బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ

బ్లాక్ చెయిన్ కోర్సుతో అనేక అవకాశాలుఈ సాంకేతికతను ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి బ్లాక్‌చెయిన్ ఆధారిత క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ప్రజాదరణ పెరగడంతో బ్లాక్‌చెయిన్ ఖ్యాతిని పొందింది. బ్లాక్‌చెయిన్ అనేక ఉపయోగ సందర్భాలలో డిజిటల్ కరెన్సీ ఒకటి. బ్లాక్‌చెయిన్ భారతదేశంలోని పరిశ్రమల్లో విస్తృతంగా అవలంబించబడింది. గార్ట్‌నర్ ప్రకారం 2025 నాటికి  బ్లాక్‌చెయిన్ వినియోగం $176 బిలియన్ల వ్యాపార విలువను చేరుకోవచ్చని అంచనా. దీనిలోని పారదర్శకతతో కూడిన వివరణాత్మక లెడ్జర్ సాంకేతికత స్వభావం వినియోగానికి సురక్షితంగా ఉండటంతో పాటు హ్యాకర్లను […]

Share:

బ్లాక్ చెయిన్ కోర్సుతో అనేక అవకాశాలు
ఈ సాంకేతికతను ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి

బ్లాక్‌చెయిన్ ఆధారిత క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ప్రజాదరణ పెరగడంతో బ్లాక్‌చెయిన్ ఖ్యాతిని పొందింది. బ్లాక్‌చెయిన్ అనేక ఉపయోగ సందర్భాలలో డిజిటల్ కరెన్సీ ఒకటి. బ్లాక్‌చెయిన్ భారతదేశంలోని పరిశ్రమల్లో విస్తృతంగా అవలంబించబడింది. గార్ట్‌నర్ ప్రకారం 2025 నాటికి  బ్లాక్‌చెయిన్ వినియోగం $176 బిలియన్ల వ్యాపార విలువను చేరుకోవచ్చని అంచనా. దీనిలోని పారదర్శకతతో కూడిన వివరణాత్మక లెడ్జర్ సాంకేతికత స్వభావం వినియోగానికి సురక్షితంగా ఉండటంతో పాటు హ్యాకర్లను కట్టడి చేస్తుంది. అందువల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక అప్లికేషన్‌లలో ప్రజాదరణ పొందుతోంది.

స్పామ్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. రికార్డ్ కీపింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, రికార్డ్‌లను నిర్వహించడానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) అన్ని డిపాజిటరీలను ఆదేశించింది. ఎరువుల సబ్సిడీ, పంపిణీ, విద్యా ధృవీకరణ పత్రాల కోసం నీతి ఆయోగ్ బ్లాక్‌చెయిన్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసింది.

ఐటి మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సేవల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించడం కోసం ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌ను కూడా సిద్ధం చేసింది. హెల్త్ రికార్డ్స్, ప్రాపర్టీ రికార్డ్ కీపింగ్, పవర్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ సర్టిఫికేట్‌లు మరియు సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ కోసం దీనిని ఉపయోగించాలని యోచిస్తోంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకింగ్ డొమైన్‌లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అన్వేషిస్తోంది. భారతదేశంలోని కొన్ని అతిపెద్ద వినియోగ వస్తువుల కంపెనీలు, IT సేవా దిగ్గజాలు మోసాలను తొలగించడానికి.. లావాదేవీల రియల్ టైమ్ ట్రాకింగ్‌ను ప్రారంభించాయి. తద్వారా తమ సరఫరా గొలుసులను ట్రాక్ చేయడానికి మరియు నిర్వహించడానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికత వాళ్లకి సహాయపడుతుంది.

అంతులేని డేటా ప్రపంచంలో భద్రత, పారదర్శకతకు విలువనిచ్చే ఏ పరిశ్రమ అయినా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అవసరాన్ని అర్థం చేసుకుంటుంది. బ్లాక్‌చెయిన్ ఈ పరిశ్రమలను అత్యంత వేగంతో మార్చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ మరియు కార్పొరేట్ కరెన్సీ వంటి పరిశ్రమల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడం వల్ల నైపుణ్యం కలిగిన బ్లాక్‌చెయిన్ నిపుణుల కోసం డిమాండ్ విపరీతమైన పెరుగుదలకు దారితీసింది.

మీరు బ్లాక్‌చెయిన్ విప్లవంలో భాగం కావడానికి ఆసక్తి కలిగి ఉంటే మరియు మీ సంస్థలో ఉన్నత స్థాయి ప్రాజెక్ట్‌ల కోసం మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలనుకుంటే లేదా స్టార్టప్‌ను నిర్మించడానికి ఆసక్తిగా ఉంటే మీరు.. ఐఐఐటీ హైదరాబాద్ నుండి బ్లాక్ చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్‌లోని అధునాతన ధృవీకరణ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.

ఐఐఐటీ హైదరాబాద్ బ్లాక్ చెయిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, రిపుల్స్ యూబీఆర్ఐ, టాలెంట్ స్ప్రింట్ భాగస్వామ్యంతో బ్లాక్‌చెయిన్ బేసిక్స్ పై బలమైన అవగాహనను పెంపొందించే బ్లాక్‌చెయిన్ మరియు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద సీఎస్ రీసెర్చ్ గ్రూప్‌తో అనుబంధించబడిన ఒక ప్రత్యేకమైన పరిశోధన ఆధారిత సంస్థ, భారతదేశంలోని మొదటి ఐఐఐటీచే రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్, హైపర్‌లెడ్జర్‌ని ఉపయోగించి.. డీ యాప్ లను రూపొందించడానికి మరియు మల్టీచైన్, రిపుల్, కోర్డా అంతటా బ్లాక్‌చెయిన్ ట్రేడ్‌ ఆఫ్‌ల వంటి బ్లాక్‌చెయిన్ యొక్క ట్రైల్‌ బ్లేజింగ్ అప్లికేషన్‌లపై పని చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీరు ప్రాజెక్ట్‌లపై వైట్ పేపర్స్ పబ్లిష్ చేయడం, ఫేస్ బుక్, లిబ్రా వంటి కార్పొరేట్ కరెన్సీని నిర్మించడం కూడా నేర్చుకుంటారు.