ఏవండోయ్ ఇది విన్నారా? స్ప్లెండర్ బైక్ రూ.20వేలేనటా!

హీరో స్ప్లెండర్ ప్లస్‌ కొనుక్కోవాలనుంకుంటుంటే, మీకిదే మంచి అవకాశం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బైక్​ తక్కువ ధరకే లభిస్తోంది.  మార్కెట్లో వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక పెట్రోల్ మాటైతే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు అమాంతంగా పెరిగిన సంగతి తెలిసిందే. జెట్ స్పీడ్​తో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు చూస్తేనే వాహనాలు కొనాలంటే భయమేస్తుంది. పెట్రోల్ పొదుపు చేయాలనుకునేవాళ్ళు మైలేజీ ఎక్కువ ఇచ్చే బైకులు కొంటున్నారు. హీరో స్ప్లెండర్ ప్లస్‌ మైలేజి బాగుంటుందనే పేరుంది.  HERO […]

Share:

హీరో స్ప్లెండర్ ప్లస్‌ కొనుక్కోవాలనుంకుంటుంటే, మీకిదే మంచి అవకాశం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బైక్​ తక్కువ ధరకే లభిస్తోంది. 

మార్కెట్లో వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక పెట్రోల్ మాటైతే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు అమాంతంగా పెరిగిన సంగతి తెలిసిందే. జెట్ స్పీడ్​తో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు చూస్తేనే వాహనాలు కొనాలంటే భయమేస్తుంది. పెట్రోల్ పొదుపు చేయాలనుకునేవాళ్ళు మైలేజీ ఎక్కువ ఇచ్చే బైకులు కొంటున్నారు. హీరో స్ప్లెండర్ ప్లస్‌ మైలేజి బాగుంటుందనే పేరుంది. 

HERO MOTOCORP వారి స్ప్లెండర్ బైక్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 100సీసీ ఇంజన్ కలిగిన ఈ బైక్ అతి తక్కువ ధరకే లభిస్తుండడంతో దీనిని కొనడానికి కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఈ బైక్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి అధిక మైలేజీని కూడా ఇస్తాయి. ఈ బైక్ కొత్తది కొనాలంటే ఎక్స్ షోరూమ్ ధర రూ.76,346. అంత పెద్ద మొత్తం ఖర్చుపెట్టడం ఇష్టంలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్ మోడల్ తీసుకుంటే బడ్జెట్లో వచ్చేస్తుంది. వీటికి EMI సౌకర్యం కూడా ఉంది. సంబంధిత ఆర్థిక సంస్థలు వీటి EMIని అందజేస్తాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ చాలా ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 20 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ సెకండ్ హ్యాండ్ మోడల్‌ గురించి వివరంగా తెలుసుకుందాం. పాత మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ DROOM సైట్‌లో చాలా తక్కువ ధరకే దొరుకుతోంది. 2014 మోడల్ సైట్‌లో కేవలం రూ.25,000కే అందుబాటులో ఉంది. ఈ బైక్‌పైన మంచి ఫైనాన్స్ ప్లాన్ కూడా ఉంది. చాలా కొద్ది మొత్తాన్ని డౌన్ పేమెంట్‌‌‌‌‌గా పే చేసి, మిగిలిన మొత్తాన్ని EMI రూపంలో పే చేయవచ్చు. Hero Splendor Plus యొక్క సెకండ్ హ్యాండ్ మోడల్  QUIKR వెబ్‌సైట్‌లో కూడా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ సైట్‌లో 2015 మోడల్ బైక్ అందుబాటులో ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ మోడల్‌‌ని కేవలం 30 వేల రూపాయలకే కొనుక్కోవచ్చు. అయితే వీటికి EMI లాంటివేమీ ఉండవు. సెకండ్ హ్యాండ్ వస్తువుల మాట అనుకోగానే గుర్తొచ్చే సైట్ OLX. సెకండ్ హ్యాండ్ హీరో స్ప్లెండర్ ప్లస్‌ని OLXలో తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. ఈ సైట్‌లో 2012 మోడల్ బైక్ అమ్మకానికి ఉంది. దీని ధర కేవలం రూ.20 వేలు. ఇక బైక్స్ సెకండ్ హ్యాండ్ మోడల్ కొనే ముందు బైక్ కండిషన్ ఎలా ఉందో, డాక్యుమెంట్లు పక్కాగా ఇన్నాయో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే కొత్త మోడల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే డౌన్ పేమెంట్ కట్టి బైక్ తీసుకెళ్లవచ్చు. మిగిలిన మొత్తాన్ని EMIగా చెల్లించడానికి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కనుక హీరో స్ప్లెండర్ ప్లస్ కొనాలని భావిస్తున్న వారికి ఇదే సువర్ణావకాశం. కానీ ఇది సెకండ్ హ్యాండ్ బండి కావడం ఒక్కటే మైనస్.