ఇంటర్నెట్‌లో ఫోన్ నెంబర్లను వెతుకుతున్నారా.. అయితే ముందుగా ఇది తెలుసుకోండి

సెర్చ్ ఇంజన్‌ లో ఫోన్ నంబర్ కోసం వెతకడం చాలా సులువైన పనిగా అనిపించవచ్చు.. కానీ, ఇది సరైన పద్దతి కాదు. దీని వెనుక సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఓ కన్నేసి ఉంచుతారన్న సంగతి ఎక్కువ మంది మర్చిపోతున్నారు. గూగుల్‌లో ఏదైనా వెతకొచ్చు.. అలాగనీ, ఫోన్ నంబర్లను వెతకడం అనేది ఎంత మాత్రం సరైనది కాదు. ఫోన్ నంబర్లను నేరుగా ఎంటర్‌ చేస్తే.. అవసరమైన సమాచారం కన్నా, పనికిరానిదే ఎక్కువగా ప్రత్యక్షమవుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక అనుక్షణం […]

Share:

సెర్చ్ ఇంజన్‌ లో ఫోన్ నంబర్ కోసం వెతకడం చాలా సులువైన పనిగా అనిపించవచ్చు.. కానీ, ఇది సరైన పద్దతి కాదు. దీని వెనుక సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఓ కన్నేసి ఉంచుతారన్న సంగతి ఎక్కువ మంది మర్చిపోతున్నారు. గూగుల్‌లో ఏదైనా వెతకొచ్చు.. అలాగనీ, ఫోన్ నంబర్లను వెతకడం అనేది ఎంత మాత్రం సరైనది కాదు. ఫోన్ నంబర్లను నేరుగా ఎంటర్‌ చేస్తే.. అవసరమైన సమాచారం కన్నా, పనికిరానిదే ఎక్కువగా ప్రత్యక్షమవుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక అనుక్షణం ఇంటెర్నెట్‌ సేవలపై ఆధారపడుతున్నాం. ఫోన్‌ నంబర్లు మొదలుకొని, వెళ్లాల్సిన చోటు వరకు బుర్రకు పదును తగ్గించి నెట్‌లోకి తొంగి చూస్తున్నాం. ఈ వెతికే క్రమంలో మనల్ని ఎవరో ఓ కంట కనిపెడుతున్నారన్న సంగతే గమనించడం మర్చిపోతున్నాం. మనం ఈ ఫోన్ నంబర్లను వెతికేటప్పుడుఎం, మన సెర్చులపై.. వెనకాల సైబర్‌ నేరగాళ్లు రీసెర్చ్‌ చేసేస్తున్నారన్న సంగతి గుర్తించడం లేదు. ఈ ఆదమరపే వాళ్లకు ఆదరువుగా మారుతున్నది. 

ఇది అనేక విధాలుగా జరుగుతుంది. గూగుల్‌ లో కంపెనీ కస్టమర్ కేర్ కోఆర్డినేట్‌లను మార్చడం, ఇంకా సెర్చ్ ఫలితాల్లో వారి బోగస్ నంబర్‌ను ప్రజలు వాడటానికి..  SEOని ఉపయోగించడం ఒక సాధారణ పనిగా మారింది. కస్టమర్ కేర్ కోఆర్డినేట్‌ల కోసం వెతుకుతున్నప్పుడు.. సెర్చ్ ఫలితాల నుండి మొదటి నంబర్‌ ను డయల్ చేయడం ద్వారా వారి ఉచ్చులో పడతారు. ఇవన్నీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మాత్రమే జరగడమే కాకుండా, గూగుల్ మ్యాప్స్ లోని ప్రముఖ రిటైల్ దుకాణాలు, బ్యాంకు  ఆధారిత నంబర్స్ కి డయల్ చేసినప్పుడు, యూజర్స్ వారి వలలో చిక్కుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ కస్టమర్ లు అందరికీ సవరణ హక్కులను అనుమతులను అందించడం వలనే, ఇది మోసానికి సులభమైన వేదికగా మారుతొంది.

ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే..  కార్డ్ నంబర్, CVV, ATM పిన్, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, వన్-టైమ్-పాస్‌వర్డ్‌లు (OTP) వంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరు కూడా ఎవరితోనూ, ఫోన్ ద్వారా పంచుకోవద్దు. సాధారణంగా, ఏ బ్యాంకులు, మరే ఇతర కంపెనీ లు వారి కస్టమర్‌ లను ఫోన్‌లో రహస్య వివరాలను అడగదు.  ఒకవేళ మీరు గనక ఈ సైబర్ క్రైమ్ లో చిక్కుకుంటే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి. లేదంటే బ్యాంకుకు సంబంధించిన వెబ్‌సైట్లలో వారి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ కి కాల్ చేసి, మీ సమస్యని తెలపండి. చెల్లింపు కంపెనీలు, ఇ-కామర్స్ వ్యాపారులు, ఇంకా ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా తమ వినియోగదారులకు మోసాన్ని నివేదించడానికి వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌ లో ఒక్ ఆప్షన్ ను అందిస్తాయి. మీరు వాటిని ఉపయోగించి మాత్రమే మీ సమస్యని తెలపండి.