ఈ వ‌ర్షాలకు కారు డ్యామేజ్ అయితే..?

ఇంతకీ మీ కార్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారా లేదా! లేదంటే మీరు చిక్కుల్లో పడటం ఖాయం. ఉత్తర భారత దేశంలో వర్షాలు అధికంగా ఉండటం వల్ల నదులు అధిక ప్రవాహంతో రోడ్ల మీదకి ఊళ్ళ మీదకి పోటెత్తుతున్నాయి, ఇవే గాక కొండ చర్యలు విరిగిపడడంతో చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే అలా నష్టపోయిన వారు వారి వాహనాలను సరి చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది. మీ కారు నదిలో కొట్టుకుపోయిందా ? మీరు టెన్షన్ పడాల్సిన […]

Share:

ఇంతకీ మీ కార్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారా లేదా! లేదంటే మీరు చిక్కుల్లో పడటం ఖాయం. ఉత్తర భారత దేశంలో వర్షాలు అధికంగా ఉండటం వల్ల నదులు అధిక ప్రవాహంతో రోడ్ల మీదకి ఊళ్ళ మీదకి పోటెత్తుతున్నాయి, ఇవే గాక కొండ చర్యలు విరిగిపడడంతో చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే అలా నష్టపోయిన వారు వారి వాహనాలను సరి చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది.

మీ కారు నదిలో కొట్టుకుపోయిందా ?

మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఒకవేళ మీ కారు నదిలో కొట్టుకుపోతే మీకు తగిన రుసుము తిరిగి ఇన్సూరెన్స్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. సమగ్ర భీమా పాలసీ ద్వారా మనకి డబ్బులు తిరిగి వస్తాయి.

మీ కారు మీద పొరపాటున చెట్టు , విద్యుత్ స్తంభాలు పడ్డాయా ?

మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కార్ కు రిపేర్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం మనకి ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి వస్తుంది. మీ కార్ కు ఏ ఏ భాగాలు దెబ్బతిన్నాయో ఆ భాగాలకు వివిధ రకాలైన ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడే మీరు ఇన్సూరెన్స్ కి అప్లై చేసుకోండి.

ఈ కార్ ఇంజన్లోకి  నీళ్లు చేరుకొని ఇంజన్ పాడయిందా ?

మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కార్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల మన కారు ఇంజన్ పోవడానికి తగిన రుసుము మార్కెట్ వేల్యూని బట్టి మనకి తిరిగి వస్తుంది. ఇలా చాలా రకాలైన ఇన్సూరెన్స్ పాలసీలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఈ కార్ కు ఇన్సూరెన్స్ చేయించుకుని ఈ వర్షాకాలంలో స్వేచ్ఛగా మీ కార్లలో తిరగొచ్చు.

మనకు జీరో డిప్రిసియేషన్ పాలసీ అందుబాటులో ఉంది. దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటంటే మన కార్ కు సంబంధించిన ఏ పార్టు పోయిన మనకు దానికి తగిన పాలసీని బట్టి మనకి ఇన్సూరెన్స్ రూపంలో రుసుము తిరిగి వస్తుంది. ఇది కొత్త వాహన వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొత్త వాహనాలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాటికి కలిగే నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడే ఇన్సూరెన్స్ పాలసీలను గమనించుకోండి.

ఒకవేళ మీ కార్ కు మీ సొంత ప్రయత్నంలో నష్టం వాటిలితే మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడదు. వాటిని మీరే భరించుకోవలసి వస్తుంది. ఒకవేళ మీ కారు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతే ఉదాహరణకు కొండ చర్యలు విరిగిపడి, కొండపై నుంచి కింద పడిపోవడం లేదా ప్రకృతి విపత్తుల వల్ల రోడ్డు ప్రమాదం జరగడం ఇలాంటి విపత్తులకు ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతుంది. కాబట్టి వెంటనే మీరు ఇన్సూరెన్స్ ను గమనించుకోవాలి . ఈ వర్షాకాలంలో మనం తగిన జాగ్రత్తలు పాటిద్దాం.

మనకు ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు మరెన్నో అందుబాటులో ఉన్నాయి ప్రకృతి విపత్తుల వల్ల మన వాహనాలకు తెలియని నష్టం రావచ్చు కాబట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి వస్తుందో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రకృతి విపత్తులు ఎలాంటి నష్టాలను దారితీస్తాయో తెలియదు ఈ ఇన్సూరెన్స్ వల్ల మనం ఆర్థిక  ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.