నకిలీ ChatGPTలతో జాగ్రత్త.. FB మాల్వేర్ తో మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్

నకిలీ ChatGPT పట్ల జాగ్రత్త వహించండి. FB మాల్వేర్.. క్యాంపెయిన్ అకౌంట్స్ ని లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ChatGPT అధికారిక సైట్‌లో మాత్రమే సేవను ఉపయోగించండి. కేవలం ఒక నెలలో ఇప్పటికే ఈ FB మాల్వేర్ 13 Facebook అకౌంట్స్ మరియు పేజీలను ప్రభావితం చేసింది. ఈ అకౌంట్స్ కి 500K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా.. ఈ 13 ఖాతాల్లో ఒకటి మన దేశానికి చెందిన ఫేస్ బుక్ […]

Share:

నకిలీ ChatGPT పట్ల జాగ్రత్త వహించండి. FB మాల్వేర్.. క్యాంపెయిన్ అకౌంట్స్ ని లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ChatGPT అధికారిక సైట్‌లో మాత్రమే సేవను ఉపయోగించండి.

కేవలం ఒక నెలలో ఇప్పటికే ఈ FB మాల్వేర్ 13 Facebook అకౌంట్స్ మరియు పేజీలను ప్రభావితం చేసింది. ఈ అకౌంట్స్ కి 500K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా.. ఈ 13 ఖాతాల్లో ఒకటి మన దేశానికి చెందిన ఫేస్ బుక్ పేజీ ఉంది. ఈ పేజీ 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉంది. యూట్యూబ్‌ లో ఉండే సెలెబ్రిటీల అకౌంట్స్ ని హ్యాక్ చేసి బెదిరంపులకు పాలపడినట్లు సమాచారం. అదే తరహాలో ఫేస్ బుక్ అకౌంట్స్ ని లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేశారని CloudSEK పరిశోధకులు పేర్కొన్నారు. 

ChatGPT కి వస్తున్నప్రజాదరణను ఆసరాగా చేసుకొని..  సైబర్ నేరగాళ్లు ఫిబ్రవరి మధ్యలో మాల్వేర్ కాంపెయిన్ ప్రారంభించినట్టు CloudSEK పరిశోధకులు తెలిపారు.

ఒక నెలలో, ఇది ఇప్పటికే 13 Facebook ఖాతాలు లేదా పేజీలను ప్రభావితం చేసింది. 500K కంటే ఎక్కువ మంది అనుచరులు ఉన్నారు. ఇందులో ఒక భారతీయ పేజీ 2 లక్షలకు పైగా అనుచరులను కలిగి ఉంది. బెదిరింపు నటులు యూట్యూబ్‌ అకౌంట్స్ ని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే ఉన్న ఖాతాలను హ్యాక్ చేశారని, ఫేస్‌బుక్ ఖాతాలు మరియు పేజీల కోసం వారు అదే పద్ధతిని అనుసరిస్తున్నారని CloudSEK బృందం వెల్లడించింది.

Facebook పేజీలను, అకౌంట్ లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి చేసుకున్న తర్వాత సైబర్ నేరగాళ్లు ప్రొఫైల్ సమాచార విభాగాన్ని ప్రామాణికమైన ChatGPT పేజీలా కనిపించేలా మార్చేశారు. సీలెబ్రిటీల అకౌంట్స్ ప్రొఫైల్స్ లకు కూడా “ChatGPT OpenAI” అనే యూజర్ నేమ్ గా మార్చారు. అదే విధంగా ChatGPT చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా మార్చేశారు.

ఈ హ్యాక్ చేసిన ఖాతాలను ఉపయోగించి, సైబర్ నేరగాళ్లు “చాట్‌జిపిటి లేటెస్ట్ వెర్షన్, జిపిటి-వి4”ని ప్రచారం చేస్తూ ఫేస్‌బుక్ యాడ్స్ ని కూడా రన్ చేశారు. దీంతో వీటిని డౌన్‌లోడ్ చేసినప్పుడు, బాధితుడి డివైజ్ లో డేటా చోరీ చేసే మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

ఇక డివైజ్ లో డౌన్లొడ్ అయిన మాల్వేర్‌ ద్వారా..  డివైజ్ లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోతుంది. దీంతో మన ఫోన్లో సేవ్ చేసుకున్న ప్రతి సమాచారంతో మనల్ని బెదిరింపులకు గురి చేస్తారు. అదే విధంగా మన మొబైల్స్ ఉన్న పేమెంట్ యాప్స్ ద్వారా కూడా మన బ్యాంకు అకౌంట్స్ నుండి డబ్బులు కాజేస్తారు.  మన వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం ప్రారంబిస్తారు. ఇక మనం చేసేది ఏమి లేక వాళ్ళ ఉచ్చులో పడి సైబర్ నేరగాళ్లు చెప్పిందల్లా చేస్తుంటాం. ఎంత డబ్బైనా ఇస్తుంటాం. అందుకే ఏదైనా లింక్స్ క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.  ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకునేప్పుడు అది మంచి యాపేనా కదా అని వెరిఫై చేసుకున్న తరువాతనే డౌన్ లోడ్ చేసుకోవాలి. 

ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం మంచిదని.. దీంతో సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ కేసును పరిశీలిస్తారని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.