మరింత కొత్తగా యాపిల్ వాచ్

యాపిల్ వాచ్.. యాపిల్ వాచ్.. యాపిల్ వాచ్. ప్రస్తుతం ఎవర్ని చూసినా సరే.. అప్పు చేసైనా సరే యాపిల్ వాచ్ ను కొంటున్నారు. వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. అందుకోసమే కొంత మంది ఈ వాచెస్ (యాపిల్ ప్రొడక్ట్స్) కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయినా కానీ చాలా మంది అప్పు చేసి పప్పు కూడు లాగ యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తారు. అందుకోసమే ఈ యాపిల్ ప్రొడక్ట్స్ కు క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ […]

Share:

యాపిల్ వాచ్.. యాపిల్ వాచ్.. యాపిల్ వాచ్. ప్రస్తుతం ఎవర్ని చూసినా సరే.. అప్పు చేసైనా సరే యాపిల్ వాచ్ ను కొంటున్నారు. వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. అందుకోసమే కొంత మంది ఈ వాచెస్ (యాపిల్ ప్రొడక్ట్స్) కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయినా కానీ చాలా మంది అప్పు చేసి పప్పు కూడు లాగ యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తారు. అందుకోసమే ఈ యాపిల్ ప్రొడక్ట్స్ కు క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రేజ్ ను యాపిల్ కంపెనీ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకోసమే మార్కెట్లో లేని కొత్త కొత్త ఫీచర్లను తన ప్రొడక్టులలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. కేవలం వాచెస్ అని మాత్రమే కాకుండా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటిలో ఇటువంటి క్రేజీ ఫీచర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఏటా యాపిల్ సంస్థ సెప్టెంబర్/అక్టోబర్ లో తన ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ ఈవెంట్ ను సెప్టెంబర్ 12న ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో కొత్త కొత్త ప్రొడక్టులు లాంచ్ అవుతూ ఉంటాయి. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా యాపిల్ వాచెస్ కూడా లాంచ్ అవుతాయి. అందుకోసమే ఈ ఈవెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

మరింత కొత్తగా 

యాపిల్ కంపెనీ ఏటా కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలను తన ఈవెంట్ల కోసం వాడుకుంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా యాపిల్ కంపెనీ తన ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఈవెంట్ లో యాపిల్ ఫోన్ 15 సిరిస్ తో పాటుగా యాపిల్ కొత్త వాచ్ ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది.  టెక్ న్యూస్ బ్లూమ్ బర్గ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం యాపిల్ కంపెనీ తన వాచ్ సిరీస్ 9ని రిలీజ్ చేయనుందట. ఇప్పటికే యాపిల్ కంపెనీ స్మార్ట్ వాచ్ లో మనకు అనేక ఫీచర్స్ ఉంటాయి. మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ వాచెస్ ఉన్నా కానీ యాపిల్ వాచ్ లో మనకు లభించిన ఫీచర్స్ వేరే ఏ ఇతర కంపెనీ వాచ్ లో మనకు లభించవు. అందుకోసమే అంతా అప్పు చేసైనా సరే యాపిల్ వాచ్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. 

సిరీస్ 9లో కొత్తవి ఇవే..

యాపిల్ వాచ్ అంటేనే కొత్త కొత్త ఫీచర్లకు పెట్టింది పేరు. అటువంటిది మళ్లీ కొత్త సిరీస్ లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయని అంతా చూస్తారు. అయితే తన పాత సిరీస్ కు కొత్త సిరీస్ కు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ వచ్చే యాపిల్ కంపెనీ ఈ సారి కూడా కొత్త ఫీచర్లను తీసుకొస్తుందట. అవేంటంటే… 

యాపిల్ వాచ్ అంటే డయల్ కు పెట్టింది పేరు. మార్కెట్లో లభించే అన్ని రకాల వాచ్ లతో పోల్చుకుంటే యాపిల్ వాచ్ లలో డయల్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఏ సిరీస్ వాచ్ తీసుకున్నా సరే డయల్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ యాపిల్ వాచ్ 9 సిరీస్ లో కూడా డయల్ 49 మి.మీ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఈ వాచ్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యాపిల్ వాచ్ అనేది ఎన్నో రోజుల నుంచి వాడిన ప్రాసెసర్ నే ఇందులో కూడా వాడింది. ఇందులో కొన్ని రకాల విషయాలను అప్ గ్రేడ్ చేసినా కూడా ప్రాసెసర్ ను మాత్రం మార్చలేదు. అందుకోసమే ఈ సారి కూడా యాపిల్ వాచ్ నుంచి అటువంటి ఫీచర్స్ నే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. 

కొత్తరకమైన చిప్

ఈ సారి యాపిల్ వాచ్ లో కొత్త రకమైన చిప్ ను అందిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కానున్న కొత్త మోడల్స్ లో గతంతో పోలిస్తే ఇంకా మెరుగైన చిప్ ఉండే అవకాశం ఉందట. ఈ కొత్త రకమైన చిప్ లో మరింత ఖచ్చితత్వం ఉంటుందని అంతా అంటున్నారు. ఈ సిరీస్ 9లో ఉండే కొత్త రకమైన చిప్ అనేక ఇతర ముఖ్యమైన విషయాలను కలిగి ఉంటుందని అంతా చెబుతున్నారు. ఈ చిప్ ద్వారా లొకేషన్ మరింత ఖచ్చితత్వంతో తెలిసే అవకాశం ఉంది. యాపిల్ వాచ్ అల్ట్రాలో ఎటువంటి ఫీచర్ ఉంటుందో ఇందులో కూడా అదే ఉంటుందని అంతా అంటున్నారు. అంతే కాకుండా యాపిల్ ఐ ఫోన్ 15లో ఉండే ఫ్రేమ్ కూడా ఇందులో ఉంటుందట. ఈ విషయాలను చూసి యాపిల్ వాచ్ లవర్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కొత్త ఫీచర్స్ ఉన్న వాచెస్ మార్కెట్లోకి వస్తాయా? అని అంతా ఎదురు చూస్తున్నారు. యూజర్స్ ఎదురు చూసిన విధంగానే అన్ని కొత్త సౌకర్యాలను తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ సన్నాహకాలు చేసింది.