ఇంటర్నెట్ ఆవశ్యకత

ఇంటర్నెట్ ను అందరికీ అందుబాటులో ఉంచాలినీరు, విద్యుత్ లాగానే వ్యాట్ కూడా తగ్గించాలి బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల కోసం రూపొందించిన రాయితీ ఒప్పందాలు, ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మందిని బ్రాడ్ బ్యాండ్ సేవలు తీసుకునేలా చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రయోజనాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలి అని వారు సూచించారు. బ్రాడ్‌బ్యాండ్‌పై వ్యాట్‌ను తగ్గించడం వలన ఎక్కువ మంది వినయోగదారులను ఆకర్షించవచ్చని డిజిటల్ మినహాయింపు విచారణ సంస్థకు లార్డ్స్ డిజిటల్ కమిటీ వెల్లండించింది.  చౌకైన […]

Share:

ఇంటర్నెట్ ను అందరికీ అందుబాటులో ఉంచాలి
నీరు, విద్యుత్ లాగానే వ్యాట్ కూడా తగ్గించాలి

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల కోసం రూపొందించిన రాయితీ ఒప్పందాలు, ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మందిని బ్రాడ్ బ్యాండ్ సేవలు తీసుకునేలా చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రయోజనాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలి అని వారు సూచించారు. బ్రాడ్‌బ్యాండ్‌పై వ్యాట్‌ను తగ్గించడం వలన ఎక్కువ మంది వినయోగదారులను ఆకర్షించవచ్చని డిజిటల్ మినహాయింపు విచారణ సంస్థకు లార్డ్స్ డిజిటల్ కమిటీ వెల్లండించింది. 

చౌకైన సామాజిక టారిఫ్‌లను ఉపయోగించి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారు గ్రూప్ కు చెందిన రోసియో కొంచా కోరారు. ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం సంస్థలకు పిలుపునిచ్చింది. రోజూ పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా గృహ బడ్జెట్‌లు అధికమవుతూ సామాన్యులను ఒత్తిడికి గురిచేస్తూనే ఉన్నాయి. దీని ఫలితంగా ఎక్కువ మంది వ్యక్తులు డిజిటల్ సేవలను వినియోగించుకోవడం లేదని చైర్‌వుమన్ బారోనెస్ స్టోవెల్ తన ప్రారంభ వ్యాఖ్యలలో చెప్పారు. డిజిటల్ మినహాయింపు అనేది ఇంటర్నెట్‌తో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సమస్యలను వివరించే పదం అని నిపుణులు కమిటీకి చెప్పారు. డిజిటల్ పరికరాల యాక్సెస్ లేకపోవడం,  దానికి కనెక్ట్ చేయడానికి పరికరం లేకపోవడం, ఉపయోగించే నైపుణ్యాలు లేకపోవడం లేదా దానిని ఉపయోగించగల విశ్వాసం లేకపోవడం కూడా డిజిటల్ మివనహాయింపు కిందకు వస్తాయని తెలిపారు.

ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్‌కి చెందిన రోలాండో మోర్గాన్ ప్రకారం కీలక సమూహాలకు డిజిటల్ సేవలను అందించడం వల్ల రానున్న 10 సంవత్సరాలలో 13.7 బిలియన్ పౌండ్ల ఆర్థిక ప్రయోజనాలను కేవలం 1.4 బిలియన్ పౌండ్ల ఖర్చుతో పొందవచ్చని కమిటీ పేర్కొంది.

కన్నీళ్ల పర్యంతమయ్యారు

“20 కుటుంబాలలో ఒకరికి ఫిక్స్‌డ్ లైన్ లేదా మొబైల్ ఇంటర్నెట్ లేదు అని ది గుడ్ థింగ్స్ ఫౌండేషన్ యొక్క ఛారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెలెన్ మిల్నర్ చెప్పారు. అవన్నీ స్థోమత సమస్యల వల్ల కాకపోవచ్చు. కానీ ఫుడ్ బ్యాంక్‌లు పెద్దగా డిమాండ్‌ ఎదుర్కొలేదని, అయితే ఇంటర్నెట్ యాక్సెస్ వోచర్‌లను అందించే ఫౌండేషన్ డేటాబ్యాంక్ సేవ చాలా ఎక్కువ డిమాండ్‌ను చూసింది అని ఆమె చెప్పారు. మిల్నర్ ఇలా అన్నారు “డేటాబ్యాంక్ ద్వారా మేము 10  పౌండ్ల టాప్-అప్ ఇచ్చినందుకు ఒక యువతి ఏడ్చేసింది. ఆ సహాయంతో ఆమె ఐర్లాండ్‌లోని తన తల్లితో మాట్లాడగలిగింది. ఎందుకంటే ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమెకు వాళ్లతో మాట్లాడటానికి ఎటువంటి అవకాశం లేకపోయింది. అందువల్ల, మేము ఇలా చాలా చాలా తక్కువ డబ్బు ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాము. బర్మింగ్‌హామ్‌లో ఇలాంటి డేటా బ్యాంక్‌లకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. 

టెలికాం రెగ్యులేటర్ ఆఫ్‌కామ్ ప్రకారం.. అక్టోబర్ 2022లో గణాంకాలు 9.1 మిలియన్ల UK కుటుంబాలు (32%) తమ ఫోన్, బ్రాడ్‌బ్యాండ్, పే-టీవీ మరియు స్ట్రీమింగ్ బిల్లులు చెల్లించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అంటే ఇది ఏప్రిల్ 2021 స్థాయికి రెట్టింపు అని వారు పేర్కొన్నారు. అలాగే 17% కుటుంబాలు కమ్యూనికేషన్ సేవలను కొనుగోలు చేయడానికి ఆహారం, దుస్తుల వంటి ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నాయని తెలిపారు. ఇది జూన్ 2021లో చేసిన దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది మొబైల్ ఫోన్ లేదా బ్రాడ్‌బ్యాండ్ బిల్లులు చెల్లించడానికి కష్టపడుతున్నారని డిజిటల్ పావర్టీ అలయన్స్ సర్వేలో తేలింది.

ఎసెన్షియల్ యుటిలిటీ

చౌకైన సోషల్ టారిఫ్‌లు బెనిఫిట్ క్లెయిమ్‌ సెటిల్ మెంట్ కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే సోషల్ టారిఫ్‌కు అర్హత పొందిన వారిలో కేవలం 3.2% మంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని, చాలా మందికి అవి ఉన్నాయని తెలియదని కొంచా చెప్పారు. ఇంటర్నెట్‌కు యాక్సెస్ అనేది నేటి ప్రపంచంలో ఒక ముఖ్యమైన యుటిలిటీ. నీరు, గ్యాస్ మరియు విద్యుత్‌ లాగానే ఇంటర్నెంట్ ను యాక్సెస్ చేయడం కూడా అంతే ముఖ్యమైనది అని శ్రీమతి కొంచా చెప్పారు. గృహ వినియోగదారుల కోసం ఇంధనం, నీరు వంటి ఇతర యుటిలిటీల వలె డేటాను వ్యాట్ నుండి మినహాయించాలని ఆమె వాదించారు.