జీపీటీ ను కొనసాగించడం తలకు మించిన భారం అవ్వనుంది అని అనలిటిక్స్ ఇండియా మాగజైన్ పేర్కొన్నది. చాట్ జీపీటీ నడపడానికి రోజుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని దాని వలన కంపెనీ ఇప్పటికే 540 మిలియన్ అమెరికన్ డాలర్ల అప్పల్లోకి వెళ్ళిపోయింది అని వెల్లడించింది. 

చాట్ జీపీటీ వినియోగదారులు ఈ సంవత్సరం జూన్ నెలలో 1.7 బిలియన్ మంది ఉండగా జూలై కి 1.5 బిలియన్ కు తగ్గిపోయింది. చాట్ జీపీటీ ప్రారంభించిన తర్వాత ఒకే నెలలో 12% శాతం యూజర్లు తగ్గిపోవడం ఇదే మొదటి సారి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వాడడం వలన చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు అనే భయంతో చాలా మంది చాట్ జీపీటీ ను బహిష్కరిస్తునారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు సైతం వారి ఉద్యోగులు చాట్ జీపీటీ వాడడం మీద నిషేదం విధించారు. 

మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి కారణంగా చాట్ జీపీటీ కొంత కాలం కొనసాగే అవకాశం ఉంది అని కానీ 2024 కు కంపెనీ దివాళా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ కంపెనీకి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోవడం లేదు. ఇప్పటికే ప్రతీ రోజు అవుతున్న ఖర్చును మైక్రోసాఫ్ట్ మరియు ఇతర ఇన్వెస్టర్ ల నుండి వస్తున్న డబ్బు ద్వారా సమకూరుతుంది. అయితే లాంగ్వేజ్ మోడల్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చాట్ జీపీటీ తన తర్వాత వర్షన్ ను రూపొందిస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న వర్షన్ లకు ఇలాంటి అవకాశం లేదు. చాట్ జీపీటీ కొత్త వర్షన్ ద్వారా లాంగ్వేజ్ మోడల్ ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తే ఈ ఫీచర్ కంపెనీకి లాభాలు తెచ్చి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ 2024 సంవత్సరం చివరికి కూడా చాట్ జీపీటీ 1 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. మరి అప్పటి వరకూ చాట్ జీపీటీ ఆదాయం రాకపోతే ఎలా కొనసాగుతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.