డాక్టర్ల కంటే చాట్ GPT మిన్న అంటున్న పరిశోధకులు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా డెవలప్ చేసిన చాట్ GPT అనే అప్లికేషన్ ఎంత సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నెటిజన్స్ అందరూ ఇప్పుడు చాట్ GPT యాప్ ని చాలా కామన్ గా ఉపయోగిస్తున్నారు. ఈ చాట్ GPT ద్వారా మనం వాయిస్ కమాండ్స్ తోనే మెయిల్స్ పంపొచ్చు మరియు వ్యాసాలు కూడా రాయొచ్చు. మానవ మేధస్సుకు ప్రతీకగా ఈ చాట్ GPT ని ఉదాహరణగా చూపించవచ్చు. ఈ యాప్ వల్ల మరో అద్భుతమైన ఉపయోగం […]

Share:

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా డెవలప్ చేసిన చాట్ GPT అనే అప్లికేషన్ ఎంత సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నెటిజన్స్ అందరూ ఇప్పుడు చాట్ GPT యాప్ ని చాలా కామన్ గా ఉపయోగిస్తున్నారు. ఈ చాట్ GPT ద్వారా మనం వాయిస్ కమాండ్స్ తోనే మెయిల్స్ పంపొచ్చు మరియు వ్యాసాలు కూడా రాయొచ్చు. మానవ మేధస్సుకు ప్రతీకగా ఈ చాట్ GPT ని ఉదాహరణగా చూపించవచ్చు. ఈ యాప్ వల్ల మరో అద్భుతమైన ఉపయోగం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ చాట్ GPT ద్వారా ఫిజీషియన్స్ హై క్వాలిటీ మరియు విలువైన సలహాలను ఇవ్వవచ్చు. వైద్య రంగంలో ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎన్నో పనులను చాలా సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ఈ యాప్ లో పేషెంట్ యొక్క సమస్య చెప్పుకుంటే, దానికి సంబంధించిన మెడిసిన్స్, కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం సమాచారం ఇందులో వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా మెరుగైన వైద్యం చేయించుకోవచ్చు.

హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి సంబంధించిన ప్యానెల్ ఈ చాట్ GPT ఫంక్షనాలిటీ మొత్తాన్ని గమనించి, దీనినే వాడమని సలహా ఇస్తున్నారు. క్యాలిఫోర్నియా సాన్ డియెగో యూనివర్సిటీ లోని క్వాల్ కామ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ జాన్ W అయ్యర్స్  మాట్లాడుతూ ‘ వైద్య రంగంలో AI వల్ల పేషెంట్స్ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకి రావడం వంటివి ఇటీవలి కాలంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( AI ) అనేది రాబోయే కాలంలో మెడిసిన్ కి భవిష్యత్తు లాంటిది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ రీసెర్చ్ లో కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ చాట్ GPT పేషెంట్స్ చెప్పే సమస్యలను నూటికి నూరు శాతం స్పష్టంగా అర్థం చేసుకొని అది డాక్టర్స్ కి సమాచారం అందించగలదా అని కొంతమంది విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే కనుక నిజమైతే ఫిజీషియన్స్ కి ప్రతీ రోజూ వందల సంఖ్యలో పేషెంట్స్ నుండి సమస్యలు చెప్పుకునే వెసులుబాటు చాలా సులువు అవుతుంది. అంతే కాకుండా హెల్త్ రికవరీ రేట్ కూడా గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. ఇది నిజంగా అద్భుతాలు చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే గతంలో కరోనా విలయతాండవం ఆడుతున్న సమయంలో  ఈ చాట్ GPT లో ఉన్న కొన్ని లోపాల కారణంగా ఫిజీషియన్స్ పై చాలా ఒత్తిడి పడింది. ఒకేసారి వేల సంఖ్యలో రెస్పాన్స్ రావడం తో ఫిజీషియన్స్ అన్నిటికీ సమాధానం ఇవ్వలేకపోయారు. దాని వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో ఉండే పేషెంట్స్ మాట్లాడే భాషలను సామాన్య మానవులే ఒక్కోసారి అర్థం చేసుకోలేకపోతుంటారు. అలాంటిది ఒక రోబో ఎలా అర్థం చేసుకోగలుతుంది? వాళ్ళు చెప్పేవి సరిగ్గా అర్థం చేసుకొని నూటికి నూరు శాతం యాక్యురసీ తీసుకొని రావడం కష్టంగా ఉంటుంది. ఒక పదం మాట్లాడినప్పుడు అదే వేరే విధంగా అర్థం తీసుకొని డాక్టర్లు కూడా దానికి తగట్టుగా మెడిసిన్స్ రాస్తే పేషెంట్స్ ప్రాణాలకే ప్రమాదం కదా! అందుకే ఈ చాట్ GPT ని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. అనుకున్న విధంగా ఈ యాప్ ఎలాంటి భాష మాట్లాడినా, ఎలాంటి యాస మాట్లాడిన నూటికి నూరు శాతం ఫిల్టర్ చేసుకొని, డాక్టర్లకు, పేషెంట్స్ కి మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే భవిష్యత్తులో ఈ యాప్ అద్భుతాలే సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.