రేపటి నుంచి అందుబాటులోకి న్యూ జనరేషన్ బుల్లెట్ 350

మార్కెట్లోకి ఎన్ని బైకులు వస్తున్నప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదని చెప్పుకోవాలి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి అబ్బాయిలు ఎంతగానో ఎదురు చూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ లాంచ్ కి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1న రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం […]

Share:

మార్కెట్లోకి ఎన్ని బైకులు వస్తున్నప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదని చెప్పుకోవాలి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి అబ్బాయిలు ఎంతగానో ఎదురు చూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ లాంచ్ కి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1న రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం.. 

బుల్లెట్ 350: 

2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సెప్టెంబర్ 1 లాంచ్‌కి దగ్గరగా ఉన్నందున, ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. ఎప్పుడొస్తున్న అబ్బాయికి అప్గ్రేట్ గురించి, స్పెసిఫికేషన్‌ల గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు, ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించిన టీజర్ అనేది నిజానికి బుల్లెట్ అభిమానుల ఆత్రుతను మరింత పెంచేస్తున్నాయి. అవునండి, రేపటి నుంచి అందుబాటులో ఉండనున్న బుల్లెట్ 350 విశేషాలు. దాని ప్రారంభానికి ఒక రోజు ముందు, కొత్త బుల్లెట్ 350కి సంబంధించిన ఒక చిన్న వాక్‌అరౌండ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త అప్‌డేట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని సెప్టెంబర్ 1, 2023న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇటీవలే టీజర్‌ను విడుదల చేసింది. ధర రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లెట్ 350 లాంచ్ చేసిన కొద్దిసేపటికే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 

ఈ బైక్‌ను భారతీయ రోడ్లపై పలుమార్లు పరీక్షించడం కూడా జరిగింది. డిజైన్ పరంగా, కొత్త బుల్లెట్ 350 మునుపటి జనరేషన్ మాదిరిగానే ఉంది కానీ అప్డేట్స్ అయితే ఉండనే ఉన్నాయి. అయితే మనబడి రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ తో పోలిస్తే, బుల్లెట్ 350 హెడ్ లైట్స్ అలాగే బ్యాక్ ఉండే లైట్స్ షేప్ అనేది డిఫరెంట్ గా వచ్చింది. అంతేకాకుండా బుల్లెట్ 350 ట్యాంక్‌పై 3D రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో ప్రత్యేకక ఆకర్షణ, అంతేకాకుండా లోగో పైన కిరీటం ఉంది, ఇది రెట్రో స్టైల్ మరొక సారి గుర్తు చేస్తుంది.

సింగిల్-పీస్ సీటు మరియు కొంచెం పెద్ద ఫెండర్‌లు. హెడ్‌లైట్ విజర్ లేకపోవడం కూడా ఇది మిడ్-స్పెక్ బుల్లెట్ అని తెలియజేస్తుంది. స్విచ్ గేర్, కొత్త సెమీ-డిజిటల్ కన్సోల్ మరియు కిక్-స్టార్టర్ లేకపోవడం వల్ల ఇది J-సిరీస్ బుల్లెట్ లాగా మనకి కనిపిస్తుంది. మెటోర్ 350, హంటర్ 350 మరియు క్లాసిక్ 350లలో చూసినట్లుగా 20.4PS, అంతేకాకుండా 27Nm మేకింగ్ 349cc ఇంజన్‌ గురించి మనకి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బుల్లెట్ 500సీసీ అందించే ఇంజన్ ఎలక్ట్రా వేరియంట్ తో వస్తున్నట్లు, ప్రస్తుతం వైరల్ గా మారిన బుల్లెట్ 350 వీడియో చెబుతోంది. కానీ ఇప్పుడు కిక్-స్టార్ట్ అయిపోయినందున, ప్రస్తుతం టీజర్ లో చూపించిన ఎలక్ట్రా ప్రస్తావన నిజం కాదు అంటున్నారు మరికొందరు. 

ఫేమస్ అయిన బుల్లెట్: 

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ప్రస్తుత కాలంలో ఎంతో విస్తృతంగా ఫేమస్ అయ్యాయని చెప్పుకోవాలి. నిజానికి కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి రిటైర్ అయిపోయిన వారు కూడా ఈ బుల్లెట్ మీద వెళ్లేందుకు మక్కువ చూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలకు కూడా ఈ బుల్లెట్ బండి మీద ప్రయాణించేందుకు ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తెలుగు సినిమాలలో కూడా ఈ బుల్లెట్ మీద ఎన్నో పాటలు వచ్చేసాయి. ఇంత క్రేజ్ ఉన్న ఈ భారతీయ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ దాన్ని కొత్త మోడల్ ని రేపు పరిచయం చేయబోతోంది. మరి ఇప్పుడు ఇది ఎంత క్రజ్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.