గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పు తప్పదా? శాంసంగ్ ఫోన్‌లలో బింగ్

గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పు తప్పదా? అంటే తప్పదనే అంటున్నారు టెకీలు. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ నుంచి ముప్పు ఉందా అంటే.. అవుననే చెప్పాలి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎలక్ట్రానిక్ వస్తువులలో ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌కి బదులుగా మైక్రోసాఫ్ట్ బింగ్‌ను డీ ఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా వాడబోతోందనేది సమాచారం.  ఇదే జరిగితే గూగుల్ సుమారుగా రూ.300 కోట్ల డాలర్ల మేర […]

Share:

గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పు తప్పదా? అంటే తప్పదనే అంటున్నారు టెకీలు. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ నుంచి ముప్పు ఉందా అంటే.. అవుననే చెప్పాలి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎలక్ట్రానిక్ వస్తువులలో ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌కి బదులుగా మైక్రోసాఫ్ట్ బింగ్‌ను డీ ఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా వాడబోతోందనేది సమాచారం.  ఇదే జరిగితే గూగుల్ సుమారుగా రూ.300 కోట్ల డాలర్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని ఆ సంస్థలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడింగ్ స్థానంలో కొనసాగుతున్న శాంసంగ్ తన ప్రాధాన్యాలను మార్చుకోబోతున్నట్లు సమాచారం. అందుకే సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని Chat GPT ( చాట్ జీపీటీ) టూల్ నుంచి గట్టి పోటీ వస్తోంది.  చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్ బింగ్‌తో జత చేసిన తర్వాత ఆ పోటీ ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యిందని చెప్పాలి. గత నవంబర్లో వెలుగులోకి వచ్చిన ఈ చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ.. ఓపెన్ ఏఐ స్టార్టప్ సంస్థలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గూగుల్ కి పోటీగా మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ను చాట్‌జీ‌పీ‌ట కి  అనుసంధానం చేయనుంది…

మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్‌తో పాటు రెండు సంస్థల యాప్‌లు, అలాగే సర్వీసులను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది సాంసంగ్.  ఇకపోతే ఐడిసి డేటా ప్రకారం గత ఏడాది 21.1 కోట్ల స్మార్ట్ ఫోన్ లను విక్రయించగా.. ఈ ఫోన్లన్నీ కూడా గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తోనే పని చేస్తున్నాయి. మరోవైపు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లతో సుదీర్ఘకాలంగా శాంసంగ్ భాగస్వామి ఒప్పందాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ను  డిఫాల్ట్‌గా తొలగించి మైక్రోసాఫ్ట్ బింగ్‌ను తీసుకొచ్చే విషయమై శాంసంగ్ ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే ప్రకటిస్తామని.. ప్రస్తుతం రెండు సంస్థలతో సంప్రదిస్తున్నామని సాంసంగ్ తెలిపింది.

సాంసంగ్ నుంచి గూగుల్ డీఫాల్ట్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఇప్పుడు గూగుల్ స్థానంలో మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ అండ్ డిఫాల్ట్‌గా ఇవ్వడంపై ప్రస్తుతం పలు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్ తమ ఎలక్ట్రానిక్ పరికరాలలో గూగుల్‌ని కొనసాగించి.. ఈ చర్చలు సఫలమైతే త్వరలోనే బింగ్‌ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బింగ్ అమలులోకి వస్తే మాత్రం గూగుల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే మూడు బిలియన్ డాలర్ల మేర గూగుల్ కోల్పోతుందని అంచనాలు మొదలయ్యాయి.మరొకవైపు గూగుల్ కూడా తన మార్కెట్‌ను కాపాడుకోవడానికి పలు సెర్చ్ ఇంజన్ సర్వీస్‌లను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మ్యాగీ అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు తేవడంపై గూగుల్ ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన సుమారుగా 160 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. ఏది ఏమైనా మైక్రోసాఫ్ట్ బింగ్ రావడంతో గూగుల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ దెబ్బని గూగుల్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.